ఆంధ్రప్రదేశ్

పోలవరం ప్రాజెక్టు ట్రెండ్ మార్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

పోలవరం పనులు ఇక పరుగులు పెట్టిస్తామంటున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వారం వారం ప్రతి సోమవారం పోలవరం పనులను సమీక్షిస్తూ.. జెట్‌ స్పీడ్‌లో ప్రాజెక్ట్‌ను పూర్తిచేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం పనుల్లో వేగం పెంచింది. నిర్దిష్ట కాలపరిమితితో ప్రణాళికలు రూపొందించి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షిస్తూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ట్రెండ్ మార్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటివరకు …

Read More »

ఇచ్చిన మాటకు కట్టుబడి మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఆరు నెలలలోపే నేరవేర్చుకున్నారు. పిఠాపురంలో 100 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది.ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. …

Read More »

బోడ కాకర కాయతో బోలెడు లాభాలు..తెలిస్తే బోరు అనకుండా తింటారు..!

బీడు భూములు, కొండ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతాయి. ముఖ్యంగా జూన్-జులై మాసాల్లో మొలకెత్తి ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఇక వీటి ధర చికెన్‌, మటన్‌ ధరతో పోటీ పడుతుందని చెప్పాలి. అలాంటి బోడ కాకరకాయ లాభాలు తప్పక తెలుసుకోవాల్సిందే..బోడ కాకర..ఇటీవలి కాలంలో బాగా పాపులర్‌ అయింది. కరోనా తర్వాత ప్రజలు ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకున్నారు. ఆరోగ్యానికి అవసరమైన ఆహారాలు తీసుకోవటం అలవాటు చేసుకుంటున్నారు. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటున్నారు. వాటితో పాటు సేంద్రీయ ఉత్పత్తులు …

Read More »

ఛీ.. ఛీ.. వీళ్ళు బంధువులా? లేక రాబందువులా? తల్లి అని కనికరం లేకుండా..

కృష్ణా జిల్లాలో జరిగిన ఓ ఘటన అందరిని కలచి వేస్తుంది. నవ మాసాలు మోసి కనిపించిన ఆ తల్లిని నడిరోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయారు. వృద్ధురాలనే కనికరం కూడా లేకుండా కారులో తీసుకువచ్చి రోడ్డుపై వదిలేసి వెళ్లారు.వృద్ధులైన తల్లిదండ్రులను కొందరు మూర్ఖులు భారంగా భావిస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేసిన వారిని కూడా అనాధలుగా నడిరోడ్డుపై వదిలేసి వెళ్ళిపోతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కన్న తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవాల్సిన వారే తల్లిదండ్రుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు. కృష్ణా జిల్లాలో జరిగిన ఓ ఘటన …

Read More »

నకిలీ ప్రొఫైల్స్.. నిజమైన నష్టాలు..! వాట్సాప్ డీపీ తో 5 లక్షలు స్వాహా..

సాధారణంగా స్నేహితులంటే అమితమైన ప్రేమ ఉన్నవారు అడగంగానే ఏదైనా చేసేస్తారు. అందులో భాగంగానే పాపం ఈ స్నేహితుడు తన స్నేహితుడి ఫోటో ఉన్న వాట్సాప్ నుంచి డబ్బులు అవసరం అంటూ మెసేజ్ రావడంతోనే 500000 పంపేశాడు. తీరా అది స్నేహితుడు కాదని తెలుసుకుని అవాక్కయ్యాడు.. వినటానికి మరి విడ్డూరంగా ఉన్న.. నిజమైన ప్రేమ గుడ్డిది అన్నట్లుమోసపోయేవారు ఉంటే మోసం చేసేవారికి హద్దే లేదు… ఈ మధ్యకాలంలో మోసపోయిన తర్వాత గాని ఇలా కూడా మోసం చేస్తారా అనేలా ఉన్నాయి ప్రస్తుత రోజుల్లో జరుగుతున్న మోసాలు …

Read More »

ఛీ.. ఛీ.. ఆస్తి కోసం ఎంత పని చేశావ్.. సొంత అన్నదమ్ములను కడతేర్చిన సోదరి..

వ్యసనాలకు బానిసయ్యారు.. తండ్రి డబ్బులు కోసం కుస్తీ పడ్డారు. ఒకరిపై మరొకరికి అనుమానం పెరిగిపోయింది. దీంతో ఆస్తిని దక్కించుకునే క్రమంలో అన్నదమ్ముల్నే ఏకంగా హత్య చేసింది ఒక సోదరి… ఈ విషాద ఘటన పల్నాడు జిల్లా నకరికల్లులో చోటు చేసుకుంది.మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. మారిపోతున్న మానవీయ విలువల గురించి ఈ పాటను మనం తరచూ గుర్తుచేసుకుంటుంటాం.. నిజంగా.. నేటి సమాజంలో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.. ఆధునిక కాలంలో మనుషులంతా మారిపోతున్నారు. ఒకప్పుడు మానవ సంబంధాలకు పెద్దపీట వేసే వారు.. …

Read More »

ఆత్మలపై రుణాలు.. ఇదేంటని రికవరీ ఏజెంట్లు ఇంటికి వెళ్లగా.. బయటపడ్డ విస్తుపోయే నిజాలు

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు. అలాగే జరిగింది ఓ ఫైనాన్స్ కంపెనీలో.. అదునుగా భావించిన ఓ ఘరానా ఉద్యోగి పని చేస్తున్న కంపెనీనే బురిడీ కొట్టించాడు. లోన్‌ల పేరిట ఏకంగా ఆరు కోట్లకు టోకరా పెట్టేసి పరారయ్యాడు.అలా‌ ఇలా కాదు ఏకంగా చనిపోయిన వారి పేరు మీద హౌస్ లోన్లు తీసుకొని.. వాటికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఇటు‌ పని చేస్తున్న సంస్థను అటు నమ్మిన స్నేహితులను ఆ ఘనుడు నట్టెట్ట ముంచేశాడ. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా …

Read More »

అతుల్ ఆత్మహత్య.. తెరపైకి కొత్త డిమాండ్.. ఆ చట్టం తేవాలని..

బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది.భార్య టార్చర్ తట్టుకోలేక బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ఆత్మహత్య చేసుకునే ముందు 40 పేజీల లేఖ రాసి.. మరో 80 నిమిషాల వీడియో తీసి.. తాను ఏ విధంగా వేధింపులకు గురవుతున్నానని విషయాన్ని ప్రస్తావించడం… …

Read More »

అయ్యో దేవుడా.. ఉదయాన్నే ఎంత ఘోరం జరిగింది.. స్కూల్‌బస్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యానికి..

స్కూల్ బస్సు వచ్చింది.. ఎప్పటిలాగే.. విద్యార్థులంతా బస్సెక్కి స్కూల్ కు బయలు దేరారు.. మార్గ మధ్యలో బస్‌ రేడియేటర్‌లో నీళ్లు అయిపోవడంతో.. డ్రైవర్ వెంటనే బస్సును ఆపాడు.. రేడియేటర్ చెక్ చేసి.. ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పిలిచి నీళ్లు తేవాలంటూ పక్కే ఉన్న కుంట దగ్గరికి పంపించాడు.. అయితే.. ఆ విద్యార్థి డబ్బా తీసుకుని.. పొలంలో ఉన్న కుంట దగ్గరికి వెళ్లాడు.. అక్కడ డబ్బాలో నీళ్లు నింపుతూ విద్యార్థి కుంటలో జారి పడ్డాడు.. ఈత రాకపోవడంతో కేకలు వేస్తూ నీళ్లలో మునిగిపోయాడు.. …

Read More »

రూ. 4కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ కట్టిన జనం..

అసలే చలికాలం.. అందులో వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ గుమగుమలాడితే నోరూరుతుంది కదా..! అది కూడా కేవలం నాలుగు రూపాయలకే మంచి చికెన్ దమ్ బిర్యాని ఇస్తే..! ఇక చెప్పేదేముంది.. అందరూ ఆ రెస్టారెంట్ వైపు పరుగు తీశారు. ఏకంగా ఫ్యామిలీ ఫ్యామిలీలే క్యూ కట్టారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు అనే తేడా లేకుండా నాలుగు రూపాయల బిర్యానీ కోసం పోటీ పడడంతో ఆ క్యూ లైన్ కాస్త కిలోమీటర్లు చేరింది. ఇదిగో ఈ లైన్ అంతా ఏదో కొత్త సినిమా …

Read More »