ఆంధ్రప్రదేశ్

ఒక్కసారిగా పతనమైన టమాటా ధర.. కేజీ ఎంతో తెల్సా..?

మొన్నటివరకు పై చూపులు చూసిన టమాటా ధర ఒక్కసారిగా దారుణంగా పతనమైంది. ఏకంగా కిలో టమాటా ఒక్క రూపాయికి పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఎక్కడో.. ఏంటో.. ఇప్పుడు తెలుసుకుందాం…నిన్న మొన్నటి వరకూ టమాటా ఓ మోత మోగించింది. కొనాలంటేనే భయపడేలా చేసింది. సెంచరీ కొట్టి టమాటా సామాన్యులకు సవాల్‌ విసిరింది. ఆ తర్వాత.. చాలారోజుల వరకూ అరవై రూపాయలు.. కొద్దిరోజుల నుంచి నలభై రూపాయలు పలుకుతోంది. అయితే.. మారుతున్న మార్కెట్‌ పరిస్థితులతో టమాటా రేటు చిన్నగా దిగొచ్చింది. కొంతకాలంగా హెచ్చుతగ్గులతో నడుస్తున్న టమాటా ధర.. …

Read More »

నంద్యాల జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది!

నంద్యాల జిల్లా నందికొట్కూరు లోని బైరెడ్డి నగర్ లో ఉంటున్న లహరి.. స్థానిక నంది కాలేజీలో ఇంటర్ సెకండియర్ ఎంపీసీ చదువుతోంది. స్వగ్రామం వెల్దుర్తి మండలం రామళ్లకోట. అయితే తండ్రి మృతి చెందడంతో నందికొట్కూరులో అమ్మమ్మ దగ్గర ఉంటూ చదువుతోంది. అదే మండలంలోని కలుగొట్ల గ్రామానికి చెందిన రాఘవేంద్ర అనే యువకుడు కేవలం పరిచయస్తుడు మాత్రమే. ప్రేమించాలని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఎగ్జామ్స్ దగ్గరగా ఉండటంతో లహరి చదువు మీద శ్రద్ద పెట్టింది. ఆవేశం కసి పెంచుకున్న రాఘవేంద్ర.. ఈ తెల్లవారుజామున అమ్మమ్మ …

Read More »

ఆధార్ కార్డులాగా విద్యార్థులకు అపార్‌ కార్డ్‌.. దీని ప్రయోజనం ఏంటి?

APAAR ID Card: సెకండరీ స్కూల్స్ నుంచి కాలేజీల వరకు విద్యార్థులకు ఈ అపార్‌ కార్డును అందజేయాలని యోచిస్తున్నారు. ఈ అపార్‌ చాట్‌లో ఆధార్ కార్డ్ వంటి 12 అంకెల సంఖ్య ఉంటుంది. కార్డులో విద్యా సమాచారాన్ని నిల్వ చేస్తుంది..ప్రస్తుతం భారతదేశంలోని పౌరులందరికీ ఆధార్ గుర్తింపు కార్డు. ఆధార్ అనేది గుర్తింపు కార్డు మాత్రమే కాదు.. ప్రతి పనికి ఆధార్‌ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. ప్రస్తుతం ఆధార్ లేకుండా కొన్ని పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు …

Read More »

పేదింటి విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ 2024 మీ కోసమే! ఇలా దరఖాస్తు చేసుకోండి

పేదింటి విద్యా కుసుమాల చదువుకు ఆర్ధిక ఇబ్బందులు ప్రతిబంధకాలుగా నిలవకూడదనే ఉద్ధేశంతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) స్కాలర్ షిప్ అందిస్తోంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఎవరైనా ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు..చదువుకోవలన్న తపన కలిగిన ఎందరికో పేదరికం అడ్డుగా నిలుస్తోంది. దీంతో ప్రతిభ ఉండి కూడా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదువలేకపోతున్న ఎందరో యువత తమ కలలు సాకారం చేసుకునేందుకు తల్లడిల్లిపోతున్నారు. అటువంటి పేద విద్యార్థులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) …

Read More »

ఆంధ్రాలోని ఈ ప్రాంతాలకు ఉరుములతో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న భూమధ్య రేఖ ప్రాంతం, హిందూ మహాసముద్రం మీద ఉన్న అల్పపీడన ప్రాంతం, దాని అనుబంధ ఉవపరితల ఆవర్తనం సగటు సముద్రానికి 5.8 కిమీల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతున్నది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, వచ్చే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణం కొనసాగించి, ఆ తర్వాత డిసెంబర్ 11వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతం వద్ద ఉన్న శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరుతుంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ …

Read More »

ఏపీ రాజధాని పక్కనే బ్రహ్మ కైలాసం.! పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి..

పచ్చటి ప్రకృతి రమణీయతకు దగ్గరగా కైలాసాన్ని తలపించే ఈ క్షేత్రం.. బ్రహ్మకైలాసంగా ప్రసిద్ది చెందింది. బ్రహ్మలింగేశ్వరుడు కొలువైన శివలింగాలపురం కొండ చుట్టూ ఒక గుండ్రటి ఆకారంలో చుట్టూ కొండలు ఉన్నాయి. ఈ కొండ పైనుంచి ఎటు చూసినా వలయాకారంలో కొండలే కనిపిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఏదో ఒక కొత్త లోకంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరో విధంగా చెప్పాలంటే…మనం భూమి మీద కాకుండా మరో గ్రహంలో ఉన్నామా..? అన్న భ్రమలోకి వెళతాము. అందుకే దీన్ని బ్రహ్మ కైలాసంగా భావిస్తారు. ఎంతో ఘనమైన చారిత్రక నేపథ్యం ఉన్న …

Read More »

బెయిల్‌పై బయట ఉన్న జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఇక శాశ్వతంగా..

లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అభియోగాలు ఎదుర్కొంటున్నారు టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఇదే కేసులో జైలుకు వెళ్లి వచ్చారు జానీ. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న ఈ స్టార్ కొరియోగ్రాఫర్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది.గత కొన్ని రోజులుగా అటు పర్సనల్ లైఫ్ లోనూ, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లోనూ బాగా స్ట్రగుల్ అవుతున్నాడు స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. తన దగ్గర పనిచేసిన ఓ లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు జానీపై …

Read More »

రాజ్యసభ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ.. ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్య

ఇట్స్‌ అఫీషియల్‌. బీజేపీ నుంచి రాజ్యసభకు ఆర్‌.కృష్ణయ్య నామినేషన్‌ దాఖలు చేయబోతున్నారు. ఆయన పేరును బీజేపీ హైకమాండ్‌ ఖరారు చేసింది. ఆర్‌.కృష్ణయ్య అమరావతిలో రేపు నామినేషన్‌ దాఖలు చేస్తారు.మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్ధులను ప్రకటించింది. ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్య, హరియానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ పేర్లను ఖరారు చేసింది. బీసీ ఉద్యమ నేత కృష్ణయ్య ఇటీవల వైసీపీకి, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ ఆయనకు మరోసారి అవకాశం కల్పించింది. ఇక రాజ్యసభ …

Read More »

స్మశానం పక్కన ఆ కారులో వేగంగా వింత శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా

తాడేపల్లి స్మశాన వాటిక వద్ద సగం కాలిన కారు పార్క్ చేసి ఉంది. దానిపై గ్రీన్ మ్యాట్ కూడా కప్పి ఉంది. అయితే అప్పటి నుంచి ఆ కారు నుంచి వింత శబ్దాలు వస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. స్మశానవాటిక పక్కనే నివసించడం వారికి అలవాటు. స్మశానం పక్కనే ఉన్నా.. ఎప్పుడూ ఇంత ఆందోళనకు గురి కాలేదు. అయితే ఇప్పుడెందుకనుకుంటున్నారా..! సగం కాలిన కారును గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ వదిలిపెట్టి పోయినట్లు ప్రచారం జరిగింది. అదే సమయంలో వింత శబ్దాలు వచ్చినట్లు గుర్తించారు. దీంతో …

Read More »

ఇదెక్కడి వెరైటీ రా మావా.! ఆవు దూడకు అక్షింతలు వేస్తూ ఆశీర్వాదం.. ఎందుకంటే?

ఆవు దూడకు నామకరణం..అక్షింతలు వేస్తూ ఆశీర్వాదం..వింటేనే ఆశ్చర్యం వేస్తుందిగా.. వస్త్రంతో ఉయ్యాలను ఏర్పాటు చేసి అందులో అవు దూడను ఉంచి ఊపుతూ మహిళలు మంగళ హారతులు పాడారు. అవు దూడ నుదుటికి బొట్టు పెట్టి, అక్షింతలు వేస్తూ దానిని ఆశీర్వదించారు. ఎక్కడో తెలుసా?పుట్టిన బిడ్డను 21వ రోజున ఘనంగా ఉయ్యాల వేడుక చేయడం ఆనవాయితీగా వస్తుంది. అదే రోజున చాలామంది తమ బిడ్డలకు నామకరణం కూడా చేస్తుంటారు. అయితే ఇది మనుషులలో సర్వసాధారణంగా జరిగే కార్యక్రమం. మరి అలాంటి గొప్ప కార్యక్రమాన్ని గ్రామస్తులంతా ఒకే …

Read More »