ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో 8 రోజులు బ్యాంకులు బంద్.. 

జులై నెల ముగిసి ఆగస్టులోకి అడుగుపెట్టాం. క్యాలెండర్ నెల మారితే కొన్ని ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి కొత్త రూల్స్ అమలులోకి వస్తుంటాయి. ఈ సారి వాణిజ్య సిలిండర్ ధరలను స్వల్పంగా పెంచింది కేంద్రం. అలాగే విండ్ ఫాల్ ట్యాక్స్ తగ్గించింది. అయితే తరుచుగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. అలాంటి వారు కచ్చితంగా బ్యాంకుల సెలవుల గురించి తెలుసుకోవాలి. లేదంటే తీరా సమయానికి బ్యాంక్ లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ ఆగస్టు నెలలో మొత్తంగా బ్యాంకులకు 13 …

Read More »

శ్రీశైలం మల్లన్న సేవలో చంద్రబాబు.. కృష్ణమ్మకు ముఖ్యమంత్రి జలహారతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. చంద్రబాబు ఉదయం హెలికాప్టర్‌లో తాడేపల్లి నుంచి సున్నిపెంటకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన శ్రీశైలం వచ్చారు.. అక్కడ చంద్రబాబుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు శ్రీశైలంలోని మల్లన్న ఆలయానికి చేరుకోగా.. ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక …

Read More »

మంత్రి నారా లోకేష్ ఓఎస్డీగా యువ అధికారి.. ఏరి కోరి మరీ, ఎవరీ ఆకుల వెంకటరమణ!

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌ ఓఎస్డీగా యువ అధికారి ఆకుల వెంకటరమణ నియమితులయ్యారు. కడప జిల్లా నుంచి ఏరికోరి ఆయన్ను తీసుకొచ్చి మానవ వనరులశాఖలో మంత్రి నారా లోకేష్‌ ఓఎస్డీగా నియమించారు. రమణ గతంలో తూర్పు గోదావరి జిల్లా చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేశారు. అక్కడ గిరిజనులకు ప్రభుత్వ పథకాలను అందించడంలో, జీవన ప్రమాణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు. అక్కడ నుంచి కడప జిల్లా బద్వేలు ఆర్డీవోగా బదిలీ కాగా.. అక్కడ కూడా సమర్థవంతమైన అధికారిగా ప్రశంసలు పొందారు. ఇప్పుడు నారా …

Read More »

టీడీపీ మహిళా ఎమ్మెల్యే పెద్ద మనసు.. సొంత డబ్బులతో అంబులెన్స్, 

టీడీపీ మహిళా ఎమ్మెల్యే పెద్ద మనసు చాటుకున్నారు. తన నియోజకవర్గంలో ప్రజల కష్టాలను చూడలేకపోయారు.. వెంటనే సొంత డబ్బులతో అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఇటీవల రంపచోడవరం మండలం దారగూడెంకు చెందిన నెరం పద్మకాకినాడ జీజీహెచ్‌లో చనిపోయింది. అయితే మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఆసుపత్రిలో అంబులెన్స్‌ అందుబాటులో లేకుండా పోయింది. ఈ విషయాన్ని మృతురాలి కుటుంబసభ్యులు రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే స్వచ్ఛందంగా రూ.5500లతో అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి మృతదేహం గ్రామానికి చేర్చారు. రంపచడోవరం నియోజకవర్గంలో ఇక నుంచి ఎవరూ …

Read More »

ఏపీలో ఈ పింఛన్లు తీసుకునేవారికి కూడా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు సిద్ధం కాగా.. తాజాగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పింఛన్లు అందుకునేవారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని భావిస్తోంది ప్రభుత్వం. అనారోగ్య సమస్యమలతో బాధపడుతూ వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఉచితంగా బస్సుపాస్‌లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. గుండెజబ్బులు, కిడ్నీ, పక్షవాతం, లివర్, థలసేమియా, లెప్రసీ, సీవియర్‌ హీమోఫిలియా వంటి సమస్యలున్నవారికి ఈ ఫ్రీ బస్సు సౌకర్యం అందించాలని భావిస్తున్నారు. ఇలా …

Read More »

Nadendla Manohar: ఏపీవాసులకు గుడ్‌న్యూస్.. నిత్యావసరాల ధరలు తగ్గించిన ప్రభుత్వం

 నిత్యావసరాల పెరుగుదలతో అల్లాడిపోతున్న ఏపీ వాసులకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం శుభవార్తను అందించింది. వంటింట్లో రోజూ ఉపయోగించే కందిపప్పు, బియ్యం, స్టీమ్డ్ బియ్యం ధరలు తగ్గించినట్లు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బుధవారం అధికారులతో సమావేశమైన మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ నిర్ణయాన్ని.. ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇటీవలె ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే ఒకసారి నిత్యావసరాల ధరలను తగ్గించిందని గుర్తు చేసిన మంత్రి నాదెండ్ల.. తాజాగా మరోసారి తగ్గింపు …

Read More »

ఏపీ కేబినెట్ భేటీ ఆగస్టు 7కు వాయిదా.. 

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి ఆగస్టు 2న మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉండగా వాయిదా పడింది.. ఆగస్టు 7న సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆగస్టు 1న శ్రీశైలం పర్యటనకు వెళతారు.. అలాగే శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమలలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. వరుస పర్యటనల కారణంగానే కేబినెట్ భేటీని వాయిదా వేశారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశానికి సంబంధించి వివిధ …

Read More »

ఏపీలో మరోసారి ఎన్నికలు.. ఆగస్టు 30న పోలింగ్, మూడు జిల్లాల్లో కోడ్ అమల్లోకి

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైఎస్సార్‌సీపీ తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్‌ గెలిచారు. అయితే ఆయన జనసేన పార్టీలో చేరగా.. అనంతరం అనర్హత వేటు వేయడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. ఆ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్ వచ్చిందని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. ఆగస్టు 6న ఉపఎన్నిక నోటిఫికేషన్‌ విడుదలవుతుంది.. …

Read More »

కేంద్రం నుంచి ఏపీకి తీపికబురు. 

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో భాగంగా కేంద్రం రాష్ట్రానికి అదనంగా 6.50 కోట్ల పనిదినాలు కేటాయించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మొదట మంజూరు చేసిన 15 కోట్ల పనిదినాలు జూన్‌ నెలాఖరుకే పూర్తికాగా.. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో అదనపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. మరో 6.50 కోట్ల పనిదినాలకు ఆమోదం తెలిపినట్లు పవన్ తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం …

Read More »

ఏపీలో వాలంటీర్లకు గుడ్‌న్యూస్.. 

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు. సాంఘిక సంక్షేమశాఖపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై చర్చకు వచ్చింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా వినియోగించుకునేలా ఆలోచనలు చేయాలని అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు. సచివాలయాల్లో ఉద్యోగులు, వాలంటీర్లందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని.. వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న అంశంపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ మేరకు ఆ దిశగా కసరత్తు …

Read More »