తెలంగాణ

 కొత్తగా 157 ప్రభుత్వ పాఠశాలలు వచ్చేస్తున్నాయ్..! ఏఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారో తెలుసా?

తెలంగాణలో కొత్తగా 157 ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 20 మంది విద్యార్థులు ఉన్నచోట ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. 63 గ్రామీణ, 94 పట్టణ ప్రాంతాల్లో ఈ స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. మొత్తం 571 పాఠశాలలు ప్రారంభిస్తామని గతంలో ప్రభుత్వ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ నగరాల్లోని బస్తీల్లో కనీసం 20 మంది విద్యార్థులు …

Read More »

రేవంత్ ఇంటికైనా వెళ్తా.. కేటీఆర్ సంచలన కామెంట్స్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నంత పనిచేశారు. ముందే చెప్పినట్లుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు వచ్చారు. రైతు సంక్షేమంపై రేవంత్‌ సవాల్‌ను స్వీకరించిన కేటీఆర్ చర్చించేందుకు ప్రెస్ క్లబ్‌కు రావాలంటూ సీఎంకు ప్రతిసవాల్ విసిరారు. సీఎం ఢిల్లీలో ఉన్నారు కాబట్టి.. మంత్రులెవరైనా వచ్చినా వారితో చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి.  రైతులకు 9రోజుల్లో రూ.9వేల కోట్లు వేశామని.. రైతు సంక్షేమంపై బీఆర్ఎస్, బీజేపీ దమ్ముంటే చర్చకు రావాలంటూ తొలుత సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. సవాల్‌కు …

Read More »

 తెలంగాణ ఐసెట్ ఫలితాల్లో ఆంధ్రా అబ్బాయి సత్తా.. రిజల్ట్స్‌ను డైరెక్ట్‌గా ఇక్కడ చెక్ చేసుకోండి..

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం రాసిన ఐసెట్ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి సోమవారం విడుదల చేసింది. జూన్ 8, 9 తేదీల్లో జరిగిన ఐసెట్ ప్రవేశ పరీక్షకు 64,938 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 71,746 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా.. పరీక్ష రాసిన వారిలో 58,985 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఐసెట్ ఉత్తీర్ణత శాతం 90.83 నమోదైనట్లు హైయర్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం రాసిన ఐసెట్ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి …

Read More »

ఒకే ఒక అస్తికయినా ఇవ్వండి – 8 మంది కార్మికుల కుటుంబాల ఆవేదన

కార్మికుల అవశేషాలను గుర్తించేందుకు NDRF, హైడ్రా, మున్సిపల్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎముకలు, దంతాలు, వెంట్రుకలు, శరీర భాగాలు, రక్తంతో ఉన్న రాళ్లను సేకరించి.. 70కిపైకి శాంపిల్స్‌ను DNA రిపోర్ట్‌ల కోసం అధికారులు పంపించారు. 8 మంది ఆచూకీ గుర్తించడంలో DNA రిపోర్ట్‌లు కీలకంగా మారనున్నాయి. ఐలా సెంటర్ దగ్గర తమ వారి కోసం 8 రోజులుగా కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు. సిగాచి పరిశ్రమ లాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదు. ఎక్కడి నుంచో పొట్టకూటి కోసం వచ్చిన కార్మికులు అగ్నికి ఆహుతి అయ్యారు. చెట్టంత …

Read More »

హైదరాబాద్ చేరువలో వెలిసిన కైలాసం.. నీటి గుహను దాటి శివయ్య దర్శనం..

భూకైలాశ్ దేవాలయం.. హైదరాబాద్ నుంచి దాదాపుగా 110 కి.మీ. దూరంలో ఉంది. ఇది శివునికి అంకితం చేయబడిన దేవాలయం. భాగ్యనగరం నుంచి కేవలం ఒక్క రోజులో వెళ్లి రావచ్చు. మరి ఈ దేవాలయం విశిష్ట ఏంటి.? ఇక్కడికి ఎలా చేరుకోవాలి.? ఖర్చు ఎంత అవుతుంది.? తాండూరు పట్టణానికి సమీపంలో ఉన్న భూకైలాశ్ దేవాలయం దాని అద్భుతమైన నిర్మాణం. దీని  ప్రత్యేకతల కారణంగా తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ప్రధాన ఆకర్షణ ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఇవి ఒక ప్రత్యేకమైన జలాల మధ్య ఉంచబడ్డాయి. భక్తులు ఈ …

Read More »

హైదరాబాద్ – బెంగళూరు మధ్య ప్రయాణించే వారికి గుడ్ న్యూస్.. పూర్తి వివరాలు ఇదిగో..

హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణించే రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అధిక డిమాండ్ కారణంగా వందే భారత్ ట్రైన్ కోచ్‌ల సంఖ్యను 16 కి పెంచుతూ ఇండియన్ రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. కాచిగూడ – యశ్వంత్‌పూర్ – కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 16 కోచ్‌లతో జులై 10 2025 నుంచి ప్రయాణికులకు అందుబాటులో రానుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ ప్రకటనలో తెలిపారు. 10.07.2025 నుంచి కాచిగూడ – యశ్వంత్‌పూర్ …

Read More »

ములుగు జిల్లాలో టెన్షన్ టెన్షన్… రాజకీయ దుమారం రేపుతున్న రమేష్ ఆత్మహత్య

ములుగు జిల్లాలో టెన్షన్ టెన్షన్.. నెలకొంది. కాంగ్రెస్ vs BRS వార్‌గా మారింది రమేష్ అనే యువకుడి ఆత్మహత్య. పోటాపోటికి నిరసనలకు పిలుపునిచ్చాయి ఇరుపార్టీలు. దీంతో స్థానికంగా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఇందిరమ్మ ఇంటి కోసం రమేష్‌ అనే వ్యక్తి సూసైడ్ చేసుకోవడం రాజకీయ దుమారం రేపుతున్నది. నేడు బీఆర్‌ఎస్‌ నిరసనలకు పిలుపునిచ్చింది. BRSను అడ్డుకునేందుకు చలోములుగుకు కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. నేడు మంత్రుల పర్యటనతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకింది. దీంతో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ములుగు జిల్లా వ్యాప్తంగా …

Read More »

తెలంగాణ ఇంజినీరింగ్‌ సీట్ల వివరాలు వచ్చేశాయ్.. కాలేజీ వారీగా పూర్తి లిస్ట్‌ ఇదే!

తెలంగాణ ఈఏపీసెట్‌ వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆదివారం సాయంత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎన్ని ఇంజినీరింగ్‌ కళాశాలలు, వాటిల్లో భర్తీ చేసే సీట్ల వివరాలను వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 171 ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉన్నాయని, వీటిల్లో 1,07,218 సీట్లు ఉన్నట్లు వెల్లడించింది. వీటిల్లో కన్వీనర్‌ కోటా కింద దాదాపు 70 శాతం సీట్లు అంటే 76,795 సీట్లు భర్తీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రత్యేక …

Read More »

 తెలంగాణలో నేటి నుంచి వన మహోత్సవం… ఈ ఏడాది 18.02 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం

రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచి, ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం నేడు ప్రారంభం కానుంది. ‘వన మహోత్సవం-2025’ కార్యక్రమానికి ప్రభుత్వం ఇవాళ్టి నుంచి శ్రీకారం చుట్టనుంది. సీఎం రేవంత్‌ రెడ్డి ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమానికి రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శ్రీకారం చుట్టనున్నారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ దళాల ప్రధానాధికారి సువర్ణ, అధికారులు పాల్గొంటారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏటా జూలై మొదటి వారంలో నిర్వహిస్తోంది. ఈ ఏడాది …

Read More »

వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు… వనమహోత్సవంలో సీఎం కీలక వ్యాఖ్యలు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు టికెట్లపై సీఎం రేవంత్‌ కీలకవ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుందన్నారు. మహిళలకు 60 సీట్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటా అని రేవంత్‌ భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడ బిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని రేవంత్‌ పునరుద్ఘాటించారు. రాంజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. తెలంగాణకు పచ్చని చీరను కప్పేందుకు మనందరం కృషి …

Read More »