మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ ఎపిసోడ్ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ వద్దకు చేరింది. కొండా ఫ్యామిలీపై పలు ఆరోపణలు రాగా.. వారి కూతురు ఏకంగా పరకాల నుంచి పోటీకి సిద్ధమవుతున్నానంటూ వ్యాఖ్యానించి పొలిటికల్ హీట్ పెంచారు. ఈ క్రమంలో కొండా దంపతులు మీనాక్షిని కలిశారు. వరంగల్ రాజకీయాలకు సంబంధించి పలు కీలక విషయాలను మీనాక్షికి వివరించారు.తెలంగాణలో వరంగల్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గతంలో సమంత విషయంలో నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ వివాదస్పద చేయగా.. ఇటీవలే ఆమె భర్త కొండా మురళీ.. …
Read More »వాన వాన వెల్లువాయే.. తెలుగు రాష్ట్రాలు మురిసిపాయే.. ఈ జిల్లాలకు
ఆంధ్రప్రదేశ్‌లో రోజంతా మేఘాలు ఉంటాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తూ ఉంటుంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో తెలంగాణలోని 19 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది.తెలుగు రాష్ట్రాల్లో మబ్బులు కమ్మేశాయి. అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే ద్రోణి ఆగ్నేయ రాజస్థాన్ నుండి వాయువ్య బంగాళాఖాతం …
Read More »రైల్వేలో మరో భారీ నోటిఫికేషన్.. ఇంటర్ పాసైతే చాలు! సికింద్రాబాద్‌లో పోస్టులున్నాయంటే..
దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు విభాగాల్లో టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 పోస్టులకు ఆర్‌ఆర్‌బీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 6,238 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులు 183, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు 6,055 వరకు ఉన్నాయి. ఈ పోస్టులను సికింద్రాబాద్ సహా అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, …
Read More »ప్రమాదంపై ఎట్టకేలకు స్పందించిన సిగాచీ.. ఏం చెప్పిందంటే..?
కంపెనీలో జరిగిన ప్రమాదంపై సిగాచీ సంస్థ ఎట్టకేలకు స్పందించింది. ప్రమాదానికి సంబంధించిన ఒక లేక విడుదల చేసింది. ఈ ఘటనలో 40 మంది చనిపోగా.. 33మంది గాయపడినట్లు తెలిపింది. చనిపోయిన కుటుంబాలకు రూ.కోటి రూపాయల పరిహారం ఇవ్వడంతో పాటు అన్నిరకాల బీమా క్లైమ్‌లను చెల్లిస్తామని చెప్పింది.35 ఏళ్లుగా కంపెనీని నడుపుతున్నామని.. ఎన్నడూ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది.సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ కంపెనీలో జరిగిన ప్రమాదం అందరినీ కలిచివేస్తోంది. ఈ ఘటనలో 40 మంది మరణించగా.. 33మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. …
Read More »హస్తినలో ధూంధాంగా లాల్ దర్వాజ బోనాలు.. ఇండియా గేట్ వద్ద విరిసిన తెలంగాణ సంస్కృతీ శోభ..
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వాటి నుంచి బోనాలు, బతుకమ్మ సహా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా తెలంగాణ పండుగలను ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు జరగని వేడుకలు సైతం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎంతో వైభవంగా తెలంగాణ పండుగలు ఢిల్లీలో జరుగుతున్నాయి. జూన్ 30 సోమవారం తెలంగాణ గవర్నర్ జిష్ణు వర్మ చేతుల మీదుగా ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు ధూంధాంగా నిర్వహించారు.11 ఏళ్లుగా సింహవాహిని శ్రీ మహంకాళి …
Read More »పార్టీలకు అసలు సిసలు సంజీవనిగా బనకచర్ల.. మూడు పార్టీల మధ్య సర్కస్ ఫీట్లు
తెలంగాణలో రాజకీయ పార్టీలకు అసలు సిసలు సంజీవనిగా మారింది బనకచర్ల. కాసేపు ఓ పార్టీకి పాజిటివ్‌గా మారి.. ఆ వెంటనే ఇంకో పార్టీ వైపు బెండవుతూ.. మూడు పార్టీలతో దాగుడుమూతలాడుతోంది బనకచర్ల టాపిక్. ప్రస్తుతానికి బనకచర్లలో ఏ పార్టీది అప్పర్‌హ్యాండ్.. ఏ పార్టీ వెనకబడింది..?ఇన్నాళ్లూ రెండు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ సెగ రేపింది గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు. అనుమతులు అంత ఈజీగా ఇచ్చేది లేదని డీపీఆర్‌ను కేంద్రప్రభుత్వం తిరుగుటపాలో పంపడంతో ఇంట్రస్టింగ్ టర్న్ తీసుకుంది. మరి.. బనకచర్ల వివాదం టీకప్పులో తుపానుగా మారి చప్పున చల్లారిపోయినట్టేనా? ఇలా …
Read More »తెలంగాణ కుంభమేళ.. మేడారం మహా జాతర తేదీలు ఖరారు.. ఎప్పుడంటే
30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని, 31న అమ్మవార్ల వనప్రవేశం ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. మూడో రోజునే గద్దెలపై కొలువుదీరి ఉన్న సమ్మక్క, సారలమ్మ వనదేవతలు, గోవింద రాజు, పగిడిద్దరాజుల వారి వన ప్రవేశం కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ మేరకు పూజారులు తేదీలను నిర్ణయించారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో ఈ జాతర జరగనుంది.ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందింది మేడారం మహా జాతర.. ఈ మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే …
Read More »సిగాచీ ప్రమాదం..పోలీసుల ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు
సిగాచీ కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. ఇప్పటివరకు 43మంది కార్మికులు మరణించిగా.. ఇంకా పలువురి మృతదేహాలు లభ్యం కాలేదు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ ముమ్మరం చేశారు. ఎఫ్ఐఆర్ లో పోలీసులు సంచలన విషయాలు నమోదు చేశారు.పటాన్ చెరు మండలం పాశమైలారంలోని సిగాచీ కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. ఇప్పటివరకు 43మంది కార్మికులు మరణించగా.. ఇంకా పలువురి మృతదేహాలు లభ్యం కాలేదు. మరోవైపు సహాయక …
Read More »ఈ ఏడాది ఇంజినీరింగ్ కోర్సులకు ఫీజు పెంపు లేనట్లే..! కీలక ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్ విద్యకు పాత ఫీజులనే ఖరారు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో పాత ఫీజులే ఈ ఏడాదికి అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2025-28 ఫీజుల ఖరారు చేసేందుకు త్వరలోనే అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తామని, అప్పటివరకు పాత ఫీజులనే కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మూడేళ్లకోసారి సాధారణంగా ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులను పెంచడం రివాజుగా వస్తుంది. ఈ ఏడాది ఫీజుల పెంపుపై ఇప్పటికే సీఎం …
Read More »అయ్యో ఘోరం.. 37కి పెరిగిన మృతుల సంఖ్య.. పాపం మరో 27 మంది ఏమయ్యారో ఏంటో..
ఊహించని ప్రమాదం.. ఊహకందని విషాదం. రోజూలాగే పనికి వెళ్లిన కార్మికులను రియాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. ఒక్కసారిగా సంభవించిన పేలుడుతో అసలేం జరుగుతుందో తెలియని భయంకర పరిస్థితి. షాక్ నుంచి తెరుకునేలోపే తీవ్రంగా గాయపడ్డ కార్మికులు ఆర్తనాదాలు.. చనిపోయిన వారి మృతదేహాలతో ఆ ప్రాంతమంతా హాహాకారాలతో హృదయవిదారకంగా మారిపోయింది.సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 37 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. మరో 35 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. …
Read More »