ఋతుపవన ద్రోణి, బంగాళాఖాతం లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. ముఖ్యంగా.. తెలంగాణలోని పలు జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. పలు చోట్ల కుంభవృష్టి వానతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఋతుపవన ద్రోణి, బంగాళాఖాతం లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. ముఖ్యంగా.. తెలంగాణలోని పలు జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. పలు …
Read More »ప్రత్యక్షంగా, పరోక్షంగా వారిద్దరే బాధ్యులు.. కేబినెట్ ముందుకు కమిషన్ రిపోర్ట్!
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో జరిగిన అక్రమాలు, నిర్మాణ లోపాలు, ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ప్రాజెక్ట్ వైఫల్యానికి నాటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు బాధ్యులని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందని.. అయినప్పటికీ కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా ఆ నివేదికను తొక్కి పెట్టారని కమిషన్ రిపోర్ట్ తేల్చి చెప్పింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో …
Read More »కూతురు అమెరికా నుంచి డబ్బులు పంపింది.. బ్యాంకు నుంచి డ్రా చేసుకుని వెళ్తుండగా
బైంసాలో పట్టపగలే చోటుచేసుకున్న చోరీ కలకలం రేపింది. అమెరికాలో ఉన్న కూతురు పంపిన రూ.5 లక్షలు బ్యాంక్ నుంచి డ్రా చేసుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తి… తినేందుకు బార్ అండ్ రెస్టారెంట్‌లోకి వెళ్లిన క్షణాల్లోనే స్కూటీ డిక్కీ నుంచి డబ్బులు గల్లంతయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిర్మల్ జిల్లా బైంసాలో సోమవారం నాడు మధ్యాహ్న సమయంలో చోరీ జరిగింది. ముథోల్ మండలానికి చెందిన ఎడ్‌బిడ్ గ్రామవాసి బొంబోతుల ఆనంద్ అమెరికాలో ఉన్న తన కూతురు పంపిన డబ్బును బ్యాంకు నుంచి …
Read More »మరో 2 రోజుల్లోనే ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ రాత పరీక్షలు.. వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, డి పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు మరో రెండు రోజుల్లోనే జరగనున్నాయి. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేసిన కమిషన్.. తాజాగా అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ లాగిన్ ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు ఆగస్టు 6 నుంచి 11వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. అడ్మిట్ …
Read More »ఆంధ్రాలో వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో.. వానకబురు వచ్చేసిందందోయ్
ఏపీ, తెలంగాణలో ఓ వైపు పొలిటికల్ మెరుపులు పెరిగిపోతుంటే.. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదైందో చూద్దాం.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణశాఖ. వర్షాకాలం వచ్చిందన్నమాటే కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ సరైన వర్షాలు పడలేదు. దీంతో నారుపోసి, నాట్లు వేసిన అన్నదాతలు పంటలు ఎండిపోతుండటంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వానజాడకోసం ఆకాశంవైపు చూస్తూ వరుణుడిని వేడుకుంటున్నారు. ఈ క్రమంలో వాతావరణ అధికారులు రైతన్నలకు …
Read More »వామ్మో మరీ అంతనా.. ఆ స్కూల్‌లో నర్సరీ ఫీజ్ ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు బదులుగా ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. డిమాండ్ పెరగడంతో ప్రైవేటు స్కూల్స్‌కు కూడా భారీగా ఫీజులను పెంచేస్తున్నాయి. కేవలం నర్సరీకే లక్షల్లో ఫీజులు వస్తూ చేస్తున్నారు. దీంతో పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలంటే తల్లిదండ్రులకు తలప్రాణం తోకకొస్తుంది. అంతో ఇంతో సంపాదన ఉన్న వాళ్ల పరిస్థితి కాస్తా ఒకే అనుకున్నా.. మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి మాత్రం మరీ దారుణంగా మారింది.. తాము కష్టపడి సంపాధిండే డబ్బులు మొత్తం పిల్లల స్కూలు ఫీజులకే సరిపోతుంది. …
Read More »ఒక్కసారిగా పోస్టాఫీస్‌కు మహిళలు క్యూ.. అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాంక్
వికారాబాద్ జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పరిగిలోని స్థానిక మహిళలు ఒక్కసారిగా పోస్టాఫీసు వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. తెలంగాణ ప్రభుత్వం అందించే భాగ్యలక్ష్మీ స్కీం ద్వారా రూ. 2,500 నగదు జమ అవుతోందని స్థానికంగా వదంతులు రావడంతో.. వందలాది మహిళలు ఆ డబ్బులు తీసుకుందామని.. పోస్టాఫీసులో అకౌంట్‌లు తెరిచేందుకు ఉదయాన్నే అక్కడికి చేరుకున్నారు. చిన్న పిల్లల్ని సైతం పట్టుకుని లైన్‌లో నిల్చున్నారు. అయితే ఇదంతా వట్టి పుకార్లు మాత్రమేనని.. భాగ్యలక్ష్మీ స్కీంకు సంబంధించిన ఎలాంటి సర్క్యూలర్ కూడా తపాలాశాఖకు రాలేదని.. …
Read More »రాష్ట్రానికి మరో మణిహారం.. యాదాద్రి పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ జాతికి అంకితం!
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రాష్ట్రానికి ఆశాదీపమైంది. దీంతో విద్యుత్తు సరఫరాలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్ స్థానంలో నిలువనుంది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో దేశంలో ప్రభుత్వ రంగంలో అతిపెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అవతరించింది. దేశ విద్యుత్ రంగానికి దేశానికి కలికితురాయిగా నిలిచిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ ను ప్రభుత్వం జాతికి అంకితం చేసింది. గత ఏడాది డిసెంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి రెండవ యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. మొదటి, …
Read More »బనకచర్లతో తెలంగాణకు ఇబ్బందేంటీ..? జగన్ వల్ల ఏపీ పరువు పోయింది – లోకేశ్
కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై ఉన్నట్లే.. ఏపీకి చంద్రబాబు ఉన్నారని మంత్రి లోకేశ్ అన్నారు. విశాఖను ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనే కుట్రే బనకచర్ల ప్రాజెక్టుపై జరుగుతోందని లోకేశ్ ఆరోపించారు. సింగపూర్ పర్యటన విజయవంతమైందని.. దాని ఫలితంగా వచ్చే ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులు ఏపీకి రానున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తాము ఎంవోయూలు దగ్గర ఆగిపోలేదని.. ప్రతీ ఒక్కదాన్ని నేరుగా కార్యరూపంలోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. జూమ్ కాల్ ద్వారా …
Read More »గొర్రెల పంపిణీ కేసులో దూకుడు పెంచిన ఈడీ.. సోదాల్లో వెలుగులోకి విస్తుపోయే నిజాలు!
గొర్రెల పంపిణీ కేసులో ఈడీ దూకుడు పెంచింది. గొర్రెల పంపిణీలో అవినీతికి పాల్పడ్డ వారి కోసం వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు చోట్ల చేసిన సోదాల్లో భారీగా నగదు కట్టలు, ఆస్తులు గుర్తించారు ఈడీ అధికారులు. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. గొర్రెల పంపిణీ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసి రంగంలోకి దిగింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ 10 చోట్ల సోదాలు నిర్వహించింది ఈడీ. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, …
Read More »