అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత.. దేశంలోని ఎయిర్ పోర్టుల సమీపంలో నివాసం ఉండే ప్రజలు వణికిపోతున్నారు. సాధారణంగానే ఫ్లైట్స్ టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో పెద్ద శబ్దం చేస్తుంటాయి. ఈ సమయంలో ఎయిర్ పోర్ట్ సమీపంలో నివాసం ఉండే వాళ్ల పరిస్థితి వర్ణనాతీతం. ఇక.. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత.. ఎయిర్‌పోర్టుల సమీపంలో ఉండాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే.. DGCAకి కంటోన్మెంట్ వికాస్ మంచ్ లేఖ రాసింది. బేగంపేట ఎయిర్ పోర్ట్ తరలించాలని డిమాండ్ చేసింది. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌ను దుండిగల్‌కు తరలించాలని …
Read More »కౌన్ బనేగా తెలంగాణ బీజేపీ బాస్.. ఆ నేతల మధ్యనే తీవ్ర పోటీ..! ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు
ఎప్పటికప్పుడు అదిగో ఇదిగో అంటూ సాగుతున్న తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికపై క్లారిటీ వచ్చేసినట్టే కనిపిస్తోంది. అయితే స్టేట్ పార్టీకి కొత్త బాస్ ఎవరు అనే విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఆ పదవి కోసం మేం ప్రయత్నించడం లేదని కొందరు చెబుతుంటే.. అంతా హైకమాండ్ చూసుకుంటుందన్నది ఇంకొందరి వాదన. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ మరికొద్ది రోజుల్లోనే సమాధానం రాబోతున్నట్టు తెలుస్తోందితెలంగాణలో ఈసారి అధికారం మాదే. రాష్ట్రంలో మేం అధికారంలోకి రాకుండా అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు. తెలంగాణలోని బీజేపీ నేతలు పదే పదే చాలా …
Read More »ప్రముఖ న్యూస్ యాంకర్ ఆత్మహత్య..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఇన్‌స్టా పోస్ట్
ప్రముఖ తెలుగు టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌లోని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గత 18 ఏళ్లుగా తెలుగు మీడియాలో పనిచేసిన స్వేచ్ఛ ప్రస్తుతం టీ న్యూస్‌లో యాంకర్‌గా పని చేస్తున్నారు.గత 18 ఏళ్లు తెలుగు మీడియాలో న్యూస్ యాంకర్‌గా, జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. ప్రస్తుతం టీ న్యూస్ ఛానెల్ లో టీవీ యాంకర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ శుక్రవారం …
Read More »తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. జూన్ 3 నుంచి జూన్ 13 వరకు జరిగిన టెన్త్ సప్లి ఎగ్జామ్ పేపర్స్ ను జూన్ 14 నుంచి 16 వరకు స్పాట్ వాల్యూయేషన్ చేశారు. పదో తరగతి సప్లీమెంటరి పరీక్షలకు 42,834 మంది దరఖాస్తు చేసుకోగా.. 38,741 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 28,415 మంది ఉత్తీర్ణలయ్యారు. పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో 73.35 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 71.05 శాతం, బాలికలు 77 శాతం ఉత్తీర్ణత …
Read More »ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసింది.. పూర్తి వివరాలు ఇదిగో..!
తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ ప్రవేశాల కోసం ఎప్ సెట్ రాసి ర్యాంకులతో ఎదురుచూస్తున్న విద్యార్థులకు కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి మూడు దశల్లో కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జూన్ 28 నుంచే కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. మొదటి ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ జూన్ 28 ప్రారంభం అవుతుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్: జూన్ 28న ప్రారంభం కానున్న మొదటి ఫేజ్ కౌన్సిలింగ్ …
Read More »మావోయిస్టు లేఖపై స్పందించిన మంత్రి సీతక్క..! ఒక మహిళ అని కూడా చూడకుండా..
తాజాగా మంత్రి సీతక్కపై వెలుగులోకి వచ్చిన మావోయిస్టు లేఖపై ఆమె స్పందించారు. ఇది నిజమైన బెదిరింపు లేక రాజకీయ ప్రత్యర్థుల కుట్ర అనేది తెలియాల్సి ఉందని అన్నారు. ఆదివాసి మహిళగా తనకు మంత్రి పదవి రావడం కొందరికి జీర్ణం కాలేదని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.మావోయిస్టుల పేరుతో ఇటీవలె మంత్రి సీతక్కపై ఒక లేఖ వెలుగులోకి వచ్చింది. తాజాగా ఆ లేఖపై సీతక్క స్పందించారు. ఆ లేఖలో ములుగులో ఆదివాసీల గెంటివేతపై ఎందుకు మాట్లాడటం లేదు? తెలంగాణలో ఆదివాసీల పరిరక్షణ బాధ్యత …
Read More »బోనాల సంబరాలు షురూ.. గోల్కొండ జగదాంబికకి తొలి బోనం సమర్పణ..క్యూ కట్టిన రాజకీయ నేతలు, భక్తులు
తెలంగాణలో బోనాల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. రాష్ట్ర పండుగ అయిన బోనాల జాతర.. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ప్రారంభం అవుతుంది. నెల రోజుల పాటు హైదరాబాద్ నగరంలో బోనాల సందడి కొనసాగుతుంది. ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించి.. సల్లంగా చూడమని వేడుకుంటారు. ఈ క్రమంలోనే.. ఈ ఏడాది కూడా బోనాల సంబురం మొదలు కాగా.. వచ్చే నెల 24న ముగుస్తాయి. బోనాల పండుగ ప్రారంభంతో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఆలయ అర్చకులు తొలి బోనం సమర్పించారు. బోనాల జాతర ప్రారంభం నేపథ్యంలో తొలి …
Read More »మావోల నుంచి బెదిరింపులు.. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు భద్రత పెంపు!
తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్‌రావుకు భద్రత పెంచాలని నిర్ణయించింది. మావోయిస్టుల నుంచి ఇటీవల రఘునందన్ రావుకు బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో ఆయన భద్రతపై పోలీస్ శాఖ ధృష్టి సారించింది. ఈ బెదిరింపు కాల్స్‌పై క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీసు శాఖ, ఆయనకు అదనపు భద్రత అవసమని నిర్ణయించారు. ఈ మేరకు రఘునందన్ రావుకు అదనపు భద్రత కల్పించాలని మెదన్ జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది.అయితే ఇటీవల మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని …
Read More »ఎంతకు తెగించార్రా.. CID.. సుప్రీం కోర్టు.. చీఫ్ జస్టిస్.. అంతా ఫేక్! దారుణంగా మోసపోయిన ఉద్యోగి
కాప్రాకు చెందిన రిటైర్డ్ ప్రైవేట్ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకుని, సైబర్ నేరస్థులు సుప్రీం కోర్టు, ఆర్బీఐ పేరుతో మోసం చేశారు. ఢిల్లీ పోలీసులమంటూ ఫోన్ కాల్ చేసి, మనీలాండరింగ్ కేసు నమోదైందని బెదిరించి, కోర్టు సెక్యూరిటీ పేరుతో రూ.22.05 లక్షలు గుట్టుచప్పుడు లేకుండా మోసం చేశారు. బాధితుడు తనకు తెలిసిన వారి సహాయంతో మోసం గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.మోసం చేసేందుకు కేటుగాళ్లు ఏమైనా చేసేలా ఉన్నారు. ఏకంగా భారత దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా వాడేసుకున్నారు. గతంలో పోలీస్ యూనిఫామ్‌లో కొంతమంది ఫేక్ …
Read More »నమ్మకంగా ఉంటూ నిండా ముంచాడు.. ఓనర్‌కు భలే షాక్ ఇచ్చిన కలెక్షన్ బాయ్..!
హైదరాబాద్ మహానగరంలో ఓ కలెక్షన్ బాయ్ వ్యవహారం తన షాప్ యజమానికి హార్ట్ ఎటాక్ తెప్పించేంత పని అయ్యింది. తనని నమ్మి యజమాని పని అప్పచెపితే, తన అవసరం కోసం సోమ్ము చేసుకుని వాడుకున్నాడు. తీరా యజమాని పోలీసులను ఆశ్రయించడంతో కటకటాల పాలయ్యాడు. నమ్మిన బంగారు దుకాణం వ్యాపారికి టోకరా ఇచ్చిన ఉద్యోగి 7లక్షల రూపాయలతో కలెక్షన్ ఏజెంట్ పరార్ అయ్యాడు. నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేసిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. అతడి వద్ద నుండి రూ .6లక్షల 42 వేల …
Read More »