తెలంగాణ

ఫోన్ టాపింగ్ చేసే అధికారం ఎవరిది? టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెబుతోంది..?

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు సిట్ అధికారులు. ఇప్పటికే పలువురు రాజకీయ నేతల వాంగ్మూలం తీసుకున్నా పోలీసులు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఫోన్ టాపింగ్ గురించి చర్చ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక మంది రాజకీయ నాయకులను మొదలుకుని జర్నలిస్టులు, హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను సైతం టాప్ చేశారంటూ దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అసలు నిజంగానే ఇంతమంది ఫోన్లను టాప్ చేసే అధికారం ప్రత్యేక అధికారులకు ఉంటుందా..? ఎవరి అనుమతులు తీసుకొని ఇంత మంది ఫోన్లను …

Read More »

మరోసారి సీఎం కుర్చీపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

సీఎం సీటుపై మరోసారి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఐదేళ్లు సీఎంగా ఉండేందుకు రేవంత్‌ రెడ్డి ఆల్‌రెడీ ప్రజల ముందు అప్పీల్‌ పెట్టుకున్నారని.. ఆయన దిగిపోయిన తర్వాత (9 ఏళ్ల) ముఖ్యమంత్రి అయ్యేందుకు తాను ప్రయత్నిస్తున్నానని జగ్గారెడ్డి అన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలపై కూడా జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.గురువారం ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ సీనియర్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో సీఎం సీటుపై మరోసారి …

Read More »

కజకిస్తాన్‌ రాయబారితో నవాబ్‌ మీర్‌ కీలక భేటీ.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

ఎయిర్ కనెక్టివిటీ, ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి హైదరాబాద్, అల్మట్టి మధ్య విమాన సర్వీసులను ప్రారంభించాలని డాక్టర్ ఖాన్ ప్రతిపాదించారు. ఈ విమాన సర్వీసుల ద్వారా వైద్య, పర్యాటకానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని, కజకిస్తాన్ పౌరులకు హైదరాబాద్ ప్రపంచ స్థాయి ఆరోగ్య.. హైదరాబాద్‌లోని రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ రాయబారి కార్యాలయంలోని గౌరవ సలహాదారుడు డాక్టర్‌ నవాబ్‌ మీర్‌ నాసిర్‌ అలీఖాన్‌ ఇటీవల ఢిల్లీలో రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ రాయబారి అజామత్ యెస్కరాయేవ్‌ను కలిశారు. అధికారిక పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన కజకిస్తాన్‌ రాయబారి.. ఏపీ, …

Read More »

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలల్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు!

తెలంగాణను అవినీతి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఆర్టిఏ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఫోకస్‌ పెట్టిన ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టిఏ కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉప్పల్ ఆర్టిఏ కార్యాలయంతో పాటు తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.ప్రధానంగా ఆర్టిఏ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి బ్రోకర్ల చేతివాటం, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల సహకారం వంటి అంశాలపై ఏసీబీ అధికారులు ఈ దాడులను కొనసాగిస్తున్నారు. గతంలోనూ మే 28న ఇదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న …

Read More »

వారంలో రెండుసార్లు విజిట్.. వారికి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని అనేక సార్లు ప్రకటించిన రేవంత్‌ సర్కార్‌.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. దానిలో భాగంగానే.. విద్యాశాఖ‌పై కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో స‌మీక్ష నిర్వహించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ సందర్భంగా.. తెలంగాణ‌లో విద్యా వ్యవ‌స్థను మ‌రింత ప‌టిష్టం చేయాల‌ని అధికారులను ఆదేశించారు. అద‌న‌పు క‌లెక్టర్లు వారంలో క‌నీసం రెండు సార్లు ప్రభుత్వ పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాల‌ల నుంచి ప్రభుత్వ పాఠ‌శాలల్లో 48 వేల మంది చేరార‌ని అధికారులు సీఎం …

Read More »

పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం.. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే?

తెలంగాణ పాలిసెట్‌ 2025 తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్దులు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 28వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలనకు కోసం స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవడానికి విండో ఓపెన్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 59 ప్రభుత్వ, 57 ప్రైవేట్‌ కాలేజీల్లో మొత్తం 29,263 డిప్లొమా సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే పాలిటెక్నిక్‌లో 100 శాతం సీట్లను కన్వీనర్‌ కోటా కిందే భర్తీ చేయనున్నారు. ఇందులో అత్యధికంగా కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచీలో 6,703 సీట్లు, ఈఈఈలో 5,850 సీట్లు, ఈసీఈలో …

Read More »

కోరిన కోర్కెలు తీర్చే బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..

ఆషాడ మాసం వచ్చిందంటే చాలు భాగ్య నగరంలోని బోనాల సందడి మొదలవుతుంది. చారిత్రక గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబిక మహంకాళికి తోలి బోనం సమర్పిస్తారు. అనంతరం హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కూడా బోనాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. బోనాల సందర్భంగా ఇక్కడ కొలువైన అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో మహిళలు చేరుకుంటారు. ఈ పురాతన ఆలయంలో ఏ దేవతను పూజిస్తారు? ఈ ఆలయంతో సంబంధం వెనుక ఉన్న నమ్మకం ఏమిటో తెలుసుకుందాం. ఏ దేవతని పూజిస్తారంటే.. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ప్రధానంగా ఆదిశక్తి …

Read More »

బనకచర్ల ప్రాజెక్ట్‌పై ముదురుతున్న రాజకీయం.. మళ్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్!

తెలంగాణలో బనకచర్లపై పొలిటికల్ ఫైట్ ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ రగడ పీక్స్‌కు చేరుకుంది. రేవంత్ సర్కార్ వైఫల్యం వల్లే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతోందని బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. తాము ఈ అంశాన్ని లేవనెత్తే వరకు అసలు ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదని కారు పార్టీ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తోంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలంగాణ ప్రభుత్వం సంకేతాలు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ మరింతగా తప్పుబడుతోంది. …

Read More »

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులపాటు పిడుగులతో భారీ వర్షాలు!

వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీనితో పాటుగా మరోక ద్రోణి కూడా విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులు చెదురుమదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ …

Read More »

పీజీసెట్‌లో 93.55 శాతం ఉత్తీర్ణత.. ర్యాంకు కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పోస్ట్‌ గ్యాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 2025(APPGCET) పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ఫలితాలను ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పోస్ట్‌ గ్యాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 2025(APPGCET) పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ఫలితాలను ఉన్నత విద్యామండలి …

Read More »