తెలంగాణ

GMR ఆధ్వర్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ సరికొత్త రికార్డు!

మే నెలలో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రికార్డు స్థాయిలో 27 లక్షలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఢిల్లీ విమానాశ్రయంతో పోలిస్తే 15.3% అధిక వృద్ధిని సాధించింది. దేశీయ, అంతర్జాతీయ విమానాల సంఖ్య పెరుగుదలతో ప్రయాణికుల రద్దీ పెరిగింది.అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ ఒకటి. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ విమానాశ్రయం నుంచి లక్షలాదిమంది ఇతర రాష్ట్రాలకు, దేశాలకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక …

Read More »

తెలంగాణ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు.. జులై 14 నుంచి తరగతులు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో గతేడాది నవంబరులో కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు మంజూరైన సంగతి తెలిసిందే. కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్‌నగర్, మేడ్చల్‌-మల్కాజిగిరి, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు జవహర్‌ నవోదయ విద్యాలయా (జేఎన్‌వీ)లు మంజూరయ్యాయి. ఈ 7 నవోదయ విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరం (2025-26) నుంచే ఆరో తరగతి ప్రవేశాలు జరగనున్నట్లు తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటికే 9 పాత విద్యాలయాలుండగా వాటిలో ప్రవేశాలు ముగిశాయి. కొత్త వాటిల్లో ఆరో తరగతి ప్రవేశాలు …

Read More »

పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌కు కేటీఆర్ లీగల్‌ నోటీసులు.. వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ..

టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌కు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపించడం కాక రేపుతోంది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలకు మహేష్‌కుమార్‌గౌడ్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేయడం ఆసక్తిగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయ్. ఓ సారి లుక్కేయండి మరి.ఫోన్ ట్యాపింగ్ పేరుతో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ మహేశ్‌కుమార్ గౌడ్‌కు లీగల్ నోటీసులు పంపించారు. అధికారంలోకి వచ్చాక హామీలు అమలు …

Read More »

సైబర్‌ మోసాలపై అప్రమత్తం కండి.. అలాంటి లింక్స్‌ను క్లిక్ చేశారో.. ఇక అంతే సంగతులు!

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. టెక్నాలజీతో పాటు సైబర్ నేరాల కూడా వేగంగానే పెరుగుతున్నాయి. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ దాడులు జరగడం అనేది నేడు సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా ఇలానే ఓ రైతు తన ఫోన్‌కు వచ్చిన లింక్‌ను క్లిక్‌ చేసి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయడంతో తన బ్యాంక్‌ ఖాతాలోని డబ్బులు పొగొట్టుకున్నాడు. కాగా ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అవేంటో తెలసుకుందాం పదండి..ఇటీవల కాలంలో …

Read More »

నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ర్యాంకు కార్డులు వచ్చేశాయ్‌..

దేశ వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు నిర్వహించిన నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 ర్యాంకు కార్డులు వచ్చేశాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఫలితాలు విడుదల చేసింది. కాగా ఏప్రిల్‌ 29న NCET2025 పరీక్ష.. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో 13 స్థానిక భాషల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 54,470 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 44,927 మంది …

Read More »

 16 ఏళ్లకే ఏడు ఖండాల్లోని 7 పర్వతాలు అధిరోహించిన హైదరాబాది!.. రికార్డులు చూస్తే..

సాధారణంగా ఒక్కొక్కరికి ఏదో ఓ అలవాటు ఉంటుంది. వాళ్లు ఆ పనిని చేసేందుకే చాలా ఇష్టపడతారు. ఇక్కడ ఈ హైదరాబాదీ యువకుడు కూడా అంతే. ఈ యువకుడికి పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. దీంతో అదే పనిని హాబీగా మార్చుకున్నాడు. 16 ఏళ్ల వయసులోనే 6 ఖండాల్లో 20కి పైగా పర్వతాలను ఎక్కి సత్తాచాటాడు. 2020లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ కుర్రాడు నాలుగేళ్లలోనే అనేక బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు సంపాదించుకోవడంతో పాటు ఎన్నో అవార్డులు, ప్రశంసలను సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఎవరీ …

Read More »

ఆశ్చర్యంగా నెమలి ప్రవర్తన – 6 ఏళ్లుగా సమ్మక్క సారక్క గుడికి – సూర్యాస్తమయానికి మాయం

ఆరేళ్లుగా స్థానిక సమ్మక్క సారలమ్మ ఆలయం వద్ద ప్రతిరోజూ దర్శనమిచ్చే ఈ నెమలి భక్తులను ఆకట్టుకుంటోంది. ఉదయం ఎనిమిదికి ఆలయానికి చేరి సాయంత్రం నాలుగున అడవికి వెళ్ళే ఈ నెమలిని.. భక్తులు అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తున్నారు. ఆ నెమలితో ప్రత్యేకంగా సెల్పీలు దిగుతున్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారుగూడెం గ్రామ సమ్మక్క సారలమ్మ ఆలయం వద్ద కనిపించే ఓ నెమలి భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటలకు ఆలయానికి చేరుకొని.. సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి అడవికి వెళ్లిపోతుంది. గత …

Read More »

టీవీ9 క్రాస్‌ఫైర్‌లో ఈటల కామెంట్స్‌పై బీజేపీ చర్చ.. అంతా కేబినెట్ నిర్ణయం మేరకే అంటూ..

టీవీ9 క్రాస్ ఫైర్‌లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్‌ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీలో తీవ్ర చర్చకు దారి తీశాయి. అంతా కేబినెట్ నిర్ణయం మేరకే అంటూ గులాబీ పార్టీకి అనుకూలంగా మాట్లాడారని కమలం పార్టీలో చర్చ జరుగుతోంది. తన పార్టీ నిబద్ధతను, రాజకీయ ప్రత్యర్థులపై తన వైఖరిని స్పష్టం చేస్తూ.. ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు.కాళేశ్వరంపై ఈటల కామెంట్స్‌ కాకరేపుతున్నాయి. టీవీ9 క్రాస్ ఫైర్‌లో చెప్పిన కొన్ని అంశాలు బీఆర్‌ఎస్‌కు …

Read More »

జూనియర్‌ NTR క్రేజ్‌ చూసి అసదుద్దీన్‌ ఒవైసీ షాక్‌..! MIM మీటింగ్‌లో పేరు చెప్పగానే దద్దరిల్లిన..

ఒక AIMIM సభలో అసదుద్దీన్ ఒవైసీ జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావించడంతో సభ దద్దరిల్లిపోయింది. చంద్రబాబు నాయుడు, లోకేష్ రాజకీయాలపై విమర్శలు చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావన వచ్చింది. ఎన్టీఆర్ పాపులారిటీకి ఒవైసీ ఆశ్చర్యపోయారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. తన టాలెంట్‌తో బిగ్‌ స్టార్‌గా ఎదిగిన నటుడు. యూత్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఉండే క్రేజ్‌ గురించి కొత్త చెప్పేందేముంది కానీ, ఓ మీటింగ్లో జరిగిన విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. …

Read More »

 గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభం ఎప్పుడంటే!

తెలంగాణకు కేంద్రం ఇటీవల మంజూరు చేసిన ఏడు కొత్త నవోదయ విద్యాలయాలను ప్రారంభించేందుకు రాష్ట్ర విద్యాశాఖ సన్నద్ధమైంది ఏడు జవహర్ నవోదయ విద్యాలయాల్లో తరగతులు ప్రారంభించేందుకు ఉన్న అనుకూలతలపై రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్‌లో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభోత్సవానికి కావలసిన మౌలిక సదుపాయాలు బోధన సిబ్బంది జిల్లా అధికారుల సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. ముఖ్యంగా జులై 14 వ తేదీన ఏడు కొత్త నవోదయ విద్యాలయాలను ఘనంగా ప్రారంభించి …

Read More »