ఇంధనశాఖపై సమీక్షలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యుత్ శాఖ ప్రక్షాళన కోసం సంస్కరణలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్‌తో పాటు కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. విద్యుత్ విభాగం ప్రక్షాళనకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ ఉండగా.. …
Read More »బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్పీ్కర్ మూడు నెలలో నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. పార్టీ మారిన BRS ఎమ్మెల్యేలపై తక్షణ చర్య తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్తు తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను తక్షణ చర్యల తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. …
Read More »ఏం స్కెచ్‌రా బాబూ.. జన్నారం అడ్డాగా అంతర్జాతీయ కంత్రీపని.. తెలిస్తే షాకే
మారుమూల గ్రామంలో ఇంటర్నేషనల్ రేంజ్ లో సైబర్ సెటప్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న తీరును చూసి పోలీసులు షాక్ కు గురయ్యారు. నిందితుల వద్ద నుండి 350 సిమ్ లు.. టాస్క్ బాక్స్ లు, సిమ్ ఐఎంఈఐ నెంబర్ లను మార్చే న్యూ టెక్నాలజీ పరికరాలను , ల్యాప్ ట్యాప్ లను సీజ్ చేశారు పోలీసులు. ముగ్గురును అరెస్ట్ చేసిన పోలీసులు కీలక నిందితుడి కోసంగాలింపు చర్యలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లోని మారుమూల గ్రామం కలమడుగు కేంద్రంగా పెద్ద ఎత్తున …
Read More »ఇంట్లో ప్రియుడితో ఏకాంతంగా ఉన్న భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. ఆ తర్వాత..
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న కారణంతో.. దారుణాలకు పాల్పడుతున్నారు.. ఈ అక్రమ సంబంధాలు చివరకు దాడులు, హత్యలకు దారితీస్తున్నాయి. ఇలాంటి ఘటనలో కుటుంబాలు చిన్నాభిన్నం అవ్వడంతోపాటు.. బాధితుల బిడ్డలు అనాధలుగా మారుతుండడం అందరిని కలవరపెడుతోంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య, ప్రియుడిపై.. భర్త కత్తులతో దాడి చేసిన ఘటన తెలంగాణలో కలకలం రేపింది. వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన నాగబోయిన రవి, లావణ్యలకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి నలుగురు …
Read More »టీవీ9 సీడ్‌బాల్ క్యాంపెయిన్ అభినందనీయం.. మంత్రి కొండా సురేఖ
TV9 సీడ్‌బాల్ కార్యక్రమాన్ని తాజాగా గుమ్మడివల్లి ఫారెస్ట్ ఏరియాలో చేపట్టింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. టీవీ9 సీడ్ బాల్ ప్రచారాన్ని మంత్రి కొండా సురేఖ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇది చాలా మంచి కార్యక్రమం అని.. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ తొడ్పడాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీవీ9 నెట్‌వర్క్ సీడ్ బాల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పచ్చదనాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా సీడ్‌బాల్ కార్యక్రమాన్ని నిర్వహించడంతోపాటు.. పర్యావరణ పరిరక్షణ తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కలిగిస్తోంది టీవీ9 నెట్‌వర్క్.. …
Read More »అక్కను చంపే ముందు రీల్స్ చేసిన రోహిత్… షాద్‌నగర్ పరువు హత్య కేసులో సంచలన విషయాలు
ఫేమస్ అవ్వాలంటే హత్యలు కూడా చేస్తారా? అది కూడా సొంత వాళ్లకు చంపేందుకు కూడా వెనుకాడరా? షాద్‌నగర్ హత్య కేసులో ఇప్పుడే ఇదే విషయం సంచలనం రేపుతోంది. షాద్‌నగర్ పరువు హత్య కేసులో పక్కా ప్లాన్ ప్రకారమే అక్కను ఆమె తమ్ముడు రోహిత్ హత్య చేసినట్టు తెలుస్తోంది. అక్కను చంపే ముందు రీల్స్ చేశాడు రోహిత్. ఫేమస్ అవ్వాలి మామ, బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు… బాగా చంపి ఫేమస్ అయ్యేదా అంటూ రీల్స్ చేశాడు. దీంతో హత్య చేసేందుకు ముందుగానే …
Read More »నాగార్జున సాగర్ వద్ద కృష్ణమ్మ జల సవ్వడి…క్రస్ట్ గేట్లు ఎత్తి నీటి విడుదల..ఎన్ని గేట్లు ఎత్తారంటే..
నాగార్జునసాగర్ వద్ద కృష్ణమ్మ ఉరకలేస్తోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో నాగార్జున సాగర్ వద్ద కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ కృష్ణా పరివాహ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జున సాగర్ జలకల సంతరించుకుంది. దీంతో 26 క్రస్ట్ గేట్ల మీదుగాకృష్ణమ్మ జాలువారుతోంది. కృష్ణవేణి జల సవ్వడి డ్రోన్ విజువల్స్ చూశారా…? ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు కృష్ణ బేసిన్ లోని రిజర్వాయర్లన్నీ ఇప్పటికే నిండాయి. జూలైలో ముందస్తుగా ఆల్మట్టి నుండి శ్రీశైలం వరకు అన్ని జలాశయాలు …
Read More »ఛలో ఢిల్లీ.. ఎవరి పోరాటం వారిదే.. బీసీ మంత్రాన్ని జపిస్తున్న ప్రధాన పార్టీలు..
బీసీ.. బీసీ.. బీసీ.. తెలంగాణలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పడు ఇదే మంత్రాన్ని జపిస్తున్నాయి…! ఒకవర్గం కోసం అన్ని వర్గాలు పోరుబాటకు సిద్ధమయ్యాయి…! స్థానిక సంస్థల ఎన్నికలు.. చావో రేవోలా మారడంతో మూడు పార్టీలు బీసీ రిజర్వేషన్ల అంశాన్నే బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నాయి…! ఎవరికి వారు గల్లీలోనే కాదు ఢిల్లీలోనూ కొట్లాడేందుకు సిద్ధవుతున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎవ్వరూ తగ్గేదేలే అన్నట్లున్నారు..! బిల్లు ఆమోదం కోసం ఎందాకైనా వెళ్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆగస్ట్ 5 నుంచి …
Read More »ఉత్తమ్ బ్రో.. నేను అలిగిన పో.. నాగార్జున సాగర్ వెళ్లకుండా సైడ్ అయిన మంత్రి కోమటిరెడ్డి
నేను ఏమైనా ఆయనకు సబ్ ఆర్డినేట్ నా? ఆయన ఎన్నిగంటలు ఆలస్యంగా వచ్చినా ఎదురు చూడలా..? నేనూ మంత్రినే.. నాక్కూడా ఆత్మగౌరవం ఉంది. కనీసం లేట్‌గా వస్తానన్న సమాచారం కూడా ఇవ్వలేదంటూ బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లిపోయారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మంగళవారం నాగార్జునసాగర్ పర్యటన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోపం వచ్చింది. ఉత్తమ్ బ్రో.. నేను అలిగిన పో.. అంటూ ఇంటికి వెళ్లిపోయారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నేను ఏమైనా ఆయనకు సబ్ ఆర్డినేట్ నా? ఆయన ఎన్నిగంటలు …
Read More »ఈడీ ముందుకు నటుడు ప్రకాశ్‌రాజ్… బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణకు హాజరు
బెట్టింగ్ యాప్స్ కేసులో వదల బొమ్మాళీ అంటూ ఈడీ దూకుడు పెంచింది. దీనిలో భాగంగా విచారణకు రావాలంటూ, రానా, ప్రకాష్‌రాజ్, మంచులక్ష్మికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో నటుడు ప్రకాశ్ రాజ్ ఈడీ ముందు హాజరయ్యారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. బెట్టింగ్ యాప్‌లకి సంబంధించి మనీలాండరింగ్, హవాలా లావాదేవీల ఆరోపణలపై ఈడీ ఫోకస్ చేసింది. మొత్తం 36 బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించిన ప్రమోషన్స్‌పై సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు. ఓ …
Read More »