తెలంగాణలో ఉపాధిని కల్పించే పరిశ్రమలను ప్రోత్సహించడమే లక్ష్యంగా.. ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రతీవారమూ ప్రత్యేక కసరత్తు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రతి శనివారం ఇండస్ట్రియల్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. పరిశ్రమల ద్వారా వచ్చిన పెట్టుబడులు రాష్ట్ర యువతకు ఉపాధిని, ప్రభుత్వానికి ఆదాయాన్ని అందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సబ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.ఈ సమావేశానికి మంత్రులు దుద్దిళ్ల …
Read More »మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లండ్ సంచలన ఆరోపణలు.. విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ వేదికగా 72వ ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన బ్రిటన్‌కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ అనూహ్యంగా ఈ పోటీల నుంచి వైదొలిగి ఈ నెల 16న తిరిగి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే తొలుత తన వ్యక్తిగత కారణాల వల్ల పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపిన మిస్ ఇంగ్లాండ్. తమ దేశానికి వెళ్లిన తర్వాత మిస్ వరల్డ్ పోటీలపై సంచలన ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో …
Read More »కొలిక్క వచ్చిన తెలంగాణ కేబినెట్ విస్తరణ?.. సాయంత్రంలోపు తుది నిర్ణయం వెలువడే ఛాన్స్
తెలంగాణ కేబినెట్ విస్తరణనకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం సాయంత్రంలోపు కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై తుది నిర్ణయం వెలువడనుంది.గత మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ అంశాలపై కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కాగా ఇవాళ మధ్యాహ్నం మరోసారి అధిష్టానంతో భేటీ అయ్యి కేబినెట్ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కావొస్తున్న ఇప్పటికీ ఇంకా కేబినెట్ విస్తరణ చేయలేదు. దీంతో పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు మంత్రి …
Read More »కరోనా కేసులు పెరుగుతున్నాయ్.. జర జాగ్రత్త..! రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..
కనుమరుగై పోయిందనుకుంటున్న వేళ కరోనా రీ ఎంట్రీ మళ్లీ కలకలం రేపుతోంది. కొత్త రూపంలో పంజా విసురుతోంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులే అందుకు నిదర్శనం. పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా పట్టణాల్లోనే కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. NB.1.8.1, LF.7 అనే కరోనా వేరియంట్స్ ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే.. జేఎన్.1 వేరియంట్ కేసులు నమోదయ్యాయి.. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో …
Read More »నైరుతి రుతుపవనాల రాక.. రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు!
కేరళా తీరాన్ని తాకిన నైరుతు రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తర కర్ణాటకాలో ఏర్పడిన అల్పపీడనం నెమ్మదిగా తూర్పు వైపుకు కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.కేరళా తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తూ పశ్చిమ మధ్య తూర్పు మధ్య అరేబియా …
Read More »నేడు కాకతీయ వాసరత్వ సంపద, శిల్పాకళ సందర్శనకు అందగత్తెలు.. వాహ్ వరంగల్ అనేలా ఏర్పాట్లు.
కాకతీయుల వారసత్వ సంపద, శిల్పకళా వైభవాన్ని ప్రపంచ సుందరీమణులు సందర్శించనున్నారు.. ప్రపంచ సుందరీమణుల సందర్శన కోసం కాకతీయ శిల్ప సంపదకు నిలయమైన రామప్ప ఆలయం, వేయి స్తంభాలగుడి, ఖిలా వరంగల్ కోటను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.. అందగత్తెలు అబ్బురపోయేలా వాహ్ వరంగల్ అనేలా ఆ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు, ఆలయాలు ఇప్పుడు నయా లుక్ తో వెలిగి పోతున్నాయి..వరంగల్ జిల్లాలో ఈ రోజు ప్రపంచ అందాల సుందరిమణులు రెండు టీములుగా పర్యటించనున్నారు.. గ్రూపు- 1 టీమ్ లో22 మంది, గ్రూప్-2లో 35 మంది …
Read More »కోర్టులో ఉద్యోగాలు లైఫ్ సెటిల్ అనుకుని డబ్బులిచ్చారు.. కట్ చేస్తే..
నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు మోసం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నప్పటికీ, అమాయక నిరుద్యోగులు మోసపోతూనే ఉన్నారు. కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు నిరుద్యోగ మహిళలకు జాదూగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.నల్లగొండ పట్టణానికి చెందిన ఎండీ నసీర్ నల్లగొండ కోర్టులో విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులకు గుమస్తాగా పని చేస్తున్నారు. మరోవైపు పలు కేసులపై ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేసేవాడు. నల్లగొండకు చెందిన జ్యోతి రాణి జూనియర్ అడ్వకేట్‌గా పని …
Read More »తెలంగాణ పాలిసెట్ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది.. ఇంతకీ ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు మే 13న పాలిసెట్ 2025 పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 276 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. మొత్తం 1,06,716 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వారిలో 98,858 మంది పరీక్షకు హాజరైనట్టు సాంకేతిక విద్యామండలి కార్యదర్శి పుల్లయ్య ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మంగళవారం పాలిసెట్ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇక పాలీసెట్ ఫలితాలు ఈ …
Read More »25 ఏళ్ల వైభవాన్ని చాటిచెప్పేలా బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు అట్టహాసంగా ఏర్పాట్లు!
25 ఏళ్ల వైభవాన్ని చాటిచెప్పేలా అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది గులాబీ పార్టీ. బాహుబలి వేదిక.. ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసేలా ప్రదర్శనలు.. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్ని విశిష్టతలు ఉండబోతున్నాయని భారతీయ రాష్ట్ర సమితి(BRS) పార్టీ సంకేతాలు ఇస్తోంది. పోరాటాల పురిటిగడ్డ వరంగల్ వేదికగా కనీవినీ ఎరుగని రీతిలో జనసమీకరణ చేసి తమ సత్తా చాటుతామంటోంది కారు పార్టీ. ఇంతకీ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి. వరంగల్‌ను సెంటిమెంట్‌గా భావిస్తున్న గులాబీ పార్టీ.. మూడు జిల్లాల సరిహద్దు అయిన ఎల్కతుర్తి దగ్గర రజతోత్సవ మహాసభ నిర్వహించేందుకు …
Read More »సోషల్ మీడియా మాటున చాటుమాటు యవ్వారం.. సీన్ తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది.!
హైదరాబాద్ మహానగరాన్ని మాదకద్రవ్యాల రహిత నగరంగా మార్చాలని ప్రభుత్వం ముందుకు సాగుతుంటే.. కేటుగాళ్లు మాత్రం కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. తాజాగా నగరంలో మరో దందా బట్టబయలు అయ్యింది. పెద్ద ఎత్తున నిషేధిత ఈ-సిగరెట్లను, వేపింగ్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాంపల్లి ప్రాంతానికి చెందిన సాదిక్ అలాని, అనిల్ అలాని అనే ఇద్దరు అన్నదమ్ములు ‘SID’ పేరుతో ఏకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, దాని ద్వారా …
Read More »