తెలంగాణ

ఐపీఎల్‌లో ఫిక్సింగ్ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన రాచకొండ సీపీ.. ఏమన్నారంటే?

ఐపీఎల్ 2025లో ఉత్కంఠ మ్యాచ్‌లు సాగుతున్నాయి. ప్రస్తుతం లీగ్‌లో సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్లే ఆఫ్స్ చేరే జట్లపైనా ఓ క్లారిటీ వచ్చేసింది. 34 మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి ఢిల్లీ జట్టు అగ్రస్థానంలో నిలవగా, పంజాబ్ కింగ్స్ 10 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అయితే, ఈ క్రమంలో ఓ వార్తతో ఐపీఎల్ ఫ్రాంచైజీలతోపాటు బీసీసీఐలో కలకలం రేపింది. హైదరాబాద్ కేంద్రంగా ఓ బిజినెస్ మెన్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ వార్తలు వినిపించాయి. దీంతో ఒక్కసారిగా అభిమానులు కూడా షాక్ అయ్యారు. తాజాగా దీనిపై …

Read More »

టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 అభ్యర్ధులకు బిగ్‌షాక్‌.. నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే

తెలంగాణలో ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష నియామకాలు సర్వత్రా చర్చకు దారి తీశాయి. ఇప్పటికే దీనిపై టీజీపీఎస్సీ క్లారిటీ ఇచ్చినా.. కొందరు అభ్యర్ధులు హైకోర్టును సంప్రదించారు. దీంతో గ్రూప్ 1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయమని హైకోర్టు ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించరాదని సూచించింది. అయితే ప్రస్తుతం నడుస్తున్న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగించవచ్చని పేర్కొంది. ముఖ్యంగా గ్రూప్‌ 1 మెయిన్స్‌ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌లో తాము తీర్పు వెలువరించే వరకు నియామక పత్రాలు …

Read More »

మొన్న MBBS.. నేడు ఇంజనీరింగ్‌.. ప్రాంతీయ భాషల్లోకి పాఠ్య పుస్తకాల ముద్రణ షురూ!

గతంలో ఎంబీబీఎస్‌ పాఠ్యపుస్తకాలు, మెడికల్ విద్యను ప్రాంతీయ భాషల్లో ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇంజినీరింగ్‌ విద్యలోనూ పలు మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్‌ డిప్లొమా, డిగ్రీ కోర్సులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను ప్రాంతీయ భాషల్లో అందించడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చర్యలు చేపడుతోంది. స్థానిక భాషల్లో ఇంజినీరింగ్‌ పాఠ్య పుస్తకాలను అందించడానికి కసరత్తు చేస్తోంది. వివిధ విభాగాల్లో ఇప్పటికే కార్యచరణ ప్రారంభించారు కూడా. తద్వారా ప్రాథమిక, హైస్కూల్‌ విద్యను మాతృభాషలో చదువుకుని ఇంజినీరింగ్‌లో ఆంగ్లమాధ్యమంతో …

Read More »

నేడే జేఈఈ మెయిన్‌ తుది ర్యాంకుల విడుదల.. కటాఫ్‌ ఎంత ఉంటుందంటే?

జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గురువారం (ఏప్రిల్ 17) విడుదల చేయనుంది. ఈ ఏడాది జనవరిలో జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు జరుగగా.. ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు తుది విడత పరీక్షలు జరిగాయి. ఏప్రిల్‌ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్‌-1 (బీఈ/ బీటెక్‌) పరీక్షలు, ఏప్రిల్‌ 9వ తేదీన పేపర్‌-2ఏ, 2బీ (బీఆర్క్‌/బీ ప్లానింగ్‌) ప్రవేశ పరీక్షలు జరిగాయి. అయితే ఈ రెండు విడతల పరీక్షల్లోని …

Read More »

ఇంటర్ సిలబస్ మారిందోచ్..! క్లారిటీ ఇచ్చిన ఇంటర్ బోర్డు!

వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ సిలబస్ మారుతుందన్న ప్రచారంపై తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య క్లారిటీ ఇచ్చారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ మార్పు నిజమేనంటూ ఆయన తేల్చి చెప్పారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి మారిన సిలబస్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. అయితే పదేళ్ల నుంచి ఒకటే సిలబస్ ఉండటంతో జాతీయ విద్యావిధానంకు అనుగుణంగా మార్పులు చేయడం అనివార్యమైందన్నారు. ఇంటర్ సిలబస్ మార్పుపై సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ కమిటీని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీలో …

Read More »

తెలంగాణలో పొలిటికల్‌ వార్.. ప్రకంపనలు సృష్టిస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు!

మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం..అనే మాట కొన్నాళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో విపరీతంగా వినిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ టార్గెట్‌గా బీఆర్ఎస్ నేతలు పలు సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యింది. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన పలు సభల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మీరు ప్రభుత్వాన్ని కూలుస్తామంటే.. జనాలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకుంటారా?..చెట్టుకు కట్టేసి బట్టలూడదీసి కొడతారంటూ ప్రతిపక్షాలకు గట్టి వార్నింగే ఇచ్చారు.ఈ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి …

Read More »

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడో చెప్పేసిన బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య

అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ముందే తక్కువ మార్కుల తేడాతే ఫెయిల్ న పేపర్లను మరోసారి వాల్యూయేషన్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో విద్యార్థులకు నష్టం జరగకుండా ఉంటుందని అంటున్నారు. ఇంటర్ రిజల్ట్స్ ఇచ్చాక విద్యార్థులు కావాలంటే రీ వాల్యూయేషన్ కు అప్లై చేసుకునే ఛాన్స్ ఎప్పటిలానే ఉంటుందని అన్నారు.ఏపీలో ఇంటర్ ఫలితాలు వెలువడటంతో తెలంగాణలో ఫలితాలు ఎప్పుడు వస్తాయో అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గత నెల 25న తెలంగాణ ఇంటర పరీక్షలు పూర్తయ్యాయి. నెల రోజుల లోపే ఫలితాలు ఇవ్వాలని …

Read More »

నల్గొండ కాంగ్రెస్‌లో కార్చిచ్చు.. హైకమాండ్‌కు తలనొప్పిగా మారిన కేబినెట్ కూర్పు!

కాంగ్రెస్‌ పార్టీకి, నల్గొండ జిల్లాకు అవినాభావ సంబంధం ఉంది. అందుకు తగ్గట్టే.. ఈ జిల్లా నుంచి ఉద్ధండ నాయకులు పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తుంటారు. అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో.. పెద్ద తలకాయలుగా చలామణి అవుతుంటారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే బడా లీడర్ల పేర్లకు ఇక్కడ కొదవుండదు. అదంతా ఒకెత్తయితే.. జిల్లాలో ఈ హేమాహేమీల మద్య అస్సలు పొసగకకపోవడం ఒకెత్తు. పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ఇక్కడి నాయకులతో ఇదో తలనొప్పి. కాంగ్రెస్ అధికారంలోకి …

Read More »

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఫలితాల వెల్లడి తేదీలు వచ్చేశాయ్‌! ఎప్పుడంటే..

పరీక్షలు రాసి పలితాల కోసం ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఇంటర్ ఫస్ట్, సెకండియర్ విద్యార్ధులకు అలర్ట్. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేసిన ఇంటర్ బోర్డు మార్కులను ఆన్ లైన్ లో క్రోడీకరించే పనిలో పడ్డారు. ఈ విధానం మరో వారంలోనే పూర్తి చేసి ఆ తర్వాత వెనువెంటనే ఫలితాలు విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్ధుల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 19 సెంటర్లల్లో మార్చి 19 నుంచి ప్రారంభమైన …

Read More »

ఇక కొలువుల జాతర మొదలు – తెలంగాణ లో భారీగా ఉద్యోగాలు

తెలంగాణలో నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్న ఉద్యోగ ప్రక్రియలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. గత ఏడాది నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రంగా చేసుకుని నిలిపివేసిన ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇప్పుడు ఒకదాని వెంట ఒకటి వెలువడనున్నాయి. గతంలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను రీషెడ్యూల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం ముఖ్యమంత్రితో పాటు మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై స్పష్టమైన కార్యాచరణ రూపొందించనుంది. ఎస్సీ వర్గీకరణ చట్టంతో ఆగిన ప్రక్రియ తెలంగాణ ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి …

Read More »