11వ శతాబ్దంలో ప్రస్తుత కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించిన కళ్యాణి చాళుక్య యువరాణి అక్కాదేవికి చెందిన రెండు బంగారు నాణేలు తెలంగాణ రాష్ట్రంలో లభించాయి. దీనిని అరుదైన ఆవిష్కరణగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈ నాణేలు తెలంగాణలోని మాడుగుల గ్రామం సమీపంలో లభించాయి. వాటిపై కన్నడ భాషలో 11వ శతాబ్దపు అక్షరాలతో కూడిన శాసనాలు ఉన్నాయి.కళ్యాణి చాళుక్య యువరాణి అక్కాదేవికి చెందిన రెండు బంగారు నాణేలు తెలంగాణలో తొలిసారిగా లభించాయని భారత పురావస్తు సర్వే (ASI) తెలిపింది. ఈ నాణేలు మహబూబ్ నగర్ జిల్లా మాడుగుల …
Read More »మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. 3 రోజులు మద్యం షాపులు బంద్!
రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ శాసనమండలి సభ్యుల (MLC) ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 27 వరకు హైదరాబాద్‌లోని మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఫిబ్రవరి 25న ఉదయం 6:00 గంటల నుండి ఫిబ్రవరి 27న ఉదయం 6:00 గంటల వరకు వైన్ షాపులు బంద్ అవుతాయి..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మందు బాబులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఏకంగా 3 రోజుల వరకు మద్యం షాపులు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఫిబ్రవరి 25 నుంచి 27వ తేదీ వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు ఎక్సైజ్ …
Read More »పెళ్ళికొడుకు అలంకారం లో ముస్తాబైన పరమశివుడు… మహాశివరాత్రికి మూడు రోజుల ముందే కళ్యాణ మహోత్సవం…
23 వ తేదీ ఆదివారం మాఘ బహుళ దశమి ముహూర్తాన ఉదయం 11 గంటలకు శ్రీ భవాని సహిత సిద్దేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు.. ఈ నేపద్యంలో ఆలయాన్ని కళ్యాణ వేడుకకు పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. కల్యాణ మహోత్సవానికి ముందు ఆనవాయితీ ప్రకారం సిద్దేశ్వరన్నీ పెళ్లి కొడుకులా ముస్తాబు చేశారు.. స్వయంభు సిద్దేశ్వరస్వామి లింగం వద్ద స్వామి వారినీ అచ్చం పెళ్ళి కొడుకులా ముస్తాబు చేసిన అలంకరణ ను చూసి భక్తులు మురిసి పోతున్నారు..దక్షిణ కాశీగా పేరుగాంచిన వరంగల్ లోని శ్రీ స్వయంభు …
Read More »ఆ నగరానికి ఏమైందీ? వారానికో హత్య.. ఆరు నెలల్లో మొత్తం 24 ఖూనీలు..!
గత రెండు మూడు నెలలుగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హత్యలన్నీ ఆ నగరంలోనే జరిగాయి కాబట్టి. అందునా.. తెలుగు రాష్ట్రాల్లోనే హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరం అది. ఆ సిటీ పేరు.. ఓరుగల్లు. హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలైతే.. వరంగల్-హన్మకొండ-కాజీపేట్ ట్రైసిటీ. తెలంగాణకు అన్‌అఫీషియల్ క్యాపిటల్‌గా చూస్తుంటారు ఈ ఏకశిలానగరాన్ని.తెలుగు రాష్ట్రాల్లో హత్యాకాండ సిరీస్ నడుస్తోందా అనే అనుమానం వస్తోంది ఈ వరుస ఘటనలు చూసి వరుస హత్యలు, హత్యాయత్నాలు చెరగని రక్తపు మరకలు పడేలా చేస్తున్నాయి. ఓరుగల్లులో బరితెగిస్తున్న దుండగులు నడిరోడ్డుపై వీరంగం సృష్టిస్తున్నారు. కత్తులు …
Read More »కన్యాదానం తంతు ముగియగానే.. పెళ్లి కుమార్తె తండ్రికి గుండెపోటు.. ఆస్పత్రికి తీసుకెళ్లగా
చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు… నిండుగుండెలు నిలువునా ఎండిపోతున్నాయి. ఉన్నపళంగా ఊపిరి ఆగిపోతోంది… ఇక్కడ అంబులెన్సుల్లేవ్… హాస్పిటల్ ట్రీట్‌మెంట్లూ లేవు. కళ్ల ముందే జీవితాలు ఆవిరైపోతుంటే కళ్లు తేలేస్తున్నాం… తప్ప ఏమీ చెయ్యలేని అచేతనావస్థ మనది. తాజాగా తెలంగాణలో మళ్లీ అలాంటి కేసు వెలుగుచూసింది.పూర్తి ఆరోగ్యంగా ఉన్నా.. ఎలాంటి సమస్యలు లేకపోయినా.. మనిషి ప్రాణాలు క్షణాల్లో ఆవిరైపోతున్నాయి. అప్పటి వరకూ ఎంతో యాక్టివ్‌గా ఉన్నా అంతలోనే కుప్పకూలిపోతున్నారు. హార్ట్.. స్ట్రోక్.. ఈ పేరు వింటేనే.. గుండె వేగం పెరిగితోంది. రక్తం చిక్కబడినా.. రక్తం గడ్డకట్టినా.. గుండె ఆగిపోయినట్టే. …
Read More »కుప్పకూలిన SLBC సొరంగం.. టన్నెల్‌లో 50 మంది కార్మికులు..! హుటాహుటిన బయల్దేరిన మంత్రి ఉత్తమ్..
ఎడమ వైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల క్రితం మళ్లీ పనులు మొదలయ్యాయి. ఇవాళ ఉదయం పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో టన్నెల్‌లో 50 మంది కార్మికులు ఉన్నట్లు అంచనాలు వస్తున్నాయి. ఘటనా స్థలానికి వెళుతున్నారు నాగర్ కర్నూల్ ఎస్పీ భవ్ గైక్వాడ్.శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్‌లో ప్రమాదం జరిగింది..ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలింది. 14వ కి.మీ దగ్గర మూడు మీటర్ల మేర పైకప్పు కుంగింది. ఎడమ వైపు …
Read More »ముగ్గురు ఐపీఎస్ అధికారులకు షాకిచ్చిన కేంద్ర హోం శాఖ! 24 గంటల్లో అక్కడ రిపోర్ట్ చేయండి..!
అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి. ఈ ముగ్గురిని వెంటనే రిలీవ్ చేయాలని హోం శాఖ ఆదేశాలిచ్చింది. డీజీ అంజనీ కుమార్ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఆయన తెలంగాణ డీజీపీగా కూడా గతంలో పనిచేశారు. అభిషేక్ మహంతి ప్రస్తుతం కరీంనగర్ సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అభిలాష బిస్త్త్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.తెలంగాణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్‌లకు కేంద్ర హోం శాఖ షాకిచ్చింది. ప్రస్తుతం ఉన్న పోస్టుల నుంచి రిలీవ్ చేస్తూ.. 24 గంటల్లోగా …
Read More »దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురం కలిగిన ఆలయంగా యాదగిరిగుట్ట
ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏ దేవాలయంలో లేని విధంగా ఆలయ విమానం గోపురం స్వర్ణమయమైంది. 23న సుదర్శన లక్ష్మీనరసింహ దివ్య విమాన స్వర్ణ గోపురం మహాకుంభాభిషేక ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది.యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ స్వర్ణ విమానావిష్కరణకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు స్వస్తివాచనం, విష్వక్సేనారాధన, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం పూజలతో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, మృత్సంగ్రహణం, యాగశాల ప్రవేశం, …
Read More »హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీలపై వివాదం.. అడ్డుకుంటామని VHP ప్రకటన
హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీలపై వివాదం నెలకుంది. మే 4 నుంచి 31వరకు తెలంగాణలో ‘మిస్ వరల్డ్’ పోటీలు నిర్వహణకు ప్లాన్ చేశారు. హైదరాబాద్ వేదికగా గ్రాండ్ ఫినాలే, ప్రారంభ-ముగింపు వేడుకలు జరగనున్నాయి. మిగతా ఈవెంట్స్ కోసం రామప్ప, యాదాద్రి, లక్నవరం, అనంతగిరి ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. తెలంగాణలో అందాల పోటీల నిర్వహణను విశ్వ హిందు పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అడ్డుకుని తీరుతామని చెబుతోంది. గతంలో కూడా భారత్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయ్. 1996, 2024లో ముంబై వేదికగా ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించారు. ఇప్పుడు …
Read More »అడకత్తెరలో గేమ్ ఛేంజర్లు.. శుద్దపూసలెవరు..? కనిపించని నాలుగో సింహాలెవరు?
బహిరంగ హెచ్చరికలు.. దాంతోపాటే ఓదార్పులు. నిజానికి.. అధికారులు, రాజకీయ నేతల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడు మొదలైంది కాదు. నాలుగంకెల జీతంరాళ్లకు పనిచేసే హోమ్‌గార్డ్, క్లర్క్ నుంచి రాష్ట్ర పాలన, పోలీసు యంత్రాంగం మొత్తాన్ని చూపులువేలితో శాసించగల చీఫ్ సెక్రటరీ, డీజీపీ దాకా.. అందరిదీ ఒకటే కథ. అంతులేని పని ఒత్తిడి.గివ్ రెస్పెక్ట్.. టేక్ రెస్పెక్ట్..! గౌరవ మర్యాదలు అనేవి అడుక్కుంటే వచ్చేవి కావు. ఆజమాయిషీ చేస్తే దొరికేవి కావు. ఇచ్చిపుచ్చుకుంటే వచ్చేవి. పొలిటీషియన్ అండ్ బ్యూరోక్రాట్.. వీళ్ల ప్రొఫెషనల్ రిలేషన్ కూడా అచ్చంగా …
Read More »