తెలంగాణ

పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తాడోపేడో.. జాతీయస్థాయి పోరుకు సిద్దం..

ఎమ్మెల్యేల ఫిరాయింపుపై చాలా సీరియస్‌గా ఉంది భారత రాష్ట్ర సమితి. ఎలాగైనా ఉప ఎన్నికలు తీసుకొచ్చి రాష్ట్ర రాజకీయాల్లో గులాబీ జెండాను రెపరెపలాడించాలని తపన పడుతుంది. పనిలో పనిగా పార్టీ నుంచి క్యాడర్‌ను ,లీడర్ షిప్‌ను కాపాడుకునేందుకు ఇదొక ఎత్తుగడగా వాడుకుంటుంది. ఇప్పటికే గులాబీ పార్టీ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొంతమంది బహిరంగంగా పార్టీ మారినట్లు ప్రకటించారు, మరి కొంతమంది మేము ఇంకా బీఆర్ఎస్‌లో ఉన్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నారు. ఈ పార్టీ ఫిరాయింపులపై ఏడాది క్రితమే …

Read More »

ఇకపై పేపర్‌ లీక్‌ చేస్తే దబిడి దిబిడే.. విద్యాశాఖ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు విద్యాశాఖ పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 21 నుంచి జరగనున్న టెన్త్ పబ్లిక్‌ పరీక్షల్లో పేపర్ లీకేజీలకు తావులేకుండా వీటిని అరికట్టేందుకు తొలిసారిగా సరికొత్త విధానాన్ని ప్రవేశ పెట్టనుంది. పబ్లిక్‌ పరీక్షల సమయంలో యేటా పేపర్ లీకేజీలు అధికారులకు తలనొప్పిగా మారుతున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు పలు చర్యలకు ఉపక్రమించింది..తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రీ ఫైనల్ …

Read More »

తెల్లవారుజామున ఇంటి తలుపు తట్టిన వ్యక్తిని.. చూసి షాక్ తిన్న విద్యార్థి..!

పదవ తరగతి అనేది విద్యార్థికి మైలు రాయి లాంటిదని, కష్టపడి చదువుకోవాలని విద్యార్థికి కలెక్టర్ సూచించారు. పదవ తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రతినెల ఐదు రూపాయల సొంత డబ్బులను ఇస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు చదువు కోసం తల్లిదండ్రులు కష్టపడుతుంటారని కలెక్టర్ హనుమంతరావు అన్నారు.వినూత్న ఆలోచనలు, కార్యక్రమాలతో జిల్లా పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు ఆ జిల్లా పాలనాధికారి. విద్యా విషయాల్లో ఆయన చొరవే వేరు. ఇప్పటికే ఆ అధికారి చాక్ పీస్ పట్టి పాఠాలు బోధించారు. గరిటే చేత పట్టి విద్యార్థులకు …

Read More »

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి ప్రీ ఫైనల్స్‌ పరీక్షలు షురూ.. టైం టేబుల్‌ ఇదే

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి విద్యార్ధులకు పబ్లిక్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. వీటికి ముందు నిర్వహించే ప్రీ ఫైనల్‌ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక తెలంగాణలో మార్చి 6 నుంచి ప్రారంభం అవుతాయి. ఇవి ముగిసిన తర్వాత ఏపీలో మార్చి 17వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఇక తెలంగాణలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో షెడ్యూళ్లు వచ్చేశాయ్‌..తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు …

Read More »

ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేది ఇంకెన్నడో.. తప్పని నిరీక్షణ!

తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లతో పాటు ఆయా సెట్ల పరీక్షల తేదీలను కూడా ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. అంతేకాకుండా ఇప్పటికే ఈఏపీసెట్, పీజీఈసెట్‌లతో సహా పలు సెట్ల షెడ్యూల్‌లను కూడా ఖరారు చేసింది. అయితే అటు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభంకాకపోవడంతో విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు కన్వీనర్ల నియామకంలో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. తెలంగాణలో కన్వీనర్ల నియామకంతోపాటు పరీక్షల షెడ్యూల్, దరఖాస్తుల …

Read More »

రతన్ టాటా రూ.15 వేల కోట్లు ఎవరికి వస్తాయి? వీలునామాలో ఎవరి పేర్లు ఉన్నాయి?

రతన్‌టాటా ప్రస్తుతం మన మధ్య లేరు. గొప్ప వ్యాపారవేత్త.. అంతకుమించిన మహా మనిషి. వ్యాపారానికి, విలువలు జోడించిన వ్యక్తి. దిగ్గజ కార్పొరేట్లకు అంతనంత ఎత్తులో ఉండే వ్యక్తి రతన్‌టాటా. మనదేశంలో చూస్తున్న స్టార్టప్‌ విప్లవానికి ఆయన ప్రేరణగా నిలిచే వ్యక్తి. ప్రపంచ కుబేరుల జాబితాలో బోలెడు మంది ఉన్నారు. కానీ రతన్ టాటా లాంటి వాళ్లు ఒక్కరే ఉంటారు. సంపదంతా సమాజ సేవకే అంకితం చేశారు.రతన్‌ టాటా కాదు ఆయన ‘రత్న’ టాటా. పుట్టుక పార్సీ అయినా పదహారణాల భారతీయుడు. స్కూల్‌ పుస్తకాల్లో కచ్చితంగా …

Read More »

తెలుగు రాష్ట్రాల్లోని లక్షల కోళ్లు మృత్యువాత.. ఆందోళనలో పౌల్ట్రీ రైతులు

తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ ఫామ్స్‌ను అంతుచిక్కని వైరస్ అల్లాడిస్తోంది. రోజూ వేలాది సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో.. పౌల్ట్రీ రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పౌల్ట్రీ ఫారాలు వద్ద గుట్టలు గుట్టలుగా మృతి చెందిన కోళ్లు దర్శనమిస్తున్నాయి.. ఒక్కొక్క పౌల్ట్రీ ఫారం వద్ద సుమారు రోజుకు పదివేల కోళ్లు మృతి చెందుతున్నాయి.ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో పౌల్ట్రీ రంగం అల్లాడిపోతుంది. కోళ్లు మృత్యువాత పడుతుండటంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత 15 రోజుల్లో ఉమ్మడి జిల్లాలో 40 లక్షల …

Read More »

మొండితనం వద్దు.. పట్టు విడుపు ధోరణి ముద్దు.. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం హితవు

విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక సూచనలు చేసింది. 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల విషయంలో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వివరించింది. వచ్చే భేటీలో ఒక నిర్ణయం తీసుకుందామని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ చెప్పినట్టు తెలిసింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయి దశాబ్ద కాలం దాటింది. అయినా సరే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని షెడ్యూల్ …

Read More »

నో హెల్మెట్, నో ఇన్స్యూరెన్స్.. నో పెట్రోల్.. త్వరలోనే హైదరాబాద్ లో

నో హెల్మెట్..నో ఇన్సూరెన్స్… నో పెట్రోల్, డీజిల్..! కొత్త నిబంధనలు కేంద్ర కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొస్తుంది. వాహనాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. అన్ని వాహనాలకు థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి చేసింది. బీమా లేకపోతే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయలేరు.తెలంగాణలో కూడా నో హెల్మెట్, నో ఇన్స్యూరెన్స్.. నో పెట్రోల్ ను అమలు చేసే విధంగా చర్యలు చేపడతామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. రోడ్డు రవాణా మాసోత్సవలలో భాగంగా దీనిపై ఉన్నతాధికారులతో చర్చింది …

Read More »

గర్జించిన కేసీఆర్.. కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు

రాష్ట్రంలో మళ్లీ కరెంట్ కోతలు వచ్చాయి.. మంచి నీళ్లకు కరువు వచ్చిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలు ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని చెప్పారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుందని విమర్శించారు. ఇక లాభం లేదు, ప్రత్యక్ష పోరాటానికి రెడీ అవ్వాలని అధినేత క్యాడర్‌కు పిలుపునిచ్చారు.ఎర్రవెల్లి వ్యవసాయక్షేత్రంలో జహీరాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కోహీర్, జహీరాబాద్, ఝారసంగం, మొగుడంపల్లి మండలాల నేతలు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీమంత్రి హరీష్‌రావు అందరు …

Read More »