ఎంతటి లెక్కలేనితనం.. ఎంతటి నిర్లక్ష్యం. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనే ఇలాంటి సీన్.. నిజంగా స్ట్రిక్ యాక్షన్ తీసుకోవాల్సిందే. యువత మత్తుకు బానిస కాకుండా ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్‌లో సీఎం ఫోటోను అసభ్యంగా ఎడిట్ చేశారు పెట్టారు దుండగులు. ఇలా ఎవరు చేశారో ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.గంజాయి, మత్తు పదార్థాల విక్రయం, వినియోగంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది.. గంజాయి మూలాలను కూకటి వేళ్ళతో పెకిలిస్తోంది.. అందులో భాగంగానే నార్కోటిక్ అధికారులు ప్రజలను చైతన్య పరుస్తూ చాలా ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. …
Read More »బందర్ టూ హైదరాబాద్ – సీఎం రేవంత్ కొత్త ప్లాన్ అదుర్స్
సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం హైదరాబాద్‌లో జరగడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడి దశాబ్దం పూర్తవుతుండగా, రాష్ట్ర అభివృద్ధి కోసం “తెలంగాణ రైజింగ్” అనే ఒక కలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి…డ్రై పోర్ట్ ఏర్పాటు తెలంగాణకు తీరప్రాంతం లేకపోవడంతో డ్రై పోర్ట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని బందర్ ఓడరేవు ద్వారా ప్రత్యేక రహదారి, రైల్వే కనెక్షన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఫోర్త్ …
Read More »ఏసీబీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చా.. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తాః కేటీఆర్
కేటీఆర్‌పై ఫార్ములా ఈ రేస్ కేసు ఆరోపణల నేపథ్యంలో ఓ వైపు లీగల్ ఫైట్.. మరోవైపు పొలిటికల్ పోరాటం. ఈ రెండూ సమాంతరంగా సాగాలని భావిస్తోంది బీఆర్ఎస్. కేసులపై న్యాయపరంగా పోరాడాలని భావిస్తున్న కేటీఆర్.. అదే సమయంలో బీఆర్ఎస్ రాజకీయ పోరాటాలు కూడా అదే స్థాయిలో కొనసాగాలని శ్రేణులకు పిలుపునిస్తున్నారు.ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకపోయినా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టుకున్నా పోరాటం ఆగదన్నారు. ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరించానని మాజీ మంత్రి …
Read More »లేటుగా వచ్చారని స్టూడెంట్స్‌ను వీరబాదుడు బాదిన టీచర్.. కట్ చేస్తే..
టెన్త్, ఇంటర్మియట్ చదువుతున్న విద్యార్థులను ఫిజికల్ డైరెక్టర్ విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో విద్యార్థులకు వాతలు తేలాయి. విషయం తెలియడంతో తల్లిదండ్రులు.. స్కూల్‌కి చేరుకుని ఆందోళన దిగారు. అతడ్ని సస్పెండ్ చేయాంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చదువు చెప్పాలి.. తప్పు చేస్తే.. కాస్త గట్టిగా భయం చెప్పాలి. అంతేకానీ ఇలా పశువులను బాదినట్లు బాదితారా..? సిద్దిపేట – కొండపాక మండలం దుద్దెడలోని గురుకుల పాఠశాలలో చదువతున్న 30 మంది ఇంటర్మీడియట్, టెన్త్ విద్యార్థులు.. ఉదయం వేళ నిర్వహించిన ప్రత్యేక స్టడీ అవర్స్‌కు వివిధ కారణాల …
Read More »సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట..
టాలీవుడ్ సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. అలాగే ఈ కేసును నాలుగు వారాలకు వాయిదా వేసింది. కొద్ది రోజుల క్రితం టీవీ 9 జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ జరిపారు. ఇరువురి …
Read More »పండుగ వేళ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోనే ఉంటుందా..?
సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) పూర్తి స్థాయిలో సన్నద్దమైంది. ఈ పండుగకు 6432 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం ఇప్పటికే నిర్ణయించింది. ప్రధానంగా ఈ నెల 10, 11, 12 తేదిల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేసింది. అలాగే, ఈ నెల 19, 20 తేదిల్లో తిరుగు ప్రయాణ రద్దీకి సంబంధించి తగిన ఏర్పాట్లు …
Read More »ఫార్మా జీసీసీలకు కేంద్రబిందువుగా హైదరాబద్.. వచ్చే ఐదేళ్లలో 25లక్షల ఉద్యోగావకాశాలు
హైదరాబాద్ ఐటీ రంగంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) విస్తరణలో ఉన్నతస్థానాన్ని దక్కించుకున్నట్లే, ఇప్పుడు ఫార్మా రంగంలోనూ అగ్రగామిగా ఎదుగుతోంది. బహుళజాతి సంస్థలు (ఎంఎన్సీలు) తమ వ్యాపార విస్తరణకు, సమర్థవంతమైన నిర్వహణకు ఈ కేంద్రాలను స్థాపిస్తున్నాయి. ఇటీవల, హైదరాబాద్ ఫార్మా జీసీసీలకు కీలక హబ్‌గా రూపుదిద్దుకుంటోంది. ఎలీ లిల్లీ, మెర్క్ సంస్థల జీసీసీలు ప్రారంభం 700 బిలియన్ డాలర్ల విలువైన లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగంలో ప్రముఖ సంస్థ ఎలీ లిల్లీ హైదరాబాద్‌ను తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కోసం ఎంచుకుంది. మెర్క్ (ఎంఎస్), …
Read More »పండగకు ఊరెళ్లేవారికి పోలీసులు సూచనలు.. ఫాలో అవ్వకపోతే మీకే నష్టం
తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి ఒకటి. అందరూ ఒక్కచోట ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది. ఉద్యోగాలు, వ్యాపారాలు లేదా ఇతర కార్యకలాపాల కోసం వివిధ ప్రాంతాలలో స్థిరపడిన చాలా మంది వ్యక్తులు సొంతూర్లకు వచ్చి.. కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య చేసుకునే పండగ ఇది. అయితే పండక్కి ఊరెళ్లెవారికి ఓ అలెర్ట్…తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి. కొత్త ఏడాదిలో మొట్టమొదట వచ్చే పండుగ. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఇంటికి చేరి ఆనందంగా ఉండే సమయం. అందుకే …
Read More »టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఆన్సర్ ‘కీ’ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 3 రాత పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్ సైట్ నుంచి కీ డైన్ లోడ్ చేసుకోవచ్చు. ఆనర్స్ కీపై అభ్యంతరాలు లేవనెత్తే వారు జనవరి 12, 2025 సాయంత్రం 5:00 గంటలలోపు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. అభ్యంతరాలు ఇంగ్లీషులో మాత్రమే తెల్పవల్సి ఉంటుంది. అలాగే అభ్యర్ధి పేరు, ఎడిషన్, పేజీ నంబర్ వంటి రిఫరెన్స్ వివరాలను స్పష్టంగా పేర్కొనవల్సి ఉంటుంది.ఎన్నో రోజుల ఎదురు చూపుల తర్వాత …
Read More »మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. మార్చి 31లోగా ఉద్యోగ ఖాళీల వివరాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. ఖాళీల ప్రకారం నోటిఫికేషన్ల జారీపై ఏప్రిల్‌లో కసరత్తు చేస్తామని, కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి 6 నుంచి 8 నెలల్లో భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. తాజాగా గ్రూప్-3 ‘కీ’ విడుదల చేశామని, రెండ్రోజుల్లో గ్రూప్ 2 ‘కీ’ కూడా విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం …
Read More »