తెలంగాణ

చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు.. కలెక్టర్‌కు ఫిర్యాదు.. కారణం ఏంటంటే..!

గురుకులాల్లో సమస్యలు విద్యార్థులను అల్లకల్లోలం చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఆహార కల్తీ తో ఆస్పత్రి పాలైన విద్యార్థులు… ఇప్పుడు ఉపాధ్యాయులు వేధింపులకు పాల్పడుతున్నారంటూ రోడ్డెక్కారు. జోగుళాంబ గద్వాల్ జిల్లాలో ఏకంగా 20 కిలోమీటర్లు నడిచి వెళ్లి మరీ జిల్లా కలెక్టర్ కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమపై వేధింపులకు పాల్పడుతున్న ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జోగుళాంబ గద్వాల్ జిల్లా బీచుపల్లి బాలుర గురుకుల పాఠశాల విద్యార్థుల ఆందోళన సంచలనంగా మారింది. తమను వేధిస్తున్న ప్రిన్సిపల్‌ ను తక్షణమే సస్పెండ్ చేయాలంటూ …

Read More »

అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఆంధ్రాకు ఇంకా వర్షాలు వీడలేదు. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తాజా వెదర్ రిపోర్ట్ ఇలా ఉంది.నిన్నటి నైరుతి & ఆనుకుని ఉన్న పశ్చిమ బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనం ఈ రోజు బలహీనపడినది. ఆయితే దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 1.5 …

Read More »

యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి ఏర్పాటు సాధ్యమేనా..? అసలు చిక్కుముడి అదేనా?

మహిమాన్విత స్వయంభూ లక్ష్మీనర్సింహ స్వామి కొలువైన చోటు యాదగిరిగుట్ట. అంతటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో.. 15ఏళ్లుగా పాలకమండలి లేదంటే నమ్మగలమా? కారణాలేమైనా నేటికీ అలాగే కొనసాగుతోంది. అయితే, కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టింది. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట పాలకమండలి ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా.. అద్భుతమైన ఆలయంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. అయితే, యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలి …

Read More »

ఇసుక దీవిలో అద్భుతం.. కాకులు దూరని కారడవిలో మతి పొగుడుతున్న “బ్లాక్ బెర్రీ” ఐలాండ్.. ఎక్కడో తెలుసా..?

అందాల ద్వీపంలో ఆనందాల విహారం.. కారడవిలో ఇసుక దీవి.. ఆ ఇసుక దీవి మధ్య ఆధునిక గుడారాలలో బస చేస్తే ఎలా ఉంటుంది..! ఆ ఊహను నిజం చేసే ఆధునిక దీవి వచ్చేసింది..! తెలంగాణ టూరిజం సర్క్యూట్ ములుగు జిల్లా అడవుల్లో రూపుదిద్దుకున్న “బ్లాక్ బెర్రీ” దీవి రా రమ్మంటోంది..! బ్లాక్ బెర్రీ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..!డిఫరెంట్ థీమ్స్‌తో ఎంజాయ్ చేయాలని తహతహలాడే ప్రతి ఒక్కరు ప్రకృతి అందాలను అన్వేషిస్తూ ఎక్కడెక్కడికో పరుగులు పెడుతుంటారు. కాస్త ఖరీదైన పర్వాలేదు.. అక్కడికి కుటుంబ సమేతంగా వెళ్లి తనివితీరా …

Read More »

మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే ప్రభుత్వం సీరియస్‌: రేవంత్ రెడ్డి

గంటలుగా కొనసాగుతున్న సీఎం, సినీ పరిశ్రమ పెద్దల భేటీ . బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ . టికెట్ రేట్స్ పెంచే విషయంలో చర్చ జరిగింది. ప్రభుత్వం అందించే గద్దర్ అవార్డ్స్ విషయంలో ఇప్పటికే ఏర్పాటైన నర్సింగ్ రావు కమిటీ సిఫార్సులపై ఇండస్ట్రీ రెస్పాన్స్‌పై చర్చ జరిగిందిసినీ ప్రముఖుల భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌కి పూర్తి మద్దతు ఉంటుందన్నారు. సంధ్య థియేటర్‌ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే ప్రభుత్వం …

Read More »

ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్న సినీ పెద్దలు.. సీఎం ఏమన్నారంటే

సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖుల భేటీ అయ్యారు. ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సీఎం రేవంత్ చేరుకున్నారు. సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు చేరుకున్నారు. దిల్‌రాజ్‌ నేతృత్వంలో 36 మంది సభ్యులు సీఎంతో భేటీ అయ్యారు . ఇందులో 21 మంది నిర్మాతలు.. 13 మంది దర్శకులు, 11 మంది నటులు ఉన్నారుసినిమా పెద్దలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలువురు సినీ ప్రముఖులు మాట్లాడారు. రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు …

Read More »

కలకలం రేపుతున్న కల్తీ కల్లు.. ఆరుగురికి అస్వస్థత.. విచారణలో సంచలనాలు..!

నల్గొండ జిల్లాలో కల్తీ కల్లు కలకలం సృష్టించింది. కల్తీ కల్లు తాగిన ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారంకు చెందిన దుబ్బాక అచ్చయ్య, పాక పిచ్చయ్య, వల్లపు లింగయ్య, మేడిపల్లి భిక్షం, గంట రామచంద్రయ్య, కన్నీబోయిన నరేష్ వ్యవసాయ కూలీలు పనిచేస్తున్నారు. రోజు మాదిరిగానే గ్రామానికి చెందిన గీత కార్మికుడి వద్ద గ్రామ శివారులో ఉన్న కుమ్మరి కుంట వద్ద మధ్యాహ్నం కల్లు తాగారు. అయితే అనుహ్యంగా వారంతా అస్వస్థతకు గురయ్యారు. కల్లు …

Read More »

లేడీ హోంగార్డు చేతివాటం.. 3 జిల్లాల్లో రూ. కోటి దాకా లూటీ! ధనవంతులే టార్గెట్

డబ్బున్న వ్యక్తులతో సాన్నిహిత్యంగా మెలుగుతూ, అనంతరం బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ పలువురిని ముప్పుతిప్పలు పెట్టి దాదాపు రూ. కోటి వరకు దండుకుంది ఓ మహిళా హోం గార్డు. ఏకంగా పోలీస్‌ శాఖలో హోంగార్డుగా పనిచేస్తూ వ్యవహరించిన తీరు ఆ శాఖకే కళంకం తెచ్చిపెట్టేలా ఉంది. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. వేములవాడలో హోంగార్డుగా పనిచేస్తుండగా రాజన్న ఆలయ అనే మహిళ.. అదే జిల్లాలో ఏఈగా పనిచేసి రిటైర్డ్‌ అయిన శేఖర్‌తో కొంత కాలం క్రితం పరిచయం పెంచుకుంది. …

Read More »

తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు విస్తరంగా వర్షాలు కురుస్తాయని .. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ వార్నింగ్‌ ఇచ్చింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడుతాయని IMD అధికారులు చెబుతున్నారు. రెండ్రోజులుగా ఎడతెరపిలేని వర్షాలతో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. సముద్రవేటకు వెళ్లొద్దని సూచించారు.బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యంతో పాటు.. నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది …

Read More »

మరోవారంలో యూజీసీ- నెట్‌ (డిసెంబర్) పరీక్షలు.. రెండు రోజుల్లో అడ్మిట్ కార్డులు విడుదల

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 (యూజీసీ- నెట్‌) పరీక్షలు సమీపిస్తున్నాయి. మరోవారంలో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే యూజీసీ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ నమోదు చేసి పరీక్ష కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చు. ఈ స్లిప్పులో పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, సమయం, విధివిధానాలు వంటి వివరాలు ఉంటాయి. ఇక మరో రెండు మూడు రోజుల్లో అడ్మిట్‌ కార్డులు కూడా విడుదల కానున్నాయి. …

Read More »