తెలంగాణ

రణరంగంగా మారిన తెలంగాణ అసెంబ్లీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు!

ఫార్ములా -E కేసు రచ్చ అసెంబ్లీలో సాగింది. భూభారతి బిల్లుపై మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా తెలంగాణ అసెంబ్లీలో రగడ జరిగింది. ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంపై చర్చ చేపట్టాలంటూ బీఆర్‌ఎస్‌ ఆందోళనకు దిగడంతో అధికార-విపక్షాల మధ్య యుద్ధం జరిగింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తమకు చెప్పు చూపించారని బీఆర్‌ఎస్‌.. స్పీకర్‌పై దాడి చేశారంటూ కాంగ్రెస్‌ ఆందోళనలకు దిగాయిఉదయం రణరంగంగా మారింది తెలంగాణ అసెంబ్లీ. భూభారతి బిల్లుపై చర్చను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. వెల్‌లోకి దూసుకెళ్లి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. పోడియం దగ్గర హరీష్‌రావు తోపాటు మరికొందరు …

Read More »

 యూజీసీ నెట్‌ 2024 (డిసెంబర్‌) పరీక్షల తేదీలు మారాయోచ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే

జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ అవార్డు, పీహెచ్‌డీ ప్రవేశాలకు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీ పడేందుకు అర్హత సాధించే యూజీపీ నెట్ పరీక్షకు దేశ వ్యాప్తంగా యమ డిమాండ్ ఇంటుంది. అందుకే ప్రతీయేట ఈ పరీక్షను రెండు సార్లు యూజీపీ నిర్వహిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ సెషన్ కు సంబంధించి పరీక్షల తేదీలను ఇప్పటికే యూజీపీ ప్రకటించింది. అయితే ఈ తేదీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి..యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 (యూజీసీ- నెట్‌) పరీక్ష తేదీలు మారాయి. …

Read More »

హైకోర్టులో ఏసీబీ కేసుపై కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌.. విచారణ ఎప్పుడంటే?

ఫార్మూలా ఈ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై గురువారం ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ కేసును క్యాష్ చేయాలని, బోజనం తర్వాత తన పిటిషన్‌పై విచారణ చేయాలని కోర్టును కోరారు. జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు రానుంది.మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో ఫార్మూలా ఈ రేసు వ్యవహారంలో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఏసీబీ ఈ ఫార్మూలా రేసు వ్యవహరంలో కేటీఆర్‌పై కేసు నమోదు చేసింది. …

Read More »

బాబోయ్ వీళ్లు మామూలోళ్లు కాదు.. హైవేపై మకాం వేస్తారు.. లిఫ్ట్ ఇచ్చారో ఇక అంతే సంగతులు..

వ్యాపారాల్లో నష్టాలు రావడం సహజమే. నష్టాలను పూడ్చుకునేందుకు వ్యాపారులు వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తారు. కానీ వీరు మాత్రం నష్టాలను అధిగమించేందుకు కొత్త మార్గాన్ని అనుసరించారు. నష్టాలను పూడ్చుకోవడానికి వీరు లిఫ్ట్ అడిగి బురిడీ ఎలా కొట్టించారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే…! సికింద్రాబాద్ ఇందిరమ్మనగర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కొరపాటి నర్సింగరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా పార్వతీపురం మండలం బంధలుప్పి గ్రామానికి చెందిన బాత ప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పరిచయమై స్నేహితులుగా మారారు. …

Read More »

అమ్మాయిలనుకొని గెలుకుదామని వెళ్లారు.. తీరా దగ్గరికి వెళ్లి చూసేసరికి ఫ్యూజులు ఔట్..!

హనుమకొండలో నిత్యం రద్దీగా ఉండే పబ్లిక్ గార్డెన్లో ఆకతాయిలు తిష్ట వేశారు. ఆడవాళ్ళు, అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. బాధితులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి షీ టీమ్ బృందం ఆ ఆవారాగాళ్ళను ఎలా పట్టుకున్నారో తెలుసా? వారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఆ ఘటన ఏంటో మీరే చూడండి… బాధితులు ఇచ్చిన సమాచారంతో షీటీమ్ బృందం రంగంలోకి దిగింది. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్లో రెక్కీ నిర్వహించి సాధారణ మహిళల్లాగే గడిపారు. సాయంత్రం సమయంలో ఎప్పటిలాగే అక్కడికి చేరుకున్న పోకిరీలు అమ్మాయిల …

Read More »

దమ్ముంటే.. చర్చ పెట్టండి, సమాధానం చెప్పడానికి సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!

ఏడాది కాలంగా అగ్నిగుండాన్ని తలపిస్తున్న తెలంగాణ రాజకీయాల్లో.. తాజాగా మరో సంచలనం నమోదైంది. మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదుకావడం దుమారం రేపుతోంది. ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన ఏసీబీ.. ఆయనను ఏవన్‌గా నిర్ధారించింది. ఈ అంశంపై పాలక ప్రతిపక్షాలు ఎవరివాదన వారిదే అన్నట్టుగా … పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి.ఫార్ములా E కార్‌ రేసుకు సంబంధించి కేటీఆర్‌పై కేసు నమోదు కావడం… తెలంగాణ రాజకీయాల్లో మంటలు పుట్టిస్తోంది. ఈ అంశంపై పాలక ప్రతిపక్షాలు ఎవరివాదన వారిదే అన్నట్టుగా సాగుతోంది. ఈ …

Read More »

పెద్దాపూర్‌ గురుకులంలో వరుస పాముకాట్లు.. 2 రోజుల్లో ఇద్దరు విద్యార్ధులు ఆస్పత్రిపాలు

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్ధుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి. గురుకుల పాఠశాలల్లో నిత్యం ఏదో ఒక ఘటన చోటు చేసుకోవడంతో వార్తల్లో నిలుస్తున్నాయి. ఫుడ్ పాయిజన్, పాముకాట్లు.. సంగతి సరేసరి. ఇప్పటికే ఎందరో ఆస్పత్రి పాలవగా.. కొందరు విద్యార్ధులు మృత్యువాత పడ్డారు కూడా. తాజాగా మరో ఇద్దరు విద్యార్ధులకు పాముకాటుకు గురయ్యారు..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాలు సమస్యల నిలయంగా మారాయి. ఇటీవల కాలంలో వరుస ఫుడ్‌ పాయిజన్లు, పాముకాట్లు, విద్యార్ధులు ఆత్మహత్యలతో పలువురు విద్యార్ధులు తనువు చాలించారు. …

Read More »

తెలంగాణ పాలిటిక్స్‌లో అతిపెద్ద సంచలనం.. మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు!

నాలుగు సెక్షన్లు నాన్‌బెయిలబుల్‌ కేసులే పెట్టిన ఏసీబీ అధికారులు, A-1గా కేటీఆర్‌, A-2గా అరవింద్‌ కుమార్‌, A-3గా BLN రెడ్డి పేర్లను చేర్చారు. అధికార దుర్వినియోగం కింద ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది.తెలంగాణ పాలిటిక్స్‌లో అతిపెద్ద సంచలనం.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై కేసు నమోదు అయ్యింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కేటీఆర్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. …

Read More »

తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఏ తేదీన ఏ పరీక్షంటే

తెలంగాణ పదో తరగతి విద్యార్ధుల పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ గురువారం (డిసెంబర్ 19) విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఏ తేదీన ఏ పరీక్ష ఉంటుందో ఆ వివరాలు మీ కోసం..తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి విద్యార్ధులకు పబ్లిక్‌ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 21వ తేదీ …

Read More »

కానిస్టేబుళ్ల నియామకంలో వారిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించాల్సిందే.. హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ నియామకాల్లో తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని కోరుతూ భారీ సంఖ్యలో హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా వీరి పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని హోంగార్డు అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. పోలీసు కానిస్టేబుల్‌ ఎంపిక ప్రక్రియలో వారిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆరు వారాల్లో …

Read More »