సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. పుష్ప సినిమా ప్రీమియర్స్ సమయంలో అల్లు అర్జున్ థియేటర్ కు రావడంతో ఒక్కసారిగా అభిమానులు భారీగా చేరుకోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టుకు రిమాండ్ విధించింది. కోర్టు తీర్పుతో అల్లు అర్జున్ ను చంచల్‌గూడ జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. 12గంటల 15నిమిషాలకు జూబ్లీహిల్స్ నివాసంలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. …
Read More »బెయిల్ నిరాకరణ.. అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్.. చంచలగూడా జైలుకు అల్లు అర్జున్
12గంటల 15నిమిషాలకు జూబ్లీహిల్స్ నివాసంలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో ఆయన సతీమణి స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. చంచలగూడా జైలుకు అల్లు అర్జున్ ను తరలించనున్నారు పోలీసులు. ఏ 11 కి పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ,7 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. సంధ్య థియేటర్ …
Read More »అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. పోలీసుల తీరుపై ఆగ్రహం
సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో భాగంగా చిక్కడ పల్లి పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఇది అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో పాటు అందరినీ షాక్ కు గురిచేసింది. ముఖ్యంగా బన్నీ అరెస్ట్ పై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా కేంద్ర హోంశాఖ …
Read More »జపాన్‌లో ఉద్యోగాలకు హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు.. ఎంపికైతే నెలకు రూ.2 లక్షల వరకు జీతం
తెలంగాణ నిరుద్యోగులకు జపాన్ లో ఉద్యోగం పొందే ఛాన్స్ ఇంటి గుమ్మంలోనే ఎదురు చూస్తుంది. మీరు చేయాల్సిందల్లా నేరుగా ఇంటర్వ్యూ జరుగుతున్న అడ్రస్ కు వెళ్లడమే. శుక్రవారం నాడు హైదారాబాద్ లో ఈ కింది అడ్రస్ లో ఇంటర్వ్యూ జరుగుతుంది. ఎంపికైతే నెలకు రూ. 2 లక్షల వరకు జీతంగా పొందొచ్చు..జపాన్‌లో నర్సు ఉద్యోగాలకు అధిక డిమాండ్ ఉంది. అక్కడ ఉద్యోగం చేయాలనుకునే వారికి సదావకాశం వచ్చింది. మనదేశంలోనే నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి జపాన్‌లో ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం డిసెంబర్ 13న మల్లేపల్లి …
Read More »అల్లు అర్జున్ అరెస్ట్.. కేటీఆర్ రియాక్షన్ ఇది
సంధ్య థియేటర్ ఘటన నేపధ్యంలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్‌పై బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ కీలక ట్వీట్ చేశారు. జాతీయ పురస్కారం అందుకున్న స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్.. పాలకుల అభద్రతాభావానికి పరాకాష్ట అని కేటీఆర్ విమర్శించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్‌ను.. సాధారణ నేరస్తుడిగా ట్రీట్ చేయడం సరికాదని తెలిపారు. ప్రభుత్వ తీవ్రచర్యను ఖండిస్తున్నాను. హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకు బాధ్యుడైన రేవంత్‌రెడ్డిని …
Read More »Biggestn Breaking: అల్లు అర్జున్ అరెస్ట్..పోలీస్ స్టేషన్‌కు తరలింపు..
సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు.సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. పుష్ప2 సినిమా విడుదల సందర్భంగా 4వ తేదీన సంథ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. దాంతో తొక్కిసలా ఘటనపై చిక్కడ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో అల్లు అర్జున్‌ను కూడా నిందితుడిగా …
Read More »వామ్మో.! గడ్డకట్టించే చలి.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన ఉష్ణోగ్రతలు..
తెలుగు రాష్ట్రాలనూ మంచు ముంచేస్తోంది. చలితీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. అటు దట్టమైన మంచుతో వాహనాలు, విమానాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పొగ మంచు కురుస్తోంది. పొగమంచుతో విమానాల రాకపోకలపై ప్రభావం పడుతోంది. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ వెళ్లే విమానాలు ఆలస్యం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు ప్రభావం రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఇక మంచు ఎక్కువగా ఉండటంతో విమానాల రాకపోకలకు సైతం ఆటంకం కలుగుతోంది. ఆదిలాబాద్, అల్లూరి జిల్లాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు …
Read More »విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక ఆ ఇబ్బందులు ఉండవు..!
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో జీఎంఆర్ గ్రూప్ కీలక ప్రకటన చేసింది. ఎయిర్‌పోర్టులో రెండో టెర్మినల్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇది ప్రయాణికుల రద్దీని తగ్గించడంలో ఉపయోగపడనుంది. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రతి ఏడాదికి 3 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. ఈ సంఖ్య 4.5 కోట్లకు చేరుకున్న తర్వాత కొత్త టెర్మినల్‌ను జీఎంఆర్ గ్రూప్ పూర్తిగా వినియోగంలోకి తీసుకురానుంది .ఇప్పటికే ఎఐతో పని చేసే ప్రెడిక్టివ్ ఆపరేషన్ సెంటర్‌ను (APOC) కేంద్ర పౌర విమానయాన శాఖ …
Read More »అప్పుడు ఖమ్మం.. ఇప్పుడు లగచర్ల.. రైతుకు బేడీలపై వేడెక్కిన రాజకీయం.. జైలర్ సస్పెండ్..
లగచర్ల రైతుకు సంకేళ్ల ఇష్యూలో రేవంత్ సర్కారును ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది..బీఆర్ఎస్ పార్టీ. అన్నంపెట్టే రైతు చేతికి బేడీలు వేస్తారా..? అంటూ మండిపడుతోంది. దీంతో హస్తం నేతలు ఏడేళ్లు వెనక్కి వెళ్లి ఖమ్మం ఇష్యూను తెరమీదకు తెస్తున్నారు. ఇంతకూ లగచర్య ఇష్యూకు.. ఖమ్మం ఘటనకు సంబంధం ఏంటి..? లగచర్ల Vs ఖమ్మం ఘటనలో వాస్తవాలేంటి..?చల్లబడిదనుకున్న లగచర్ల ఇష్యూ మరోసారి వేడెక్కింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ తోపాటు అధికారులపై దాడి కేసులో నిందితుడు, రైతు హీర్యా నాయక్‌ను సంగారెడ్డి జైలు నుంచి సంకెళ్లతో …
Read More »కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఎందుకంటే..
సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులను కలిసి సీఎం.. ఇవాళ మరికొందరిని భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు విజ్ఞప్తులు చేయనున్నారు. అటు ఏఐసీసీ పెద్దలతో సీఎం సమావేశం తర్వాత.. మంత్రి వర్గ విస్తరణపై కీలక అప్‌డేట్ రానుంది.ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పలువురు కేంద్రమంత్రులు, పార్టీ పెద్దలను కలిసే పనిలో ముఖ్యమంత్రి బిజీబిజీగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ పెద్దలతో కీలక భేటీ జరగనుంది. మరోవైపు రాష్ట్రంలో పలుప్రాజెక్టుల కోసం నిధుల మంజూరు చేయాలంటూ …
Read More »