మానవమేదో వికాసానికి ప్రతీక. భారత దేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి అత్యుత్తమ కీర్తి చంద్రిక. శ్రమ శక్తిని రుజువు చేసిన కరదీపిక. తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా పైరు పచ్చలతో సింగారించిన అద్భుత నిర్మాణ సౌధం నాగార్జునసాగర్ ప్రాజెక్టు. అసమానమైన రాతి కట్టడంగా రూపు దాల్చిన శ్రమ సౌధం. లక్షల మంది శ్రేయాన్ని అక్షయనం చేసిన శిలాక్షరమైన ఈ నవ దేవాలయానికి (డిసెంబర్ 10వ తేదీ) నేటితో 69 ఏళ్లు నిండి 70వ వడిలోకి అడుగపెట్టింది. తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఈ మహా కట్టడం …
Read More »మోహన్ బాబు ఇంటి చుట్టూ బౌన్సర్లు.. 30 మందిని దింపిన మనోజ్
మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్ . మంచు ఫ్యామిలీలో ఫైటింగ్ రచ్చగా మారింది. మోహన్‌బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లను పంపారు మంచు విష్ణు, మంచు మనోజ్. కాసేపట్లో మోహన్‌బాబు ఇంటికి వెళ్లనున్నారు మంచు విష్ణు. అన్నదమ్ముల మధ్య గతంలోనూ గొడవలు జరిగాయి .మంచువారింట్లో గొడవలు మంటలు రేపుతున్నాయి. మోహన్‌బాబు కుమారులు మంచు విష్ణు-మంచు మనోజ్ మధ్య గొడవలు ముదిరాయి. మోహన్ బాబు ఇంటి చుట్టూ విష్ణు 40 మంది బౌన్సర్లను పెడితే.. మనోజ్ 30 మంది బౌన్సర్లను దింపాడు. దుబాయ్ నుంచి హైదరాబాద్ …
Read More »ఇక 9, 10 తరగతి విద్యార్ధులకు ‘తెలుగు సబ్జెక్ట్’ తప్పనిసరేం కాదు.. విద్యాశాఖ ఉత్తర్వులు
SSC మినహా మిగతా బోర్డులకు సంబంధించిన పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా అమలు చేయాలనే నిబంధనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ఈ నిబంధనను కేవలం 8వ తరగతి వరకు మాత్రమే అమలు చేయాలని, 9, 10 తరగతులకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది..తెలంగాణ రాష్ట్రంలో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ ఇతర బోర్డుల్లో 9, 10 తరగతులు చదివే విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ కీలక అప్‌డేట్ జారీ చేసింది. ప్రస్తుత (2024-25), వచ్చే విద్యా సంవత్సరం (2025-26) తొమ్మిదవ, పదో తరగతి చదివే విద్యార్ధులు …
Read More »ఆధార్ కార్డులాగా విద్యార్థులకు అపార్ కార్డ్.. దీని ప్రయోజనం ఏంటి?
APAAR ID Card: సెకండరీ స్కూల్స్ నుంచి కాలేజీల వరకు విద్యార్థులకు ఈ అపార్ కార్డును అందజేయాలని యోచిస్తున్నారు. ఈ అపార్ చాట్‌లో ఆధార్ కార్డ్ వంటి 12 అంకెల సంఖ్య ఉంటుంది. కార్డులో విద్యా సమాచారాన్ని నిల్వ చేస్తుంది..ప్రస్తుతం భారతదేశంలోని పౌరులందరికీ ఆధార్ గుర్తింపు కార్డు. ఆధార్ అనేది గుర్తింపు కార్డు మాత్రమే కాదు.. ప్రతి పనికి ఆధార్ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. ప్రస్తుతం ఆధార్ లేకుండా కొన్ని పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు …
Read More »పేదింటి విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ 2024 మీ కోసమే! ఇలా దరఖాస్తు చేసుకోండి
పేదింటి విద్యా కుసుమాల చదువుకు ఆర్ధిక ఇబ్బందులు ప్రతిబంధకాలుగా నిలవకూడదనే ఉద్ధేశంతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) స్కాలర్ షిప్ అందిస్తోంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఎవరైనా ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు..చదువుకోవలన్న తపన కలిగిన ఎందరికో పేదరికం అడ్డుగా నిలుస్తోంది. దీంతో ప్రతిభ ఉండి కూడా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదువలేకపోతున్న ఎందరో యువత తమ కలలు సాకారం చేసుకునేందుకు తల్లడిల్లిపోతున్నారు. అటువంటి పేద విద్యార్థులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) …
Read More »ఫిబ్రవరి 23న గురుకుల 5వ తరగతి ఎంట్రన్స్ టెస్ట్.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు మరో పది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు గురుకుల సొసైటీ కార్యదర్శి, ఉమ్మడి ప్రవేశ పరీక్ష కన్వీనర్ వర్షిణి తెలిపారు..తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ డిసెంబర్ 18వ తేదీన విడుదలకానుంది. ఈ మేరకు గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్ జారీచేయనున్నట్లు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి, ఉమ్మడి ప్రవేశ …
Read More »మరింత ఆలస్యం కానున్న టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఫలితాలు.. కారణం ఇదే
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షల ఫలితాలు, పోస్టుల భర్తీ ప్రక్రియను అవరోహణ క్రమం నిర్వహించాలని టీజీపీఎస్సీ బోర్డు నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తొలుత గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబరు 21 నుంచి 27 వరకూ జరిపారు. ఆ తర్వాత గ్రూప్-3 పరీక్షలు నవంబరు 17, 18 తేదీల్లో జరిగాయి. గ్రూప్ 2 పరీక్షలు డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల మాదిరిగాకాకుండా ఫలితాలను మాత్రం రివర్స్ విధానంలో విడుదల చేసేందుకు కమిషన్ సిద్ధం అవుతుంది. అంటే తొలుత గ్రూప్ …
Read More »వికారాబాద్ కుర్రోడి సత్తా.. రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొలువు
తెలంగాణ కుర్రోడు దిగ్రజ వ్యాపార సంస్థ అమెజాన్ లో భారీ ప్యాకేజీతో కొలువు దక్కించుకున్నాడు. ఎక్కడో మారుమూల గ్రామంలో చదువుకుని అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన అమెజాన్ లో ఉన్నత కొలువు దక్కడంటై గ్రామస్థులతో పాటు, తల్లిదండ్రులు సైగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు..తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఏకంగా గ్రోబల్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఏడాదికి రూ.2 కోట్ల వార్షిక ప్యాకేజీతో కొలువు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికే ఆఫర్ లెటర్ కూడా అందుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం నుంచి ఉద్యోగంలో …
Read More »బెయిల్‌పై బయట ఉన్న జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఇక శాశ్వతంగా..
లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అభియోగాలు ఎదుర్కొంటున్నారు టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఇదే కేసులో జైలుకు వెళ్లి వచ్చారు జానీ. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న ఈ స్టార్ కొరియోగ్రాఫర్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది.గత కొన్ని రోజులుగా అటు పర్సనల్ లైఫ్ లోనూ, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లోనూ బాగా స్ట్రగుల్ అవుతున్నాడు స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. తన దగ్గర పనిచేసిన ఓ లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు జానీపై …
Read More »నా నెంబర్ 2 కాదు.. 3 కాదు.. టీవీ9 కాంక్లేవ్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
రేవంత్ రెడ్డి కేబినెట్‌లో నేను నెంబర్ 2 కాదు.. 3 కాదు.. నా నెంబర్ 11 అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.. గతంలో మంచిశాఖ దక్కిందని మాత్రమే చెప్పానంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది విజయోత్సవంపై టీవీ9 వేదికగా జరిగిన వాట్ తెలంగాణ థింక్స్ టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను డీకే శివకుమార్ అంత సీనియర్ కాదంటూ పొంగులేటి పేర్కొన్నారు.. శక్తివంచన లేకుండా ప్రజలకు అండగా ఉంటానంటూ వివరించారు.. ఏడాది పాలనపై మాట్లాడుతూ.. …
Read More »