తెలంగాణ

తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు.. అక్టోబర్ 3 నుంచే, వాటితో పని లేదు

తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు, ఫ్యామిలీ డిజిటల్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల కార్డుల మంజూరుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ హెల్త్ కార్డుల విషయమై.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందజేసే డిజిటల్ కార్డుపై ఆ ఇంటి మహిళనే యజమానిగా గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా అధికారులకు సూచించారు. కుటుంబంలోని సభ్యుల పేర్లు, …

Read More »

హైదరాబాద్‌లో భారీగా తగ్గిన ఇళ్ల అమ్మకాలు.. ఆఫీసులకు మాత్రం ఫుల్ డిమాండ్.. ధరల్లో తగ్గేదేలే..!

Hyderabad Home Prices: హైదరాబాద్ నగరం పేరు గత కొన్ని సంవత్సరాలుగా మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పరంగా ఇక్కడ ఎంతో అభివృద్ధి చెందింది. ఈ క్రమంలోనే ఇళ్లు, భూముల ధరలు రికార్డు స్థాయిలో పలికాయి. ఆ మధ్య కోకాపేటలో ఎకరం రూ. 100 కోట్లకుపైగా పలికింది. ఆ తర్వాత కూడా ఇలాంటి డీల్స్ చాలానే జరిగాయి. ఈ క్రమంలోనే ఇళ్లు, ప్లాట్లు సహా ఫ్లాట్స్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. అద్దెలు కూడా సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి. రేట్లు ఎంత …

Read More »

నాన్న చంపాలనుకున్నాడు.. పెదనాన్న బతికించాడు.. ‘గుండె’లు పిండేసే చిన్నారి స్టోరీ

గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన తండ్రి.. విచక్షణ కోల్పోయి తన కన్నకూతురినే చంపేయాలనుకున్నాడు. ఆ సమయంలో చిన్నారి కొన ఊపిరితో బయటపడినా.. మృత్యువు మాత్రం ఆ గుండెల్లో తిష్టవేసుకుని కూర్చుంది. ఆ చిన్ని గుండెలో రెండు రంధ్రాలున్నాయని తేలటంతో.. పెద్దనాన్నే దగ్గరుండి మృత్యువుపై ఆ చిన్నారిని గెలిపించాడు. రెండేళ్ల వయసు నుంచే మృత్యువుపై పోరాటం చేసి గెలిచిన ఆ చిన్నారి హర్ట్ టచింగ్ స్టోరీ తెలిస్తే గుండెలు బరువెక్కక మానవు. నల్లొండ జిల్లా నాంపల్లి మండలం రాందాస్‌ తండాకు చెందిన మెఘావత్‌ మధు.. నాలుగేళ్ల కిందట …

Read More »

తెలంగాణకు భారీ వర్ష సూచన.. 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్రలోని పలు జిల్లాల్లోనూ గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తెలంగాణలోని 14 రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో గురువారం భారీ …

Read More »

రేవంతన్నా నీకిది న్యాయమా..? ‘హైడ్రా’ కూల్చివేతలపై సీఎం డైహార్ట్‌ ఫ్యాన్‌ ఆవేదన

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చెరువులు, కుంటలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. అయితే ఈ కూల్చివేతలు వివాదాస్పదం అవుతున్నాయి. బడాబాబులు, డబ్బున్నోళ్ల ఇండ్లను వదిలేసి మధ్యతరగతి, పేదల ఇండ్లను కూల్చిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పేదల నోట్లో మట్టి కొడుతున్నారని.. ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అమీన్‌‌పూర్ మున్సిపాలిటి పరిధిలోని పటేల్‌గూడలో ఆదివారం (సెప్టెంబర్ 22)న హైడ్రా పలు విల్లాలు, ఇండ్లు కూల్చేసింది. ఈ కూల్చివేతల్లో ఇళ్లు కోల్పోయిన ఓ వ్యక్తి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశాడు. …

Read More »

సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందేభారత్ ట్రైన్.. 80 శాతం సీట్లు ఖాళీ, ఇలా అయితే కష్టమే..!

సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఇటీవల వందే భారత్ ట్రైన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న వర్చువల్‌గా ట్రైన్ ప్రారంభించగా.. ఈనెల 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. అయితే కొత్త వందేభారత్ ట్రైన్‌లో ఆక్యుపెన్సీ ఆశించినంతగా ఉండటం లేదు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో దాదాపుగా అన్ని కోచ్‌లు ఖాళీగానే ఉంటున్నాయి. 80శాతానికి పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయని.. రైల్వే అధికారులు గుర్తించారు. ప్రయాణికుల నుంచి వస్తున్న ఆదరణ, తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి ఈ ట్రైన్ ఏర్పాటు చేశారు. …

Read More »

తిరుపతి లడ్డూ పై కార్తీ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఫైర్.. హీరో రియాక్షన్ ఇదే..

తాజాగా నిన్న హైదరాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరో కార్తీతోపాటు అరవింద్ స్వామి, మూవీ టీమ్ పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో లడ్డూ కావాలా నాయనా.. ఇంకో లడ్డూ కావాలా నాయనా అంటూ యాంకర్ ప్రశ్నించగా.. దీనిపై కార్తీ చాకచక్యంగా స్పందించాడు. “ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు. ఆ టాపిక్ చాలా సెన్సిటివ్. మనకు వద్దు” అంటూ సమాధానం చెప్పాడు. కోలీవుడ్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ సత్యం సుందరం. ఇందులో …

Read More »

అరుదైన జబ్బులతో బాధపడే పిల్లలకు వరం.. రూ.50 లక్షల ఖరీదైన వైద్యం నిమ్స్‌లో ఉచితం

అరుదైన జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు వరం లాంటి వార్త. అలాంటి చిన్నారులకు హైదరాబాద్ నిమ్స్‌లో 50 లక్షల ఖరీదైన ఉచిత వైద్యం అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ పాలసీ ఫర్‌ రేర్‌ డిసీజ్‌ (NPRD) పాలసీని ఇప్పుడు హైదరాబాద్ నిమ్స్‌ ఆసుపత్రిలో అమలు చేస్తున్నారు. జెనెటిక్‌, అరుదైన వ్యాధులతో బాధపడే చిన్నారులకు ట్రీట్‌మెంట్ అందించేందుకు నిమ్స్ ఆసుపత్రిలో స్పెషల్ వార్డులు, డాక్టర్లను ఏర్పాటు చేశారు. చిన్నారులు గౌచర్‌, పాంపే వంటి అరుదైన, జెనెటిక్‌ జబ్బుల బారిన పడితే కోలుకోవటం కష్టం. వారికి జీవితాంతం ఖరీదైన …

Read More »

దామగుండం ఫారెస్ట్‌లో నేవీ రాడార్ స్టేషన్.. 12 లక్షల ఔషధ మొక్కలు నరికేస్తారా..?

వికారాబాద్ జిల్లాలో ఉన్న దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌కు ఏళ్ల చరిత్ర ఉంది. అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్‌కు ఆనుకుని ఉన్న దామగుండం అడవిలో కొన్ని వేల రకాల మొక్కలు ఉన్నాయి. ఆ రిజర్వ్ ఫారెస్ట్‌కు ఎవరైనా వచ్చి ఆ గాలిని పీలిస్తే ఉన్న రోగాలు పూర్తిగా నయమవుతాయని స్థానికులు అంటుంటారు. దామగుండం వెళ్తే యమగండం పోతుందని ఓ నానుడి కూడా ఉంది. అంతటి చరిత్ర గల దామగుండం ఫారెస్ట్‌పై గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. దామగుండం ఫారెస్ట్‌లో తూర్పు నౌకాదళ రాడార్‌ స్టేషన్‌ నెలకొల్పేందుకు …

Read More »

హైదరాబాద్‌లో మళ్లీ ‘హైడ్రా’ కూల్చివేతలు.. కూకట్‌పల్లిలోని ఆక్రమణలపై బుల్డోజర్లు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువుల, కుంటల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా.. నగరంలో మళ్లీ కూల్చివేతలు మొదలుపెట్టింది. చెరువుల, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలు కబ్జా చేసి నిర్మించి అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూల్చివేతలను ఆపేసిన హైడ్రా తాజాగా.. కూల్చివేతలు ప్రారంభించింది. కూకట్పల్లి నల్లచెరువులోని ఆక్రమణలను తెల్లవారుజాము నుంచే కూల్చేస్తోంది. నల్లచెరువు మెుత్తం విస్తీర్ణం మెుత్తం 27 ఎకరాలు కాగా.. 14 ఎకరాలు కబ్జాకు గురైనట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే బుల్డోజర్లతో …

Read More »