ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్‌రావుకు 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మురళీధర్‌రావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇరిగేషన్ శాఖలో అక్రమాలపైఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మురళీధర్‌రావుకు చెందిన బ్యాంక్ లాకర్లు తెరవనున్నారు. లాకర్లలోని బంగారం లెక్కించాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకంగా పనిచేసిన అధికారుల అవినీతిపై ఏసీబీ నజర్ పెట్టింది. ఇప్పటికే కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరీరామ్.. ఈఈ నూనె శ్రీధర్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ… లేటెస్ట్‌గా మరో మాజీ …
Read More »ఒకేరోజు ముగ్గురు KGBV విద్యార్ధినులు ఆత్మహత్య.. అసలేం జరుగుతోందక్కడ?
తెలంగాణ రాష్ట్రంలో ఒకేరోజు మూడు వేరువేరు KGBVల్లో ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ 3 ఘటనలూ ఒకే రోజున జరగడం.. అదీ ముగ్గురూ కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)లో చదువుతున్నవారే కావడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర గురుకులాల్లో అసలేం జరుగుతుందంటూ విమర్శలు వస్తున్నాయి.. వికారాబాద్ జిల్లా పరిగి మండలం యాబాజి గూడ గ్రామానికి చెందిన నవీంద్ర (16) అనే బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన తిమ్మగల్ల నవీన్ కుమార్ అనే యువకుడు తమ బాలికను వేదించేవాడు. …
Read More »హైదరాబాద్ నగరవాసులకు గుడ్‌న్యూస్.. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌పై మంత్రి కీలక ప్రకటన!
హైదరాబాద్ నగర వాహనదారులకు శుభవార్త. నగరంలోని ప్రముఖ ఎలివేటెడ్ కారిడార్‌లలో ఒకటైన ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈరోజు మంత్రి స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డితో కలిసి కారిడార్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. “కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రాజెక్టు ఆలస్యమైందని.. అయితే ఈ ఏడాది దసరా నాటికి కారిడార్‌ను ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆలస్యానికి …
Read More »చిరంజీవి ఇంటి నిర్మాణం ఇష్యూ ఏంటి..? హైకోర్టు ఏం చెప్పింది..?
మెగాస్టార్ చిరంజీవి తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని కొద్ది రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జీహెచ్ఎంసీకి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట ప్రకారం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవికి చెందిన జూబ్లీహిల్స్ నివాసంలో జరుగుతున్న పునరుద్ధరణ పనులపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చిరంజీవి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు.. ఆయన నివాస నిర్మాణాలకు సంబంధించి దాఖలైన దరఖాస్తుపై చట్టబద్ధంగా …
Read More »వాన కబురు వచ్చేసిందండోయ్.. ఇకపై ఏపీలో నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఈ ఏడాది 15 రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినా.. ఇప్పటివరకు తక్కువ వర్షపాతమే నమోదైంది. తెలంగాణ, ఏపీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- ఈరోజు :- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు …
Read More »భార్యభర్తల మధ్య గొడవ.. పంచాయితీకి వచ్చిన ఇద్దరు దారుణ హత్య.. మరో ముగ్గురికి..
భార్యాభర్తల మధ్య గోడవల కారణంగా గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ ఏర్పాటు చేశారు. దీనికోసం పెద్దపల్లి జిల్లా, మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన అమ్మాయి తరుపువారు, ఓదెల మండలానికి చెందిన అబ్బాయి తరుపువారు పంచాయతీ కోసం సుగ్లాంపల్లిలో సమావేశమయ్యారు. పంచాయతీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలోనే పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తల పంచాయతీ వివాదం రెండు హత్యలకు దారితీసింది. మాట్లాడుకుందామని చెప్పి పంచాయతీకి పిలిచి, ఇరు వర్గాలు కొట్టుకున్నారు. ఈ ఘటనలో సుగ్లామ పల్లి …
Read More »తెలంగాణ హైకోర్టుకు కొత్త జడ్జి.. గతంలో ఎక్కడ పనిచేశారంటే..?
తెలంగాణ హైకోర్టుకు కొత్త చీఫ్ జస్టిస్‌ను నియమించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. దేశంలోని పలువురు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు కోలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో.. పలువురు ప్రధాన న్యాయమూర్తులను వివిద హైకోర్టులకు బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో మరోసారి పలువురు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు జరిగాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను మార్చేందుకు సుప్రీంకోర్టు కొలీజియం ఇచ్చిన సిఫార్సులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడంతో వివిధ రాష్ట్రాల …
Read More »హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. ఉదయాన్నే వాకింగ్ చేసి వస్తుండగా కారం చల్లి..
హైదరాబాద్ నగరంలో వరుస నేర సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.. ఈ క్రమంలోనే.. మలక్‌పేట్‌లోని శాలీవాహననగర్ పార్క్ లో కాల్పులు కలకలం రేపాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో సీపీఐ నేత చందూరాథోడ్ అక్కడికక్కడే మృతి చెందాడు.. వాకింగ్‌కి వెళ్లిన చందూ రాథోడ్‌పై దుండగులు 4 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. చాలా కాలంగా సీపీఐ నేత రాజేష్‌తో రాథోడ్‌కు విబేధాలున్నాయని.. అతనే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని.. రాథోడ్ కుటుంబసభ్యులు రాజేష్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాగరకర్నూల్ జిల్లా అచ్చంపేటకి చెందిన చందూ రాథోడ్ కుటుంబంతో …
Read More »వీళ్లకు ఏమయ్యింది.. ప్రియుడు కలిసి భర్తను హత్య చేసిన భార్య.. ఆ తర్వాత ట్విస్ట్ ఇదే..
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న కోపం హత్యలకు దారితీస్తున్నాయి. ఇలా కుటుంబాలు చిన్నాభిన్నం అవ్వడంతోపాటు.. బాధితుల బిడ్డలు అనాధలుగా మారుతుండడం అందరిని కలవరపెడుతోంది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య.. ప్రియుడు, తమ్ముడితో కలిసి భర్తను హత్య చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసింది. పోలీసులు రంగంలోకి దిగడంతో భార్య చివరికి కటకటాల పాలైంది. యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తువుల స్వామి(38)కి మోత్కూరు మండలం దాచారం …
Read More »ఆపినా ఆగకుండా దూసుకెళ్తున్న బొలెరో వాహనం.. ఆపి చెక్ చేయగా..
ఓ బొలెరో వాహనం హైవేపై దూసుకెళ్తోంది. చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు వాహనాన్ని ఆపాలని ప్రయత్నించినా ఆగలేదు. దీంతో అర్ధరాత్రి ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకోగా.. వారికీ దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి. పుష్ప సినిమా చూసి తెలివికి పదునుపెడుతున్నారో.. లేక పుష్పకు గురువులో గానీ.. పోలీసులకు దొరక్కుండా యదేచ్చగా తమ అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. గంజాయి నుంచి ఎర్రచందనం వరకు.. డ్రగ్స్ నుంచి కలప వరకు అన్నింటినీ రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. అలాంటి ఓ ఘటన …
Read More »