గగనతలం నుంచి సాగించే యుద్ధాల్లో ఆధిపత్యం ప్రదర్శించడంతో పాటు శత్రువుకు అత్యధిక నష్టాన్ని కలగజేయడం కోసం F-35 యుద్ధ విమానాలను రూపొందించారు. సింగిల్-సీట్, సింగిల్-ఇంజిన్‌తో కూడిన ఈ ఫైటర్ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో సమర్థవంతంగా పనిచేయగల్గిన మల్టీరోల్ యుద్ధ విమానం.భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో యావత్ ప్రపంచాన్ని ఆకర్షించి చర్చనీయాంశంగా మార్చింది ఒకే ఒక్క అంశం. అది ప్రపంచంలోని అగ్రశ్రేణి స్టెల్త్ ఫైటర్ జెట్లలో ఒకటైన లాక్‌హీడ్ మార్టిన్ F-35 లైటెనింగ్-II రకం యుద్ధ విమానాలను భారత్‌కు …
Read More »మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోయిందా..? ఈ ట్రిక్స్‌తో పెంచుకోండి!
ప్రతి ఒక్కరికి క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. క్రెడిట్ స్కోర్ లేకుంటే బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం చాలా కష్టం. ఏదైనా రుణం తీసుకోవాలన్నా క్రెడిట్ స్కోర్‌ను చూస్తాయి బ్యాంకులు. అయితే స్కోర్ తగ్గితే దానిని పెంచుకునేందుకు కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. ప్రతి వ్యక్తికి క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. మీకు మంచి స్కోర్ ఉంటే, మీకు సులభంగా రుణం లభిస్తుంది. మీకు అత్యవసరంగా పర్సనల్ లోన్ అవసరమైతే క్రెడిట్ స్కోర్ ఉపయోగపడుతుంది. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీ రేట్లకు పెద్ద …
Read More »అమెరికా-భారత్ బంధం మరింత బలోపేతం కావాలి.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
అమెరికాలోని వైట్ హౌస్‌లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని మోదీ భేటి అయ్యారు. యూఎస్ ప్రెసిడెంట్‌గా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో మోదీ సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ భేటీలో ప్రధాని మోదీతో పాటు విదేశాంగమంత్రి జైశంకర్, NSA అజిత్ దోవల్ పాల్గొన్నారు.అమెరికాలోని వైట్ హౌస్‌లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని మోదీ భేటి అయ్యారు. యూఎస్ ప్రెసిడెంట్‌గా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో మోదీ సమావేశం కావడం …
Read More »టాటా బోయింగ్ మరో అరుదైన ఘనత.. 300వ హెలికాఫ్టర్ ఫ్యూజ్‌లేజ్ డెలివరీ!
మన భారత వైమానిక దళం వద్ద ప్రస్తుతం 22 AH-64 అపాచీ హెలికాఫ్టర్లు ఉన్నాయి. బోయింగ్ అండ్ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) మధ్య ఉమ్మడి వెంచర్ 900 మందికి పైగా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను నియమించింది. వీటి నిర్మాణం కూడా అత్యధునిక టెక్నాలజీతో తయారు చేస్తున్నారు.. అంతర్జాతీయ విమానాల తయారీ సంస్థ బోయింగ్, భారత పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ సంయుక్తంగా ఈ జాయింట్ వెంచర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. అయితే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఈ టాటా బోయింగ్ ఏరో స్పేస్ …
Read More »తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మద్యం ధరలు.. ఇవిగో వివరాలు
ఏపీ, తెలంగాణ మందుబాబులకు భారీ షాక్ తగిలింది. మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. రూ.99కు అమ్మే బ్రాండ్ , బీర్ మినహా మిగిలిన అన్ని కేటగిరీల మద్యం ధరలు సవరిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు తెలంగాణలో బీరు ధరలు పెరిగాయి. రాష్ట్రంలో బీరు ధరలు 15 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్వర్వులు వచ్చాయి.రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగాయి. ప్రాథమిక ధర (బేసిక్ ప్రైస్)ను పెంచుతూ ఎక్సైజ్ శాఖ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అన్ని బ్రాండ్ల …
Read More »లిక్కర్ అక్రమాలపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. లెక్క తేలాల్సిందే..!
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న మద్యం అక్రమాలపై దర్యాప్తు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఏడుగురు పోలీసు ఉన్నతాధికారులతో సిట్ వేయడం ఆసక్తి రేపుతోంది.ఆంధ్రప్రదేశ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ప్రభుత్వ హయంలోని మద్యం అక్రమాలపై కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఏడుగురు పోలీసు ఉన్నతాధికారులతో సిట్ వేయడం …
Read More »రతన్ టాటా రూ.15 వేల కోట్లు ఎవరికి వస్తాయి? వీలునామాలో ఎవరి పేర్లు ఉన్నాయి?
రతన్‌టాటా ప్రస్తుతం మన మధ్య లేరు. గొప్ప వ్యాపారవేత్త.. అంతకుమించిన మహా మనిషి. వ్యాపారానికి, విలువలు జోడించిన వ్యక్తి. దిగ్గజ కార్పొరేట్లకు అంతనంత ఎత్తులో ఉండే వ్యక్తి రతన్‌టాటా. మనదేశంలో చూస్తున్న స్టార్టప్ విప్లవానికి ఆయన ప్రేరణగా నిలిచే వ్యక్తి. ప్రపంచ కుబేరుల జాబితాలో బోలెడు మంది ఉన్నారు. కానీ రతన్ టాటా లాంటి వాళ్లు ఒక్కరే ఉంటారు. సంపదంతా సమాజ సేవకే అంకితం చేశారు.రతన్ టాటా కాదు ఆయన ‘రత్న’ టాటా. పుట్టుక పార్సీ అయినా పదహారణాల భారతీయుడు. స్కూల్ పుస్తకాల్లో కచ్చితంగా …
Read More »ఫిబ్రవరి 1 నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు.. ఎక్కడెక్కడ ఎంతంటే.?
ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రాంతాల్లో భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువలో వ్యత్యాసాలు ఉన్నట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది. వీటిని సరిచేయాలని నిర్ణయించింది. మార్పుల కారణంగా భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచబోతున్నట్టు స్పష్టం చేశారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. రిజిస్ట్రేషన్ బుక్ విలువ పెంచి రిజిస్ట్రేషన్ రేట్లు నిర్ణయిస్తామన్నారు. గ్రోత్ కారిడార్లు, భూముల విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 20శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతాయన్నారు మంత్రి అనగాని. గత వైసీపీ పాలనలో రిజిస్ట్రేషన్ విలువల సవరణలో శాస్త్రీయ విధానాన్ని అనుసరించలేదన్నారు. కొన్ని చోట్ల …
Read More »తెలంగాణతో అమెజాన్ భారీ ఒప్పందం.. రూ.60,000 కోట్ల పెట్టుబడులతో అతిపెద్ద డేటా సెంటర్!
దావోస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. పారిశ్రామిక రంగంలో తెలంగాణ ఎదుగుతోందన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. ఐటీలో అగ్రగామిగా అవతరిస్తుందని, వ్యవసాయం, డెయిరీలో ఎంతో స్కోప్ ఉందంటున్నారు. దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతోంది. దావోస్, సింగపూర్ డీల్స్‌తో సుమారు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయిపెట్టుబడుల సాధనలో దూసుకుపోతోంది తెలంగాణ రాష్ట్రం. దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతోంది. దావోస్, సింగపూర్ డీల్స్‌తో సుమారు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం …
Read More »తెలంగాణకు మరో రూ.45,500 కోట్ల పెట్టుబడులు.. సన్ పెట్రో కెమికల్స్‌తో కీలక ఒప్పందం
దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై తెలంగాణ మరో సారి భారీ పెట్టుబడులను ఆకర్షించి కొత్త రికార్డు సాధించింది. ఇంధన రంగంలో ప్రముఖ సంస్థ సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్రంలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందంపై (ఎంవోయూ) సంతకం చేసింది. ఈ ఒప్పందం ద్వారా నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో మూడు భారీ పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం 3,400 మెగావాట్లు. ఇవి 5,440 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్తు …
Read More »