2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వాటి నుంచి బోనాలు, బతుకమ్మ సహా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా తెలంగాణ పండుగలను ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు జరగని వేడుకలు సైతం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎంతో వైభవంగా తెలంగాణ పండుగలు ఢిల్లీలో జరుగుతున్నాయి. జూన్ 30 సోమవారం తెలంగాణ గవర్నర్ జిష్ణు వర్మ చేతుల మీదుగా ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు ధూంధాంగా నిర్వహించారు.11 ఏళ్లుగా సింహవాహిని శ్రీ మహంకాళి …
Read More »తెలంగాణ కుంభమేళ.. మేడారం మహా జాతర తేదీలు ఖరారు.. ఎప్పుడంటే
30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని, 31న అమ్మవార్ల వనప్రవేశం ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. మూడో రోజునే గద్దెలపై కొలువుదీరి ఉన్న సమ్మక్క, సారలమ్మ వనదేవతలు, గోవింద రాజు, పగిడిద్దరాజుల వారి వన ప్రవేశం కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ మేరకు పూజారులు తేదీలను నిర్ణయించారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో ఈ జాతర జరగనుంది.ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందింది మేడారం మహా జాతర.. ఈ మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే …
Read More »బోనమెత్తిన భాగ్యనగరం.. బోనం అంటే ఏమిటి? ప్రాముఖ్యత.. బోనాల జాతర ఎప్పుడు మొదలైందంటే..
తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల జాతర.. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ప్రారంభం అవుతుంది. నెల రోజుల పాటు హైదరాబాద్ నగరంలో బోనాల సందడి కొనసాగుతుంది. ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించి చల్లగా చూడమని కోరుకుంటారు. ఇక ఈ ఏడాది పండుగ రానే వచ్చింది. ఆషాడ మాసం మొదటి గురువారం గోల్కొండ కోటలో కొలువైన శ్రీ జగదాంబ మహంకాళి అమ్మకు తొలిబోనం సమర్పించడంతో బోనాల సంబురాలు షురూ అయ్యాయి.ఆషాడ మాసం రాకతో తొలకరి జల్లులతో పాటు తెలంగాణలో బోనాల సందడిని తెచ్చింది. మహిళలు …
Read More »బోనాల సంబరాలు షురూ.. గోల్కొండ జగదాంబికకి తొలి బోనం సమర్పణ..క్యూ కట్టిన రాజకీయ నేతలు, భక్తులు
తెలంగాణలో బోనాల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. రాష్ట్ర పండుగ అయిన బోనాల జాతర.. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ప్రారంభం అవుతుంది. నెల రోజుల పాటు హైదరాబాద్ నగరంలో బోనాల సందడి కొనసాగుతుంది. ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించి.. సల్లంగా చూడమని వేడుకుంటారు. ఈ క్రమంలోనే.. ఈ ఏడాది కూడా బోనాల సంబురం మొదలు కాగా.. వచ్చే నెల 24న ముగుస్తాయి. బోనాల పండుగ ప్రారంభంతో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఆలయ అర్చకులు తొలి బోనం సమర్పించారు. బోనాల జాతర ప్రారంభం నేపథ్యంలో తొలి …
Read More »కోరిన కోర్కెలు తీర్చే బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..
ఆషాడ మాసం వచ్చిందంటే చాలు భాగ్య నగరంలోని బోనాల సందడి మొదలవుతుంది. చారిత్రక గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబిక మహంకాళికి తోలి బోనం సమర్పిస్తారు. అనంతరం హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కూడా బోనాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. బోనాల సందర్భంగా ఇక్కడ కొలువైన అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో మహిళలు చేరుకుంటారు. ఈ పురాతన ఆలయంలో ఏ దేవతను పూజిస్తారు? ఈ ఆలయంతో సంబంధం వెనుక ఉన్న నమ్మకం ఏమిటో తెలుసుకుందాం. ఏ దేవతని పూజిస్తారంటే.. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ప్రధానంగా ఆదిశక్తి …
Read More »హైదరాబాద్‌లోనే జగన్నాథుడి దర్శనం.. పూరి వెళ్ళలేనివారికి బెస్ట్..
పూరి.. చార్‌ధామ్ యాత్రలో ఒకటి. అయితే హైదరాబాద్ వాసులు చాలామంది దూరం, బడ్జెట్ కారణంగా వెళ్లలేకపోతున్నారు. అలాంటి వారికోసం ఆ జగన్నాథుడు భాగ్యనగరంలో కూడా దర్శనం ఇస్తున్నాడు. మరి హైదరాబాద్‌లో పూరి జగన్నాథ ఆలయం ఎక్కడ ఉంది.? ఈ టెంపుల్ చరిత్ర ఏంటి.? హైదరాబాద్‌లోని శ్రీ జగన్నాథ ఆలయం కళింగ కల్చరల్ ట్రస్ట్ అద్భుతమైన సృష్టి. ఈ పవిత్ర స్థలం ప్రజల మనస్సులలో హృదయాలలో దైవిక ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఇది అచ్చం పురిలో ఉన్న టెంపుల్ మాదిరిగానే ఉంటుంది. పూరి వెళ్లలేము అనుకునేవారికి ఇది మంచి ఎంపికనే చెప్పవచ్చు. …
Read More »పూరీ జగన్నాథ్ ఆలయ రహస్యం.. నేలపై నీడ పడని వైనం, దైవ ఘటనా, ఆలయ నిర్మాణ శైలా..
ఒడిశాలోని పూరిలో ఉన్న జగన్నాథుని ఆలయం హిందూ మతంలోని నాలుగు ధామాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. జగన్నాథుడు అంటే ప్రపంచానికి ప్రభువు అని అర్ధం. ఇక్కడ దేవుడి సజీవంగా ఉన్నాడని భక్తుల నమ్మకం. అంతేకాదు ఈ జగన్నాథ ఆలయంలో ఎవరూ కనుగొనలేని అనేక అపరిష్కృత రహస్యాలు ఉన్నాయి. ఈ రహస్యాలలో ఒకటి జగన్నాథ్ పూరి ఆలయం నీడ కనిపించకపోవడం. దీనికి కారణం ఏమిటో తెలుసుకుందాందేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలలో జగన్నాథ పూరి ఆలయం ఒకటి. ఈ ఆలయంలో శ్రీ కృష్ణుడు తన అన్నయ్య బలభద్రుడు , సోదరి …
Read More »హిందు ధర్మాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడుదాం.. ధర్మ పరిరక్షణకు మురుగన్ తోడుః పవన్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుబ్రమణ్య భక్తుల సమీకరణ కోసం హిందూ మున్నని ఆధ్వర్యంలో ఈ భారీ కార్యక్రమం చేపట్టారు. లక్షలాది మంది భక్తులు సుబ్రమణ్య స్వామి కంద షష్ఠి కవచాన్ని పఠించిన ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ధర్మం కోసం నిలబడే ప్రతి అడగు మనల్ని విజయతీరాలకు చేరుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మధురైలోని అమ్మతిడల్ ప్రాంగణంలో హిందూ మున్నాని సంస్థ నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా …
Read More »దుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై కొండపైకి వెళ్లకుండానే దర్శన టికెట్లు పొందొచ్చు!
విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. ఇకపై ఆలయ పరిసరాల్లోనే కాకుండా, బస్‌స్టేషన్, రైల్వే స్టేషన్‌లలోనూ భక్తులకు అమ్మవారి దర్శన టికెట్లను అందుబాటులో ఉంచే విధంగా దేవస్థాన కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా భక్తుల విజ్ఞప్తి మేరకు విజయవాడ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, తారాపేట మాడపాటి గెస్ట్ హౌస్, వన్ టౌన్ జమ్మి దొడ్డిలలో దేవస్థానం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం …
Read More »తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భద్రకాళి అమ్మవారి బోనాలు తాత్కాలిక వాయిదా.. ఎందుకంటే!
వరంగల్ భద్రకాళి అమ్మవారికి బోనాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. అయితే ఇటీవల భద్రకాళి అమ్మవారి బోనాలకి సంబంధించి కొంత మంది నుంచి అభ్యంతరాలు రావడంతో పాటు.. పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ విషయంపై తప్పుడు వార్తలు ప్రచురితమైన దృష్ట్యా, ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం స్థానికంగా నెలకొన్న రాజకీయ విభేదాలను.. పవిత్రమైన అమ్మవారికి …
Read More »