పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధ విస్తరణ భయాలు నెలకున్న వేళ.. భద్రతా క్యాబినెట్ కమిటీ అత్యవసర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం, రక్షణ, విదేశాంగ, ఆర్దిక మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై చర్చించనుంది. లెబనాన్‌లో పరిమితి స్థాయిలో ఇజ్రాయేల్ భూతులు దాడులు ప్రారంభించిన కొద్ది గంటల్లోనే.. టెల్ అవీవ్, జెరూసలెం లక్ష్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించడంతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇది మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే …
Read More »ఇరాన్ అణు, చమురు కేంద్రాలే లక్ష్యంగా దాడులు.. ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరికలు
లెబనాన్ భూభాగంలో ఉన్న హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలోకి ఇరాన్ ప్రవేశించడంతో పశ్చిమాసియా ఇప్పుడు భగ్గుమంటోంది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి.. ఇజ్రాయెల్ భూభాగంపై వందలకొద్ది క్షిపణులతో ఇరాన్ భీకర దాడికి దిగింది. ఈ క్రమంలోనే ప్రతీకార దాడులు తప్పవని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ భూభాగంలో ఉన్న ఆ దేశ అణు స్థావరాలు, చమురు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్‌ను.. ఇజ్రాయెల్ తాజాగా …
Read More »స్కూల్ బస్సు దగ్ధం.. చిన్నారులు సహా 25మంది సజీవ దహనం, మొత్తం 44 మంది విద్యార్థులు
Bus Fire: ఎప్పుడూ స్కూల్, ఇల్లు ప్రపంచంగా ఉండే విద్యార్థులకు ఉల్లాసం కోసం, కొత్త విషయాలు, ప్రాంతాలు తెలియడం కోసం యాజమాన్యాలు అప్పుడప్పుడూ విహారయాత్రలకు తీసుకెళ్తూ ఉంటాయి. అయితే ఆ విహారయాత్ర కాస్తా విషాదంగా మారిన ఘటన ప్రస్తుతం ప్రతీ ఒక్కర్నీ కంటతడి పెట్టిస్తోంది. ట్రిప్‌కు వెళ్లిన స్కూలు విద్యార్థులు బాగా ఎంజాయ్ చేసి.. తిరిగి ఇంటికి వెళ్తున్నారు. అయితే వారు ప్రయాణించిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఆ బస్సు మొత్తం అగ్నికీలల్లో చిక్కుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ బస్సులో …
Read More »వామ్మో, ఈ కండోమ్ ధర రూ.44 వేలు.. ప్రపంచంలో ఖరీదైందిగా రికార్డ్
సాధారణంగా రూ.10 కో, రూ.20కో దొరికే కండోమ్ మనం చాలానే చూసి ఉంటాం. ఇక మార్కెట్లో రకరకాల కంపెనీలకు సంబంధించిన కండోమ్‌లు విక్రయిస్తూ ఉన్నారు. సురక్షిత శృంగారానికి, అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు ఉపయోగించే కండోమ్‌కు సంబంధించి తాజాగా ఓ కీలక విషయం వెల్లడైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కండోమ్ ధర ఏకంగా అక్షరాలా 44 వేల రూపాయలు. ఇప్పుడు ఇదే తీవ్ర చర్చకు దారి తీస్తోంది. కండోమ్ ధర రూ.44 వేలు ఏంటి అని అది విన్న వారంతా ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. 200 ఏళ్ల …
Read More »ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ఎలాన్ మస్క్ డేటింగ్.. వైరల్ ఫోటోపై ట్విటర్ అధినేత క్లారిటీ
Elon Musk: ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విటర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వారిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుండటంతో మస్క్, మెలోనీ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు బయటికి వచ్చాయి. ఇక ఇదే సమయంలో తాజాగా జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఎలాన్ మస్క్.. జార్జియా మెలోనీపై ప్రశంసల వర్షం కురిపించడంతో వీరిద్దరూ …
Read More »గుజరాత్ యువతిని వరించిన.. మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం
మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని రియా సింఘా దక్కించుకుంది. ఆదివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలో రియా విజేతగా నిలిచి ప్రతిష్టాత్మక టైటిల్‌ను కైవలం చేసుకుంది. దీంతో రియా ఇప్పుడు ప్రపంచ మిస్ యూనివర్స్ 2024 పోటీలో భారత్ తరఫున బరిలో నిలచే అవకాశాన్ని దక్కించుకుంది… ఈ విజయాన్ని అందుకున్న తర్వాత రియా ఆనందానికి హద్దులు లేకుపోయాయి. ఈ కిరీటాన్ని అందుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె తన సంతోషాన్ని పంచుకుంది. మిస్ యూనివర్సట్ ఇండియా …
Read More »వాటే సీన్.. దేవీ.. హర్ ఘర్ తిరంగా సాంగ్ పాడుతుండగా.. ప్రధాని ఎంట్రీ..
నమో అమెరికా. అగ్రరాజ్యంలో భారతీయం ప్రతిధ్వనించింది. ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు ఎన్నారైలు. మోదీ మోదీ అనే నినాదాలతో న్యూయార్క్ మార్మోగింది. భిన్నత్వంలో ఏకత్వం. భాష ఏదైనా మనందరి మనసు భారతీయం…అన్న మోదీ ప్రసంగానికి ముగ్దులయ్యారు ఎన్నారైలు. A ఫర్ అమెరికన్స్..I ఫర్ ఇండియన్స్ అంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సరికొత్త అర్ధం చెప్పారు మోదీ. భారత్-అమెరికా జోడి ప్రజాస్వామిక ప్రపంచానికి సరికొత్త దిశ-దశను చూపిస్తుందన్నారు. సప్తసముద్రాల అవతల భారతీయం పరిమళించింది. అగ్రరాజ్యంలో దేశభక్తి ఉప్పొంగింది. తెలుగు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, …
Read More »రేపే శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు.. బరిలో 38మంది, కానీ ఆ ముగ్గురి మధ్యే పోరు
Sri Lanka: 2022లో తీవ్ర ఆర్థిక, ఆహార, రాజకీయ సంక్షోభంతో పతనావస్థకు చేరుకున్న ద్వీపదేశం శ్రీలంకలో పరిస్థితులు క్రమంగా మెరుగవుతున్నాయి. విదేశీ మారక నిల్వలు అయిపోయి.. నిత్యావసరాల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్నంటడంతో కొన్ని నెలల పాటు శ్రీలంకలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. రాజపక్స కుటుంబాన్ని దేశం నుంచి తరిమేలా చేసిన శ్రీలంకవాసులు.. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. రణిల్ విక్రమసింఘే నేతృత్వంలోని శ్రీలంక నెమ్మదిగా ఆ సంక్షోభం నుంచి బయటపడుతోంది. ఇలాంటి సమయంలో ఆ దేశంలో అధ్యక్ష ఎన్నికలు …
Read More »బాల్టిమోర్ బ్రిడ్జ్ విధ్వంసం.. నౌక యజమాన్యంపై రూ.837 కోట్ల దావా
‘బాల్టిమోర్‌లో వంతెనకు వాటిల్లిన నష్టం, నౌకాశ్రయంలో సేవల పునరుద్ధరణ కోసం వెచ్చించిన మొత్తాన్ని ఈ ఘటనకు కారణమైన సంస్థల నుంచి పొందేలా అమెరికా న్యాయశాఖ పని చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ దావా వేశాం.. ఈ ఘటనకు కారకుల్ని బాధ్యుల్ని చేసేందుకు కట్టుబడి ఉన్నాం. సదరు సంస్థల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణం’ అని అమెరికా అటార్నీ జనరల్ మెర్రిక్ గార్లాండ్ ఓ ప్రకటనలో తెలిపారు. వంతెనను ఢీకొట్టిన నౌకలోని విద్యుత్, మెకానికల్ వ్యవస్థ నిర్వహణ సక్రమంగా లేవని దావాలో పేర్కొన్నారు. ఫ్రాన్సిస్ స్కాట్ …
Read More »అమెరికా కోర్టు సంచలన నిర్ణయం.. భారత్‌కు సమన్లు జారీ!
ఖలీస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ తన హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ అమెరికా కోర్టులో సివిల్ దావా వేశారు. ఈ దావాను విచారణకు చేపట్టిన అమెరికా కోర్టు.. భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది. సదరన్ న్యూయార్క్ డిస్ట్రిక్ట్ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు.. భారత ప్రభుత్వం, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రిసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా) మాజీ చీఫ్ సమత్ గోయల్, రా ఏజెంట్ విక్రమ్ యాదవ్, భారతీయ వ్యాపారవేత్త నిఖిల్ గుప్తాలకు సమన్లు జారీ అయినట్టు అంతర్జాతీయ …
Read More »