విజయవాడలో ఉన్న శ్రీ శృంగేరి శారదా పీఠాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందర్శించారు. ఈ మేరకు పీఠంలోని శ్రీ విధుశేఖర భారతీ స్వామీజీని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.. అక్కడ జగన్ దాదాపు గంటసేపు గడిపారు. స్వామిజీతో చర్చించిన అంశాలను వెల్లడించలేదు. ఈ సమావేశం ముగిసిన వెంటనే నేరుగా తాడేపల్లిలోని నివాసానికి జగన్ వెళ్లిపోయారు. జగన్‌తో వెంట వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ భరత్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా …
Read More »విజయవాడకు చెందిన బ్యాంకు లైసెన్స్ రద్దు.. RBI షాకింగ్ ప్రకటన.. ఖాతాదార్ల పరిస్థితి ఏమిటి?
RBI: నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో దివాలా అంచుకు చేరుకుని ఆదాయ మార్గాలు లేని వాటి లైసెన్సులనూ రద్దు చేస్తోంది. తాజాగా మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసినట్లు మంగళవారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ప్రముఖ కో ఆపరేటివ్ బ్యాంక్ అయిన దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లైసెన్సును ఆర్‌బీఐ రద్దు చేసింది. ఈ బ్యాంకు తగిన మూలధనాన్ని నిర్వహించడం లేదని, ఆదాయ మార్గాలు లేకపోవడం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్ట 1949 నిబంధనలు …
Read More »కేంద్రం నిర్ణయంతో విజయవాడకు మహర్దశ.. అక్కడే ఫిక్స్, త్వరలోనే!
కేంద్రం విజయవాడకు సంబంధించిన పలు రైలు, హైవే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విజయవాడకు తూర్పు బైపాస్ కూడా వచ్చింది. అయితే కేంద్రం ఓ షరతు విధించింది. లాజిస్టిక్ హబ్ కోసం తమకు 100 ఎకరాలు భూసేకరణ చేసి కేటాయించాలని కోరింది. ఈ క్రమంలో కొండపల్లిలో హబ్ ఏర్పాటుకు అడుగులుపడుతున్నాయి. ఈ విషయాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి.. భూసేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రాథమికంగా అందుతున్న సమాచారం మేరకు.. …
Read More »నేటి నుంచే విశాఖ-విజయవాడ మధ్య నూతన విమాన సర్వీసులు
సాగరనగరం విశాఖపట్నం- విజయవాడ మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసులు ఆదివారం నుంచి ప్రారంభకానున్నాయి. ఈ మేరకు విశాఖ విమానాశ్రయం డైరెక్టర్ రాజారెడ్డి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానయ సంస్థల సర్వీసులను ఆదివారం ఉదయం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఉదయం 9.35 గంటలకు విశాఖలో బయలుదేరి 10.35 గంటలకు విజయవాడ (గన్నవరం విమానాశ్రయం) చేరుకుటుంది. తిరిగి రాత్రి 7. 55 గంటలకు …
Read More »విజయవాడ, విశాఖవాసులకు అదిరిపోయే న్యూస్.. గంట జర్నీ మాత్రమే, కొత్త విమాన సర్వీసులు
విజయవడ నుంచి ఇండిగో విమానం సాయంత్రం 7.15 గంటలకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటుంది. అక్కడ నుంచి తిరుగ ప్రయాణంలో విమానం రాత్రి 8.45 గంటలకు బయలుదేరి రాత్రి 9.50 గంటలకు విజయవాడ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీస్ విషయానికి వస్తే.. ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి.. 10.35 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి రాత్రి 7.55 గంటలకు బయలుదేరి 9 గంటలకు విశాఖపట్నం వెళ్తుంది. ఈ సర్వీస్‌ల …
Read More »ఏపీలో యువతకు బంపరాఫర్.. టెన్త్ పాసైనా, ఫెయిలైనా ఫుడ్ పెట్టి ఉచితంగా.. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు బంపరాఫర్ ప్రకటించింది. ఏపీ స్కిల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్, శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో.. బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ బైర్డ్ సహకారంతో సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. యువకుల కోసం ఎయిర్ కండిషనర్, కూలర్, రిఫ్రిజిరేటర్ మెకానిజమ్‌పై ఉచిత వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఈ మేరకు విజయవాడలోని రాజీవ్‌నగర్‌లోని భారత వికాస్ పరిషత్ భవనంలో అతి త్వరలో ఈ ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తెలిపారు. పదో …
Read More »విజయవాడ దుర్గమ్మకు భారీగా ఆదాయం.. ఒక్కరోజులోనే కళ్లు చెదిరే ఆదాయం, రికార్డ్ బ్రేక్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగిశాయి. అయితే శుక్రవారం కనకదుర్గమ్మ దేవస్థానానికి భారీగా ఆదాయం వచ్చింది.. ఏకంగా రూ.84,02,775 ఆదాయం సమకూరింది. ఆ రోజు 4,149 మంది భక్తులు రూ.500 టికెట్లు కొనుగోలు చేయగా రూ.20,74,500 ఆదాయం వచ్చింది. అలాగే 1,847 మంది రూ.300 టికెట్లు కొనుగోలు చేయగా రూ.5,54, 100.. రూ.100 టికెట్‌తో 4,686 మంది దర్శించుకోగా రూ.46, 86,000 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. అలాగే 26,584 లడ్డూలను విక్రయించగా.. రూ.3,98,760, రూ.100 చొప్పున ఆరు లడ్డూలున్న ప్యాకింగ్ లను విక్రయించగా రూ.44,06,600 …
Read More »విజయవాడ లోకో పైలెట్‌ను ఆ ఒక్క కారణంగానే చంపేశా.. షాకింగ్ విషయాలు చెప్పిన బీహార్ నిందితుడు
విజయవాడ రైల్వే స్టేషన్లో లోకోల పైలెట్ హత్య మిస్టరీ వీడింది.. ఎబినేజర్‌ను హత్య చేసిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడ్ని బీహార్‌కు చెందిన దేవ్ కుమార్‌గా గుర్తించారు. విజయవాడలో లోకో పైలట్ ఎబినేజర్‌ను విధుల్లో ఉండగా.. దేవ్‌కుమార్ ఇనుప రాడ్డుతో ఆయన తలపై బలంగా కొట్టారు. ఆయన తలకు తీవ్ర గాయం కావడంతో విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఎబినేజర్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. ఐదు టీమ్‌లుగా ఏర్పడి సీసీ ఫుటేజ్ ఆధారంగా …
Read More »విజయవాడ దుర్గ గుడిలో భక్తుడి చేతికి పెద్ద గోల్డ్ బ్రాస్లెట్.. అందరి కళ్లు అటువైపే, విలువ ఎంతో తెలుసా!
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజూ అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ భక్తుడి చేతికి ఉన్న బ్రాస్లెట్ అందరినీ ఆకట్టుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన రవి విజయవాడలోని ఇంద్రకీలాద్రికి అమ్మవారి దర్శనం కోసం వచ్చారు. ఆయన చేతికి పెద్ద బ్రాస్లెట్ ఉంది.. దీని బరువు ఏకంగా 1.300 కిలోలు.. విలువ సుమారు రూ.కోటి పైమాటేనని ఆయన చెబుతున్నారు. ఇంద్రకీలాద్రిపై రవి చేతికి ఉన్న ఈ బ్రాస్లెట్ను భక్తులు ఆసక్తిగా తిలకించారు. మరోవైపు ఇవాళ …
Read More »తిరుమలలో హోటల్స్ సీజ్, లైసెన్స్‌లు రద్దు.. టీటీడీ సంచలన నిర్ణయం
తిరుమలలో నిబంధనలు పాటించని హోటల్స్, వాహనాలపై టీటీడీ ఎస్టేట్, రవాణా విభాగాలు చర్యలు తీసుకున్నాయి. తిరుమలలో టీటీడీ ఎస్టేట్ అధికారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా భక్తులకు అధిక ధరలకు తినుబండాలు విక్రయిస్తూ, పరిశుభ్రత లేని పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, షాపుల్ని అధికారులు సీజ్ చేశారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుండటంతో తనిఖీలు నిర్వహించారు. ముందుగా పీఏసీ- 2 (మాధవ నిలయం) వద్ద అధిక ధరలకు విక్రయిస్తున్న ఒక టీ దుకాణం, రెండు ఫ్యాన్సీ షాపులను సీజ్ …
Read More »