విజయవాడలో ఓ దొంగ ఆట కట్టించారు పోలీసులు. కొద్దిరోజులుగా నగరంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో చోరీలు చేస్తున్నట్లు గుర్తించారు. మనోడి గురించి ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. మనోడు రాత్రిళ్లు చోరీలు చేయడం.. దానికి కూడా టైమింగ్స్ ఉంటాయి.. మనోడి ట్రాక్ రికార్డ్ చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. మహంతిపురంకు చెందిన షేక్ షబ్బీర్‌బాబు చెడు వ్యసనాలకు బానిసగా మారాడు.. జల్సాల కోసం డబ్బులు కావాలి.. అందుకే విజయవాడలో దొంగతనాలు మొదలుపెట్టాడు. దీని కోసం ముందుగానే ఓ ప్లాన్ వేసుకుంటాడు. విజయవాడలో పగటి …
Read More »మచిలీపట్నంలో ఒక్కడి కోసం ఇద్దరమ్మాయిలు.. సినిమా రేంజ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఒక్కడి కోసం ఇద్దరు ప్రియురాళ్ల కొట్లాట చర్చనీయాంశమైంది. మచిలీపట్నానికి చెందిన విజయ్ అనే బిల్డర్‌పై అనూష అనే మహిళ సంచలన ఆరోపణలు చేశారు. మచిలీపట్నంలో విజయ్ అనే బిల్డర్ ముందు అనూష అనే మహిళను ప్రేమిస్తున్నానని చెప్పాడని.. అయితే ఆరు నెలలుగా తనతో ఉండం లేదని ఆమె చెప్పుకొచ్చారు. తన డబ్బులు, బంగారం తీసుకున్నాడని.. అడిగితే తననే బెదిరిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. విజయ్ అనిత అనే మరో మహిళత కలిసి ఉంటున్నాడని.. తనకు జరిగిన అన్యాయాన్ని భరించలేక.. తాను అక్కడికి వెళ్లి …
Read More »యువతకు మంచి అవకాశం.. నెలకు రూ.22 వేల వరకు జీతంతో ఉద్యోగాలు
ఏపీలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, కృష్ణా జిల్లా ఉపాధి కల్పనా శాఖ, డీఆర్‌డీఏ, ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. గుడివాడలో ఎమ్మెల్యే రాము తన నివాసంలో ఉద్యోగ మేళా పోస్టర్‌ను విడుదల చేశారు.. జిల్లా ఉపాధి కల్పనాధికారి దేవరపల్లి విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ నెల 20న గుడివాడలోని కేబీఆర్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. …
Read More »ఏపీలో వారందరికి రూ.25వేలు, రూ.10వేలు.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!
ఏపీని వర్షాలు, వరదలు వణికించాయి.. విజయవాడతో పాటూ మరికొన్ని జిల్లాలపై ప్రభావం కనిపించింది. ప్రధానంగా విజయవాడను వరదలు ముంచెత్తాయి.. ఇళ్లన్నీ నీటమునిగాయి. ఇలా వర్షాలు, వరదలతో నష్టపోయిన విజయవాడ ప్రజలకు ఊరటనిచ్చే దిశగా ఏపీప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ మేరకు నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేకంగా ప్యాకేజీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఈ ప్యాకేజీని అందజేసే దిశగా అడుగులు వేస్తోంది. విజయవాడలో బాగా నీట మునిగిన ఇళ్లకు రూ. 25 వేలు.. అలాగే …
Read More »ఏపీలో వరద బాధితులకు స్పెషల్ కిట్లు పంపిణీ.. ఏమేమీ ఉంటాయంటే
ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులకు ప్రభుత్వం నేటి నుంచి ప్రత్యేకంగా కిట్లు పంపిణీ చేస్తోంది. వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాల కిట్‌తో పాటు రాయితీపై కూరగాయలు అందిస్తున్నారు. ప్రతి కుటుంబానికీ పాలు, మంచినీరు, బిస్కట్లు అందిస్తున్నారు. ఈ కిట్‌లలో 25 కిలోల బియ్యం, లీటరు పామోలిన్, 2 కిలోల బంగాళదుంప, 2 కిలోల ఉల్లిగడ్డలు, కిలో కందిపప్పు, కిలో చక్కెర ఉంటుంది. మొబైల్ మార్కెట్ల ద్వారా కూరగాయలను వరద బాధితులకు అందిస్తారు. రూ.2, రూ.5, రూ.10 చొప్పున మూడు స్థాయుల్లో ధరల్ని నిర్ణయించారు. అంతేకాదు అన్ని …
Read More »ఏపీలో వరద బాధితులకు భారీ విరాళం.. ఏకంగా రూ.120 కోట్లు
ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. రంగాలకు అతీతంగా వీఐపీలు, వీవీఐపీలు తమకు తోచిన రీతిలో బాధితుల కోసం విరాళాలు ప్రకటిస్తున్నారు. సినీ రంగానికి చెందిన చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, విశ్వక్ సేన్ వంటి హీరోలతో పాటుగా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా రెండు రాష్ట్రాలకు విరాళాలు ప్రకటించారు. అశ్వనీదత్ వంటి నిర్మాతలు సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి విరాళాలు కూడా అందించారు. అయితే తాజాగా …
Read More »ఏపీ వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సాయం.. చంద్రబాబు కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితులకు సాయంపై కీలక ప్రకటన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తున్నామని.. ప్రతి ఇంటికి సహాయం అందించాలని సూచించారు. రాష్ట్రంలో వరద వల్ల నష్టాన్ని వివరించి కేంద్ర సాయం కోరతామని చెప్పారు. ఈ వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి మృతదేహాలను వారి కుటుంబాల వారికి అప్పగించాలని.. ఒకవేళ ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే …
Read More »విజయవాడ కోసం మేమున్నామని.. విశాఖ జీవీఎంసీకి సెల్యూట్
విజయవాడకు వచ్చిన కష్టాన్ని చూసి యావత్ రాష్ట్రం చలించిపోయింది. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా తోడ్పాటును అందిస్తున్నారు.. బెజవాడకు అండగా ఉంటామని భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడకు సాయాన్ని అందిస్తున్నారు. రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, చిరు వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు వదర బాధితులకు అవసరమైన ఆహారం, కూరగాయలు, మంచినీళ్లు, పండ్లు, మందులు అందిస్తున్నారు. అయితే విజయవాడలో వరద ప్రభావం మెల్లిగా తగ్గిపోతోంది.. కొన్ని ప్రాంతాల్లో వరద పోయి బురద మిగిలింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక …
Read More »విజయవాడ వరదల్లోనే ప్రసవించిన మహిళ.. స్వయంగా రంగంలోకి దిగిన సీపీ
ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ వరదల ధాటికి విజయవాడ నగరం గజగజా వణికిపోతోంది. లోతట్టు ప్రాంతాలు మొత్తం వర్షం నీటితో నిండిపోవడంతో అక్కడికి పడవల్లోనే అధికారులు వెళ్లి.. బాధితులకు భోజనం, తాగునీరు అందిస్తున్నారు. మరీ వరదలో చిక్కుకున్న వారిని పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు ఉన్న వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వారు ఇళ్లల్లో ఉండలేక.. బయటికి వెళ్లలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వరద నీటిలోనే …
Read More »రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ కోటి.. ఏపీకి అశ్వనీదత్, ఆయ్ టీం విరాళం
రెండు తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం వరుణుడి దెబ్బకు అతలాకుతలం అవుతోన్నాయి. వరదల ధాటికి ఊర్లన్నీ నీటమునిగాయి. ఇంట్లోకి నీరు వచ్చి చేరింది. వాహనాలు కొట్టుకుపోయాయి. ఎంతో మందికి నిద్ర, ఆహారం కరవయ్యాయి. ప్రభుత్వం నిరవధికంగా సహాయక చర్యలు అందిస్తూనే ఉంది. ఈ వరదల వల్ల ఏపీలోని విజయవాడ, గుంటూరు ప్రాంతాలు ఎక్కువగా నష్టపోయాయి. ఇక ఈ వరదల ప్రభావం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా ఎంతో నష్టం వాటిల్లుతుంది. అందుకోసం టాలీవుడ్ నుంచి సెలెబ్రిటీలు ముందుకు వచ్చి ప్రభుత్వాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. రెండు తెలుగు …
Read More »