దొంగతనం ఎప్పుడైనా జరగొచ్చు.. ఎవరైనా చేసేయొచ్చు. జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత.. ఏమాత్రం ఏమారుపాటుగా ఉన్నా.. ఇదిగో ఇలా దోచేస్తారు దొంగలు.. తాజాగా.. ఆదిలాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు.. బేల మండల కేంద్రంలో ఉన్న శ్రీకర్ మార్ట్‌లో పట్టపగలే భారీగా చోరీ చేశారు.. రూ.5.87లక్షలు నగదు ఉన్న సంచిని అందరి ముందే.. గుట్టుగా చోరీ చేసి పరారయ్యారు.. అయితే, చోరీ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.. డబ్బు ఉన్న సంచిని చోరీ చేసిన ఇద్దరు యువకులు.. ఎవరూ చూడని సమయంలో …
Read More »తీరనున్న సాధారణ ప్రయాణీకుల ఇక్కట్లు.. జనరల్ బోగీలను పెంచనున్న సౌత్ సెంట్రల్ రైల్వే
రైలు లో జనరల్ బోగీలో ప్రయాణం చేయాలంటే నరకం చూడాల్సిందే.. ఇంకా చెప్పాలంటే అసలు జనరల్ బోగీలోకి ఎక్కాలన్న యుద్ధం చేయాల్సిందే.. అయితే ఇక నుంచి జనరల్ బోగీలో ప్రయాణించే ప్రయాణీకుల ఇబ్బందులకు చెక్ పెట్టనున్నారు. అవును ఇప్పుడు ఆ ఇబ్బంది ఉండదు అంటోంది సౌత్ సెంట్రల్ రైల్వే..ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను దశలవారీగా పెంచుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రెండే జనరల్ కోచ్ లు ఉన్న రైళ్లలో ఆ సంఖ్యను నాలుగుకు చేరుస్తున్నట్లు పేర్కొన్నారు. …
Read More »గోర్లు, చర్మంలో ఈ 5 మార్పులు గుండె జబ్బులకు సంకేతాలు.. నిర్లక్ష్యం చేస్తే మీ ప్రాణాలకే ప్రమాదం..
ప్రస్తుత కాలంలో గుండె జబ్బుల కేసులు వేగంగా పెరగుతున్నాయి.. చిన్నా , పెద్దా అనే తేడా లేకుండా చాలామంది గుండెపోటుతో మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.. రాబోయే సంవత్సరాల్లో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అటువంటి పరిస్థితిలో గుండెపోటు ను నివారించడానికి, గుండె జబ్బుల దుష్ప్రభావాలను నివారించడానికి ముందుగా వాటి సంకేతాలను గుర్తించడం చాలా ముఖ్యం.. దీని ద్వారా సకాలంలో చికిత్సను పొందడంతోపాటు ప్రాణాలను కాపాడుకోవచ్చు.. అయితే, గుండెలో అవాంతరాలను గుర్తించడానికి మేము మీకు కొన్ని సంకేతాలను చెప్పబోతున్నాం.. వీటిని …
Read More »ఒరేయ్ మీరు విద్యార్థులా.. ఉన్మాదులా..? టీచర్‌ను క్లాస్ రూమ్‌లోనే..
.జీవితంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా.. వారి ఎదుగుదలలో గురువుల పాత్ర ఎనలేనిది.. విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో గురువులు విద్యార్థులను జ్ఞాన మార్గం వైపు నడిపిస్తారు. శిక్షణతో మెరుగులద్ది ఉన్నత స్థాయికి చేర్చిన మహోన్నతమైన వ్యక్తులుగా ఉపాధ్యాయులు చిరస్థాయిగా నిలుస్తారు.. అందుకే.. గురువులు, శిష్యుల మధ్య బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు.. అయితే.. ఒకప్పుడు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడానికి వస్తున్నారంటే అంటే పిల్లలు మౌనంగా కూర్చొని ఉండిపోయేవారు.. పిన్ డ్రాప్ సైలెన్స్‌గా ఉండేవారు.. చీమ చిటుక్కుమన్న …
Read More »వార్నీ ఎంతకు తెగించార్రా సామీ..! దాని కోసం ఏకంగా పిల్లాడినే ఎత్తుకెళ్లారు..!
గంజాయి కోసం ఏకంగా ఓ బాలుడిని కిడ్నాప్ చేశారు నిందితులు. కానీ పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్ అయింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ కేసు.అది సుందర అరకులోనే ప్రాంతం.. అక్కడకు పలనాడు నుంచి ఓ వ్యక్తి వచ్చాడు.. వస్తు పోతూ ఉన్న సమయంలో స్థానిక యువకులతో పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత అతని స్నేహితులను తీసుకొచ్చి వారిని పరిచయం చేయించాడు. ఇక గంజాయి కోసం బేరసారాలు జరిగాయి. కొంత నగదు కూడా చేతులు మారింది. కట్ చేస్తే ఓ బాలుడిని కిడ్నాప్ చేసి.. …
Read More »ఆ విద్యార్ధులకు సంక్రాంతి సెలవులు 3 రోజులే.. విద్యాశాఖ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. టెన్త్ పరీక్షలు మార్చి 15 నుంచి ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో పదో తరగతి విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు 100 రోజుల ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) సిలబస్ అమల్లోకి వచ్చాక తొలిసారి పదో తరగతి పరీక్షలు విద్యార్ధులు రాయనున్నారు. విద్యార్ధులను సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను …
Read More »ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు.. ఏడాది ఏడాదికి పెరిగే నంది.. కలియుగాంతానికి చిహ్నం..
భారతదేశంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలలో కొన్ని సంఘటనలు నమ్మలేని నిజాలుగా సైన్ కు సవాల్ గా మిగిలిపోతున్నాయి. అనేక ఆలయాలు వాటి రహస్యాలు, అద్భుత మైన శిల్పకళా సంపదతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అలా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మిస్టరీ శివాలయం ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ ఆలయంలోని నందీశ్వరుడు విగ్రహం నిరంతరం పెరుగుతూనే ఉంటుదని. ఈ విగ్రహం పరిమాణం పెరగడంలోని రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేకపోయారు. అంతే కాదు ఈ విగ్రహం పరిమాణం పెరగడంపై …
Read More »భూకంపాల విషయంలో తెలుగురాష్ట్రాలు సేఫేనా..? మరింత పెరిగిన భయాలు
తెలంగాణకు భూకంపాల భయాలేం లేవు.. మనది దక్కన్ పీఠభూమి.. సముద్రానికి ఎత్తులో ఉంటుంది.. నిర్భయంగా ఉండొచ్చని చెబుతుంటారు కొందరు. ఎవరు చెప్పారసలు తెలంగాణ భూకంపాల జోన్‌లో లేదని? దేశవ్యాప్తంగా భూకంపాలు వచ్చే ఛాన్స్ ఉందంటూ వాటిని నాలుగు జోన్లుగా విభజించారు. కావాలంటే ఆ లిస్ట్ ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు. అందులో తెలంగాణలోని ఏరియాలు కూడా ఉంటాయి. మెయిన్‌గా హైదరాబాద్ ఉంటుంది. సో, హైదరాబాద్‌కు కూడా భూకంపం ముప్పు ఉంది. ఒక్క తెలంగాణ గురించే ఎందుకు చెప్పుకోవాలి? విజయవాడ, మచిలీపట్నం, నెల్లూరు, కర్నూలు.. ఇవన్నీ భూకంపాల …
Read More »నిరుద్యోగులకు అలర్ట్.. సీఏపీఎఫ్ బలగాల్లో లక్షకుపైగా ఉద్యోగాలు: కేంద్రం వెల్లడి
కేంద్ర సాయుధ బలగాలు (CAPF), అస్సాం రైఫిల్స్ (AR)లో లక్షకు పైనే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. గత ఐదేళ్లలో దాదాపు 71,231 పోస్టులు భర్తీ చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో బుధవారం వెల్లడించారు. ఖాళీగా ఉన్న సీఏపీఎఫ్, ఏఆర్ ఉద్యోగాల్లో చాలా వరకు పదవీ విరమణ, రాజీనామాలు, పదోన్నతులు, మరణాలు, కొత్త బెటాలియన్ ఏర్పాటు, కొత్త పోస్టులను సృష్టించడం వంటి వాటివల్ల ఏర్పడినట్లు తెలిపారు. విభాగాల వారీగా ఖాళీలు పరిశీలిస్తే.. అక్టోబర్ 30 నాటికి …
Read More »సోషల్ మీడియాలో అలా పోస్ట్ చేస్తే ఇక ఉక్కుపాదమే.. 28,000 URLలను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం
భారత ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో 28000 పైగా URLలను రికార్డు స్థాయిలో బ్లాక్ చేసింది. 2024లో జాతీయ భద్రతకు విఘాతం కలిగించే విధంగా ఉన్న సోషల్ మీడియా పోస్టులన్నింటిని కేంద్రం బ్లాక్ చేసింది. ఈ URLలలో ఖలిస్తాన్ అనుకూల వేర్పాటువాద ఉద్యమాలకు సంబంధించిన కంటెంట్, ద్వేషపూరిత ప్రసంగాలు, మోసం, జాతీయ భద్రత, ప్రజా శాంతిభద్రతలకు ముప్పుగా భావించే అంశాలు ఉన్నాయని పేర్కొంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69A ప్రకారం ఈ యూఆర్ఎల్ లను బ్లాక్ చేయడం జరిగింది.. ఇది దేశానికి హానికరంగా …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal