ఆంధ్రప్రదేశ్

దేవుడా నువ్వే దిక్కు.. సిద్ధివినాయక ప్రసాదంలో ఎలుకల సంసారం..! ఆలయ ట్రస్ట్‌ వివరణ..

ప్రసాదం బుట్టలో ఎలుకల వీడియోపై పూర్తి విచారణ జరుపుతామని సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఆలయ నిర్వాహకులు విచారణ జరిపి సరైన వివరణ ఇస్తారని ముంగంటివార్ పేర్కొన్నారు. ఈ వైరల్ ఫోటో, వీడియోపై కూడా దర్యాప్తు చేయనున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి వారు భక్తుల కొంగుబంగారం. శ్రీవారి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో వాడే నెయ్యి వివాదం ప్రపంచ వ్యాప్తంగా వెంకన్న భక్తుల్లో ఆగ్రహ జ్వాలలు రగిల్చింది. ఓ వైపు ప్రసాదం తయారీలో …

Read More »

అనంతపురం: రాముడి రథానికి నిప్పు.. చంద్రబాబు సీరియస్, రంగంలోకి స్పెషల్ టీమ్స్

అనంతపురం జిల్లాలో రామాలయంలో రథానికి నిప్పు పెట్టిన ఘటన కలకలంరేపింది. కనేకల్ మండలం హనకనహాల్‌లో రామాలయం ఉంది.. అక్కడ మంగళవారం అర్ధరాత్రి రాముడి రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా.. స్థానికులు గమనించి మంటల్ని ఆర్పేశారు. కానీ అప్పటికే రథం సగానికి పైగా కాలిపోయింది. పుణ్యతిథులు, ఉత్సవాల సమయంలో రాములవారిని రథంపై ఊరేగిస్తుంటారు. మిగతా సమయంలో ఓ షెడ్డులో రథాన్ని భద్రపరుస్తారు. రథానికి నిప్పు పెట్టారనే సమాచారం అందుకున్న కళ్యాణదుర్గ డీఎస్పీ రవిబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్రిమినల్ …

Read More »

20 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ.. మాజీ ఎంపీకి బంపరాఫర్, కీలక పదవి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్‌ పదవులను భర్తీ చేసింది.. మొత్తం 20 కార్పొరేషన్లకు ఛైర్మన్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ 20 పదవుల్లో.. టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి ఒక కార్పొరేషన్ ఛైర్మన్ పదవి అప్పగించారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు ఈ జాబితాలో ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో యువతకు పెద్ద పీట వేశారు.. 11 మంది కస్టర్‌ ఇన్‌ఛార్జ్‌లు, ఆరుగురు యూనిట్‌ ఇన్‌చార్జ్‌లకు పదవులు దక్కాయి. ఓ క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌కు ఛైర్మన్‌ పదవి ఇచ్చారు. …

Read More »

కేతిరెడ్డీ.. నీ కోరిక తీరుస్తాం.. మంత్రి సత్యకుమార్ వార్నింగ్

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో సోమవారం ఉద్రిక్తత తలెత్తింది. ధర్మవరం సబ్ జైలు వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, బీజేపీ లీడర్ హరీష్ వర్గీయుల మధ్య వాగ్వాదం, ఘర్షణ తలెత్తింది. సబ్ జైలులో రిమాండ్‌‍లో ఉన్న కార్యకర్తలను పరామర్శించేందుకు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అక్కడకు చేరుకున్నారు.. అయితే ఇదే సమయంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు వైసీపీ శ్రేణులకు ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి ఈ వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది. ఈ …

Read More »

సుప్రీంకోర్టుకు చేరిన లడ్డూ లడాయి.. రెండు పిటిషన్లు దాఖలు.. ఏం జరగనుంది..

తిరుమల లడ్డూ వివాదం ప్రకంపనలు రేపుతోంది.. నెయ్యి కల్తీ, విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న అభియోగాలు ఇటు ఆంధ్రప్రదేశ్ తోపాటు అటు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ రాజకీయ నేతలు, ఆధ్యాత్మికవేత్తలు, పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు.తిరుమల లడ్డూ వివాదం ప్రకంపనలు రేపుతోంది.. నెయ్యి కల్తీ, విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న అభియోగాలు ఇటు ఆంధ్రప్రదేశ్ తోపాటు అటు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. అంగప్రదక్షిణ, ప్రత్యేక దర్శనం, గదుల టోకెన్లు విడుదల

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ వెల్లడించింది. తిరుమల, తిరుపతి దేవస్థానం డిసెంబర్‌ కోటాకు సంబంధించిన అంగప్రదక్షిణం , శ్రీవాణి టికెట్ల ను సోమవారం విడుదల చేసింది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా డిసెంబర్‌ 2024 నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను ఇవాళ మధ్యాహ్నం 3గంట‌ల‌కు విడుద‌ల చేస్తుంది. మధ్యాహ్నం 3గంటలకు ప్రత్యేక వసతి గదుల కోటా టికెట్లు విడుదల కానున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ నెల కోటాకు సంబంధించి అంగప్రదక్షిణం టోకెన్‌లను …

Read More »

రాగాల మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్‌ చేసింది. వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈ అల్పపీనడం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు… ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్‌ చేసింది. వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడం ఏర్పడే …

Read More »

తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన శాంతి హోమం.. అనంతరం పంచగ్రవ్య సంప్రోక్షణ

తిరుమల శ్రీవారి ఆలయంలో మహా శాంతి హోమం మొదలైంది. శ్రీవారి ప్రసాదం లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో ప్రాయశ్చిత్తం కోసం అర్చకులు, అధికారులు శాంతిహోమం సంకల్పించారు. ఈ మేరకు ఆలయంలోని యాగశాల వద్ద ఉదయం 6 గంటల నుంచి 10 గంటలకు ఈ హోమాన్ని అర్చకులు చేయనున్నారు. హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం..! అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు.. భక్తవత్సలుడు కొలువైన ప్రాంతం..! అలాంటి తిరుమల కొండపై.. ఆ దేవదేవుడి కైంకర్యాలకు, లడ్డూ ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి కల్తీ అయ్యిందనే వార్త పెను సంచలనమే …

Read More »

టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు బంపరాఫర్.. ఇలా చేస్తే ఒక్కొక్కరికి రూ.5లక్షలు, పదవులపై కీలక ప్రకటన!

తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తీపికబురు చెప్పారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేస్తామని ప్రకటించారు. పార్టీకి కార్యకర్తలే బలమని.. వారి త్యాగాలను మర్చిపోలేమన్నారు. ఆదివారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, గ్రామ పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు భావిస్తున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి …

Read More »

ఏపీలో వారందరి పింఛన్లు కట్.. కీలక ఆదేశాలు, ఆ ఛాన్స్ ఉంటుంది!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన కొత్తవారికి పింఛన్లు ఇస్తామని ప్రకటించగా.. ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియకు సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో అనర్హులపై వేటుకు సిద్ధమవుతున్నారు.. అర్హత లేకపోయినా సరే కొందరు పింఛన్లు తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. దీంతో అలాంటివారిపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. అనర్హుల ఏరివేతకు కసరత్తు మొదలుపెట్టింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేతలు.. ఇలా అన్ని విభాగాల్లో స్థానికంగా ఉండే నేతలు సిఫార్సు చేయడంతో చాలామంది అనర్హులకు పింఛన్లు ఇచ్చారనే …

Read More »