అధికారం కోల్పోయిన తర్వాత ఏపీలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. సీనియర్ నేతల దగ్గర నుంచి జూనియర్ల వరకు అంతా పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. కీలక నేతలు అంతా పార్టీకి, పదవులకు గుడ్ బై చెప్పి.. అధికార తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేసి త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో నాయకురాలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ పోతుల సునీత.. వైసీపీకి, తన ఎమ్మెల్సీ పదవికి …
Read More »తెలుగుదేశం పార్టీలో చేరే నేతలకు షాక్.. చంద్రబాబు సంచలన నిర్ణయం
TDP: తెలుగుదేశం పార్టీలో చేరేవారికి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చారు. ఏపీలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇతర పార్టీల నుంచి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా వైఎస్సార్సీపీ నుంచి భారీగా నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైకిల్ ఎక్కుతున్నారు. భవిష్యత్‌లో మరికొందరు నేతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలోకి వచ్చేవారు ఎవరైనా సరే.. తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే పసులు కండువా కప్పుకోవాలని …
Read More »ఏపీలో వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారికి అలర్ట్.. ఈ రూల్స్ తెలుసుకోండి
ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితికి సంబంధించి అధికారులు, పోలీసులు కీలక సూచనలు చేశారు. సింగిల్ విండో ద్వారా గణపతి నవరాత్రి ఉత్సవాలకు అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. వినాయక చవితి మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. విగ్రహం ఎత్తు 5 అడుగులకు మించి ఉండకూడదని.. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి కార్యక్రమాలకూ అనుమతి ఉండదన్నారు. హుండీలు, విలువైన వస్తువులు ఉన్న చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని.. బలవంతంగా చందాలు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అగ్ని …
Read More »వైసీపీకి బిగ్ షాక్, ఎంపీ రాజీనామా?.. టీడీపీలో చేరాలని నిర్ణయం!
వైఎస్సార్‌సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. మరో ముఖ్యమైన నేత ఆ పార్టీని వీడబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గురువారం ఆ పార్టీని వీడబోతున్నట్లు కొందరు ట్వీట్‌లు చేశారు. మోపిదేవి చూపు తెలుగు దేశం పార్టీ వైపు ఉందని.. త్వరలోనే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు మోదలయ్యాయి. మోపిదేవి వెంకటరమణకు ఎంపీ పదవితో పాటుగా బాపట్ల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్ష పదవి కూడా …
Read More »కొత్త రేషన్ షాపుల ఏర్పాటు.. రివర్స్ టెండరింగ్, ఎస్‌ఈబీ రద్దు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ప్రధానంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశారు.. మళ్లీ పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఆబ్కారీ శాఖ పునర్ వ్యవస్థీకరణకు ఓకే చెప్పగా.. ఎస్‌ఈబీ (స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో) రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇచ్చే పట్టాదారు …
Read More »శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు
శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు కలకలంరేపాయి. ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజాము 3.42 నిమిషాలకు భూమి స్వల్పంగా కంపించినట్లు కొందరు చెబుతున్నారు. ఒక్కసారిగా భూమి నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయని.. అత్యల్పంగా భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. కొందరు భయంతో బయటకు పరుగులు తీశారు. నమాజ్ చేసేందుకు ఆ సమయంలో తాను లేచానని.. శబ్దాలు విని భయపడి బయటకు వచ్చానని ప్రత్యక్ష సాక్షి జోహార్ ఖాన్ అన్నారు. రెండేళ్ల క్రితం అక్టోబర్‌లో పలుమార్లు స్వల్ప ప్రకంపనలు వచ్చాయని.. వాటితో పోల్చితే నేడు వచ్చినవి …
Read More »చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై నో సీక్రెట్, ఈ నెల 29 నుంచి ప్రజలకు అందుబాటులో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవోఐఆర్ పోర్టల్ మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయిచింది.. ఈ మేరకు ఈ నెల 29 నుంచి ప్రభుత్వం జారీచేసే ప్రతి జీవోనూ జీవోఐఆర్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. అంటే ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవో ప్రజలకు అందుబాటులో ఉంటుంది.. వారు స్వేచ్ఛగా జీవోలను చూడొచ్చు. జీవోఐఆర్ పోర్టల్‌కు సంబంధించి సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో సచివాలయంలోని ప్రతి సెక్షన్‌లోనూ జీవోలకు మాన్యువల్ రిజిస్టర్లు నిర్వహించేవారు. కచ్చితంగా వాటిలో నంబరు రాసి, జీవోలు విడుదల …
Read More »ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై అవి కూడా పంపిణీ, వచ్చే నెల పక్కా
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వచ్చే నెల (సెప్టెంబరు) నుంచి బియ్యంతో పాటు చక్కెర పంపిణీకి సిద్ధమవుతోంది.. ఈ మేరకు పంపిణీకి చర్యలు కూడా చేపట్టింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా కీలకమైన పౌరసరఫరాల శాఖ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది. రేషన్‌తో పాటుగా సరుకుల సరఫరాలో అనేక అవకతవకలు జరిగినట్లు గుర్తించింది.. రెండు నెలలుగా ఈ పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ పరిస్థితుల్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం చక్కెర పంపిణీ నిలిపివేసింది. ఏపీ ప్రభుత్వం …
Read More »ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. ప్రతి నెలా రూ.10వేల నుంచి రూ.15 వేలకు పెంపు
ఆంధ్రప్రదేశ్‌లో అర్చకులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో అర్చకుల వేతనాలను భారీగా పెంచాలని నిర్ణయించారు. రూ.50వేలకుపైన ఆదాయం ఉన్న ఆలయాల్లో ప్రతి నెలా రూ.10 వేలు వేతనం పొందే అర్చకులకు ఇకపై రూ.15 వేలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో 1,683 మంది లబ్ధిపొందనున్నారు. అమరావతి సచివాలయంలో దేవదాయ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు వేద విద్య చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలకు రూ.3 వేలు భృతి ఇవ్వాలని కూడా సూచించారు. …
Read More »ఏపీలో డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు బంపరాఫర్..
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు రాయితీపై విద్యుత్ సైకిళ్లను అందించే ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి సచివాలయంలో ఈఈఎస్ఎల్(ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్) సీఈఓ విశాల్ కపూర్, ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమై రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచడానికి చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు. రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పిస్తామని.. పీఎంఏవై (ప్రధాన మంత్రి ఆవాస్ యోజన)లో భాగంగా …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal