మన్యం ప్రాంతాలలో ఎక్కువగా ఇబ్బందులు పెట్టే సమస్యలు.. ఒకటి మావోయిస్టులు.. రెండు గంజాయి. ఇక విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా సహా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయిని అక్రమంగా సాగు చేస్తుంటారు. పోలీసులు దాడులు చేసి ధ్వంసం చేస్తున్నప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు, అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. అయితే ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం గంజాయి మహమ్మారిని అరికట్టడానికి కీలక చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే గంజాయి సాగు నుంచి మన్యం ప్రాంతాల వాసులను మళ్లించేందుకు …
Read More »శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే ఆర్జిత సేవా టికెట్లు విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్లైన్ ద్వారా విడుదల చేయనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు లక్కీ డిఫ్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేస్తామని టీటీడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 21వ తేదీ వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారణ సేవా టికెట్ల విడుదల చేస్తామని …
Read More »పవన్ చెప్పినా బేఫికర్!
కాలుష్య నియంత్రణ మండలిలో కొందరు అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలనే బేఖాతరు చేస్తున్నారు! వద్దన్న పని చేయడానికే సిద్ధమవుతున్నారు.. ప్రభుత్వం మారినా వారిలో వైసీపీ వాసన వీడడంలేదు! కాలుష్య నియంత్రణ మండలిని వీడని వైసీపీ వాసన బయో వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటులో సీపీసీబీ మార్గదర్శకాలకు తూట్లు విజయనగరంలో వైసీపీ నేత కంపెనీకి అనుమతివ్వాలని నిర్ణయం అడ్డగోలు అనుమతికి డిప్యూటీ సీఎం నో అయినా ఫైలు నడుపుతున్న అధికారులు భారీగా ముడుపులు తీసుకోవడమే కారణం అప్పిలేట్ అథారిటీ ఆదేశాలు బేఖాతర్ సీపీసీబీ వ …
Read More »సోదర బంధానికి రక్ష! రక్ష!
శ్రావణం ఐశ్వర్యప్రదమైన మాసం. దీని విశిష్టతను పరమశివుడు పార్వతికి వివరిస్తూ ‘‘అస్మిన్ మాసే కృతం యద్యత్తదనంతాయ కల్పతే… ఈ మాసంలో ఆచరించే క్రతువులు అనంతమైన ఫలాలను ఇస్తాయి’’ అని చెప్పాడు. నేడు రాఖీ పౌర్ణమి శ్రావణం ఐశ్వర్యప్రదమైన మాసం. దీని విశిష్టతను పరమశివుడు పార్వతికి వివరిస్తూ ‘‘అస్మిన్ మాసే కృతం యద్యత్తదనంతాయ కల్పతే… ఈ మాసంలో ఆచరించే క్రతువులు అనంతమైన ఫలాలను ఇస్తాయి’’ అని చెప్పాడు. ఎంతో మహిమాన్వితమైన ఈ నెలలో… పౌర్ణమి మరింత ప్రత్యేకమైనది. హయగ్రీవుడిగా శ్రీమహావిష్ణువు అవతరించినది శ్రావణ పౌర్ణమి నాడే. …
Read More »Donations: అన్న క్యాంటీన్లకు విరాళాలు వెల్లువ.. రూ.కోటి అందజేసిన మాజీ ఎంపీ
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో 2019కి ముందు అమలైన పథకాలను ప్రభుత్వం మళ్లీ ప్రారంభిస్తోంది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పేదలకు రూ.5లకే ఆహారం అందించే అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించారు. కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించగా.. మర్నాడు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, అన్న క్యాంటీన్ ట్రస్టుకు విరాళాలు అందజేయాలన్న చంద్రబాబు పిలుపునకు విశేష స్పందన వస్తోంది. పలువురు ముందుకొచ్చి పెద్ద మొత్తంలో విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా, అన్న క్యాంటీన్ల నిర్వహణకు …
Read More »Chandrababu Delhi Tour: ప్రధానమంత్రి మోదీతో చంద్రబాబు భేటీ.. చర్చించిన విషయాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలతోపాటుగా ప్రధాని మోదీని కలిశారు చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానమంత్రితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును భరిస్తామని కేంద్రం గతంలో హామీ ఇచ్చింది. అలాగే ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది. కేంద్రం హామీ ఇచ్చిన …
Read More »Employees transfers: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. గైడ్లైన్స్ విడుదల.. వారికి మాత్రం!
AP Govt Employees transfer Guidelines: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఎన్ని రోజులుగానో ఉద్యోగులు ఎదురుచూస్తున్న బదిలీలకు ఆమోదం తెలిపింది. ఈ నెలాఖరు లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై గైడ్లైన్స్ విడుదల అయ్యాయి. మొత్తం 12 శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బదిలీలకు వీలుగా ఆగస్టు 19 నుంచి ఆగస్ట్ 31వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేశారు. మరోవైపు అన్ని ప్రభుత్వ …
Read More »కర్నూలు వ్యక్తికి సారీ చెప్పిన లోకేష్.. అసలేమైందంటే?
Nara Lokesh sorry to complainant:ఏపీ మంత్రి నారా లోకేష్ ఓ వ్యక్తికి క్షమాపణలు చెప్పారు. తన తరుఫున, తన విభాగం తరుఫున అతనికి క్షమాపణలు చెప్పారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. అసలు సంగతిలోకి వస్తే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి లోకేష్ పెద్ద పీట వేస్తున్నారు. ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. సత్వర పరిష్కారం కోసం కృషిచేస్తున్నారు. అయితే మంగళగిరి నియోజకవర్గం ప్రజలకు ప్రజాదర్బార్ ద్వారా అందుబాటులో ఉంటున్న నారా లోకేష్.. …
Read More »వైసీపీ కార్యాలయం కూల్చివేతకు కారణమదే.. ఆళ్ల నాని
YSRCP Office Demolished in Eluru: ఏలూరులో వైసీపీ కార్యాలయం కూల్చివేత వ్యవహారంపై మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కీలక విషయాలు వెల్లడించారు. ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్ష పదవితో పాటుగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి పదవికి కూడా ఆళ్ల నాని రాజీనామా చేశారు. తాజాగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశం నిర్వహించిన ఆళ్ల నాని.. కీలక విషయాలు వెల్లడించారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి …
Read More »పెళ్లి చేసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన జంటకు ట్విస్ట్.. పోలీసుల అదుపులో,
ఓ జంట పెళ్లి చేసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఇంతలో పోలీసులు సడన్ ఎంట్రీ ఇచ్చారు.. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందని ఆరా తీస్తే.. అప్పుడు అసలు సంగతి తెలిసింది. విజయవాడకు చెందిన సాంబశివరావు అలియాస్ శివ, అలేఖ్య ప్రేమించుకుంటున్నారు.. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. విజయవాడలోని భవానీపురం పోలీసు స్టేషన్లో అలేఖ్య కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కొత్త జంట తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్న విషయాన్ని గుర్తించిన భవానీపురం పోలీసులు తిరుచానూరు …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal