ఉత్తరాంధ్ర టు హైదరాబాద్.. అక్కడ తీగ లాగితే ఇక్కడ డొంక మొత్తం కదిలింది. కొంతకాలంగా హైదరాబాద్‌లో గంజాయి, డ్రగ్స్ దందాలు నడుస్తున్నాయి. కొంతమంది ఉత్తరాంధ్ర నుంచి గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. ఈ ముఠాను పట్టుకున్న పోలీసులు.. ఈ దందాపై ఆరా తీస్తే ఉత్తరాంధ్రలో డొంక కదిలింది.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. రెండు రోజుల క్రితం పోలీసులు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న బాలాజీ గోవింంద్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు.. వారిని ప్రశ్నిస్తే ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. బాలాజీ గోవింద్ …
Read More »ఏపీ మంత్రిపై అభిమానంతో కేజీ చికెన్ రూ.100కే.. ఎగబడిన జనం, ట్రాఫిక్ కష్టాలు
కర్నూలులో బంపరాఫర్ ఇచ్చారు.. రూ.100కే చికెన్ అన్నారు. ఇంకేముంది జనాలు అక్కడికి క్యూ కట్టారు.. దెబ్బకు రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నగరంలోని మద్దూర్ నగర్‌లో షమీర్ చికెన్ సెంటర్, సుభాన్ మటన్ చికెన్ సెంటర్‌లు ఉన్నాయి. వీరిద్దరు ఒకరిపై మరొకరు పోటీపడి కిలో చికెన్ ధర రూ.100కు తగ్గించారు. దీంతో జనాలు చికెన్ కొనేందుకు షాపుల దగ్గర బారులు తీరారు. ఈ ఆఫర్ ఏమో కానీ వాహనాల రాకపోకలకు రెండు గంటలకు పైగా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు కలగ జేసుకొని …
Read More »ఏపీలో పింఛన్ డబ్బులు ఒకరోజు ముందుగానే ఇస్తారు.. కారణం ఇదే, ఈ నెల నుంచి మరో కొత్త రూల్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెలకు సంబంధించిన పింఛన్‌ను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ డబ్బుల్ని పంపిణీ చేస్తోంది. కానీ ఒకటో తేదీన సెలవు అయితే మాత్రం ముందు రోజే పింఛన్ పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్ 1 ఆదివారం కావడంతో పింఛన్ డబ్బుల్ని ఒక రోజు ముందుగానే.. అంటే నవంబర్ 30వ తేదీనే పంపిణీ చేయనున్నారు. పింఛన్ తీసుకునేవారు ఈ విషయాన్ని …
Read More »శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. ఉచిత బస్సు సర్వీస్ ప్రారంభం
శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక. ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. భక్తుల సౌకర్యార్థం శుక్రవారం ఉచిత బస్సును ప్రారంభించారు. శ్రీశైలంలో పర్వదినాలు, వారాంతపు సెలవు రోజుల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో క్షేత్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైల క్షేత్రంలో భక్తులు ప్రయాణించేందుకు వీలుగా ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు బస్సును అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ బస్సు గణేశ సదనం, అన్నప్రసాద భవనం మీదుగా క్యూ కాంప్లెక్సు వరకు ప్రయాణిస్తుందని తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని …
Read More »ఏపీలో కాలేజీలకు సీరియస్ వార్నింగ్.. రూ.15 లక్షలు జరిమానా, విద్యార్థులకు పండగే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం.. నిర్దేశిత ఫీజుల కంటే అధికంగా వసూలు చేయడం వంటి ఫిర్యాదులు వస్తున్నాయంది ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ హెచ్చరించింది. అలా నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలకు రూ.15 లక్షల జరిమానా విధించే అధికారం కమిషన్‌కు ఉందని గుర్తు చేశారు. కొన్ని విద్యా సంస్థలు కోర్సు పూర్తైనా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని.. ప్రభుత్వ ఆదేశాల్లో పేర్కొన్న ఫీజు కంటే ఎక్కువగా …
Read More »విశాఖ: ఆటో డ్రైవర్‌కు రూ.10వేలు జరిమానా.. అమ్మో పోలీసులే అవాక్కు, కారణం ఏంటో తెలుసా!
విశాఖపట్నంలో ఆటో డ్రైవర్‌కు పోలీసులు భారీ జరిమానా విధించారు. డ్రైవర్ నిబంధనలకు విరుద్ధంగా, పరిమితికి మించి ఆటోలో స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు జరిమానా విధించినట్లు వన్‌టౌన్ ట్రాఫిక్ సీఐ చెప్పారు. వన్‌టౌన్ ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.. ఆ సమయంలో పూర్ణమార్కెట్ నుంచి జగదాంబకూడలికి వెళ్తున్న ఆటోను ఆపారు.. అందులో ఏకంగా 20 మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. ఆటోలో ఏకంగా 20మందిని చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు.. అంతమందిని ఎలా ఎక్కించావురా బాబూ అంటూ …
Read More »ఏపీకి మరో ఇంటర్నేషనల్ కంపెనీ.. 300 ఎకరాల్లో ప్లాంట్, వెండార్ పార్క్! దశ తిరిగినట్లే..
టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలు ఎంవోయూలు కూడా కుదిరాయి. తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. ప్రముఖ ఎలక్ర్టానిక్స్ సంస్థ ఎల్‌జీ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఎల్‌జీతో పాటుగా ఆ కంపెనీకి విడిభాగాలు సరఫరా చేసే కొరియా, చైనీస్ సంస్థలు కూడా.. భారతదేశంలో రూ.7000 కోట్లు పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. రూ.7 వేల కోట్లతో ఎల్‌జీ …
Read More »మూడు నెలల్లో తిరుమలలో ఆ సమస్యకు చెక్.. టీటీడీ ఈవో హామీ
టీటీడీ ఈవో జె. శ్యామలరావు తిరుమలలో శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గోగర్భం జలాశయం సమీపంలోని కాకులమాను దిబ్బ వద్ద ఉన్న డంపింగ్ యార్డును టీటీడీ ఈవో తొలుత పరిశీలించారు. దశాబ్దాల తరబడి పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. తిరుమలలో 30 ఏళ్ల నుంచి లక్ష మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందన్న టీటీడీ ఈవో శ్యామలరావు.. దీని వలన అనేక …
Read More »తిరుమల రూపురేఖలు మారబోతున్నాయి.. త్వరలోనే, టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు
తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు టీటీడీ ఈవో జే శ్యామలరావు. తిరుపతిలోని పరిపాలన భవనంలోని మీటింగ్ హాల్‌లో తిరుమలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ ధార్మిక కేంద్రమైన తిరుమలను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా డిజైన్లు రూపొందించాలన్నారు. ఇందుకోసం విజన్ డాక్యుమెంట్ తక్షణావసరం అని, టీటీడీకి అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తిరుమలలో పాదచారులకు అనుకూలంగా ఫుట్‌పాత్‌లను మార్చడంతో పాటు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు …
Read More »వైసీపీకి అసెంబ్లీలో షాక్.. జనసేన ఎమ్మెల్యేకు కేబినెట్ హోదా పదవి ఫిక్స్!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. పీఏసీ (ప్రజాపద్దుల కమిటీ) ఛైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేసినా సరే పదవి దక్కే పరిస్థితి కనిపించడం లేదు. అనుకున్నట్లుగానే జనసేన పార్టీకి ఈ పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా భీమవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎన్నిక దాదాపు ఖాయమైందని చెబుతున్నారు. ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. ఇవాళ వైఎస్సార్‌సీపీ నామినేషన్ ఉపసంహరించుకోకపోతే అసెంబ్లీ కమిటీహాల్‌లో పీఏసీ సభ్యత్వానికి పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నిక బ్యాలెట్ …
Read More »