ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొబైల్ ఫోన్ల వినియోగంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో కొంతమంది సభ్యులు సభలో కూర్చోనే ఫోన్లలో మాట్లాడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై చర్చించే అసెంబ్లీలో మొబైల్ ఫోన్లను ఉపయోగించుకుంటూ వ్యక్తిగత సంభాషణల్లో నిమగ్నమవుతుండటం తగదంటూ సభ్యులను సున్నితంగా హెచ్చురించారు. అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి ఒక పవిత్ర వేదిక అని, ఇక్కడి గౌరవాన్ని అన్ని సందర్భాల్లో రక్షించాల్సిన బాధ్యత సభ్యులపై ఉందని డిప్యూటీ స్పీకర్ గుర్తు చేశారు. సభా …
Read More »హిందీని రుద్దడాన్ని నేను వ్యతిరేకించాను! మరోసారి భాషా వివాదంపై స్పందించిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపిస్తుండగా, పవన్ కళ్యాణ్ హిందీని వ్యతిరేకించేవారు తమ సినిమాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తారని ప్రశ్నించారు. డీఎంకే నేతలు కూడా స్పందిస్తూ హిందీని బలవంతం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మరోసారి ఈ అంశంపై ట్వీట్ చేశారు.హిందీ భాషా గురించి కొనసాగుతున్న వివాదం గురించి తెలిసిందే. తమపై హిందీని బలవంతంగా కేంద్రం రుద్దుతుందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది. అలాంటిదేం లేదని కేంద్ర …
Read More »మీకు – నాకు మధ్య పరదాలు లేవు.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
తమది ప్రజా ప్రభుత్వమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జరుగుతున్న “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా తణుకులోని ఎన్టీఆర్ పార్క్ లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చంద్రబాు నాయుడు చెత్త ఊడ్చారు. అనంతరం కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలు, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడిన ఆయన.. ప్రజలు ఏమి చెప్పినా వినే ప్రభుత్వం తమదన్నారు. గత ప్రభుత్వంలో మాదిరి, మీకు నాకు మధ్య పరదాలు లేవంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ …
Read More »అది వ్యతిరేకించడం కాదు..! పవన్‌కు ఎవరైనా చెప్పండి ప్లీజ్..! జనసేనానికి ప్రకాశ్ రాజ్ కౌంటర్
జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. తమిళనాడులో హిందీ వ్యతిరేకతను ఆయన ప్రస్తావించగా, తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయకూడదని, అన్ని భాషలకు ప్రాధాన్యత ఉండాలని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు డీఎంకే నేతలు, ప్రకాష్ రాజ్ వంటి వారు కౌంటర్ ఇచ్చారు.జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దేశంలోని అన్ని భాషలు అవసరం అని, హిందీని వద్దంటున్న తమిళనాడు వాళ్లు వాళ్ల సినిమాలను …
Read More »డేంజర్ బెల్.. ప్రమాదకర స్థాయికి యూవీ ఇండెక్స్.. ఆ సమయాల్లో బయటకు రావొద్దు..
భానుడి భగభగలు చూసి మే నెల వచ్చిందా అని చూస్తే… క్యాలెండర్ ఇంకా మార్చి కూడా దాటలేదు. అప్పుడే భాస్కరుడు బెంబేలెత్తిస్తున్నాడు. బయటకొచ్చారా… మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు. ఇప్పుడే ఏమైంది.. UV రేస్‌తో ముందుంది మరింత మంట అంటున్నాడు. అసలీ UV కిరణాల కథేంటి..? తెలుగు రాష్ట్రాలపై వాటి ప్రభావం ఎలా ఉండబోతోంది…?వేసవి కాలం హడలెత్తిస్తోంది.. ఈసారి ఫిబ్రవరి నుంచే ఫుల్ ఫైర్ మీదున్నాడు భానుడు. ఉదయం తొమ్మిది గంటల నుంచే దంచికొడుతున్నాడు. సాయంత్రమైనా భూమి సెగలు.. పొగలు కక్కుతుందంటే …
Read More »NTR Trust Merit Scholarship Test 2025కు దరఖాస్తులు ఆహ్వానం.. మరో పది రోజుల్లోనే పరీక్ష!
యూపీఎసస్సీ యేటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షకు లక్షలాది మంది విద్యార్ధులు పోటీ పడుతుంటారు. నిరుపేద విద్యార్ధులు కోచింగ్ తీసుకునే స్థోమతలేని వారి కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అద్భుత అవకాశం అందిస్తోంది. అదేంటంటే.. ఈ ట్రస్ట్ అనుబంధ సంస్థ అయిన ఎక్సెల్ సివిల్స్ అకాడమీ.. యూపీఎస్సీ మెరిట్ స్కాలర్‌షిప్ 2025 పరీక్ష ద్వారా..ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనుబంధ సంస్థ అయిన ఎక్సెల్ సివిల్స్ అకాడమీ.. యూపీఎస్సీ మెరిట్ స్కాలర్‌షిప్ 2025 పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు ఎక్సెల్ సివిల్స్ అకాడమీ డైరెక్టర్ …
Read More »రాజధాని అమరావతికి 300 బస్సులు ఏర్పాటు చేసిన టీటీడీ! ఎందుకంటే..?
వెంకటపాలెంలో జరుగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవానికి 27,000 మంది భక్తులు హాజరు కానున్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు విస్తృత ఏర్పాట్లను వెల్లడించారు. 300 బస్సులను ఏర్పాటు చేశారు. పూల అలంకరణ, భక్తి సంగీత కార్యక్రమాలు, ప్రసాదాల పంపిణీతో కళ్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. విద్యుత్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.వెంకటపాలెంలో శనివారం సాయంత్రం జరుగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని 27,000 మంది భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు వెల్లడించారు. శుక్రవారం ఆలయం ముందు ఉన్న క్యాంపు కార్యాలయంలో టీటీడీ అధికారులు, జిల్లా అధికారులతో ఆయన …
Read More »ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్ బోర్డు
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే హాల్ టికెట్లు రావడంతో.. రంగుల పేపర్లపై వాటిని డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు వస్తున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించారు. ఇలా రంగుల పేపర్లతో పరీక్ష కేంద్రానికి తీసుకువచ్చే హాల్‌టికెట్లను అనుమతించబోమని తాజాగా ఇంటర్ బోర్డు హెచ్చిరించింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. పరీక్షలకు వారం ముందు విద్యార్ధుల మొబైల్ నంబర్లకు …
Read More »జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు
ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సోదరుడు, జనసేన నేత నాగబాబు పేరు ఖరారైంది. ఆయన పేరును జనసేన అధినేత పవన్ ఫైనల్ చేశారు. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు త్వరలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఏపీలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానానికి అభ్యర్థి ఖరారయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన సోదరుడు నాగబాబు పేరును జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు. ప్రస్తుతం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబుకు దక్కే పదవిపై కొంతకాలంగా అనేక …
Read More »నిరుద్యోగులకు శుభవార్త.. ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు వయోపరిమితి పెంచిన కూటమి సర్కార్!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) సహా ఇతర నియామక సంస్థల ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ యూనిఫామ్ పోస్టులకు గరిష్ట వయోపరిమితిని రెండు సంవత్సరాలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇది ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమలు అవుతుందని స్పష్టం చేసింది. APPSC, ఇతర నియామక సంస్థల ద్వారా రాబోయే నియామకాల్లోని అన్ని సర్వీసులలోని..రాష్ట్ర నిరుద్యోగులకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆయా కేటగిరీలో నిరుద్యోగుల వయోపరిమితిని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రస్తుతం ఉన్న …
Read More »