2024-25 విద్యా సంత్సరానికి సంబంధించి ఇంటర్ రెగ్యులర్, ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలు మార్చి మొదటి వారం నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రెగ్యులర్ ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 3 నుంచి 15 వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 26 జిల్లాల్లో దాదాపు పది లక్షల మంది విద్యార్ధులు హాజరుకానున్నారు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ రెగ్యులర్, ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలు మార్చి నుంచి ప్రారంభంకానున్న సంగతి …
Read More »హైదరాబాద్‌లో పోసాని కృష్ణమురళి అరెస్ట్.. ఏపీకి తరలింపు.!
ఏపీలో మరో పొలిటికల్ వికెట్ పడింది. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. పోసాని అరెస్ట్‌తో మరోసారి వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న పోసాని ఇంటికి వెళ్లి నిన్న రాత్రి నోటీసులు ఇచ్చారు. పోసానిని అరెస్ట్ చేస్తున్నట్లు.. కుటుంబ సభ్యులకు చెప్పారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి.. అదుపులోకి తీసుకున్నారు. పోసాని …
Read More »వైసీపీకి భారీ ఎదురుదెబ్బ.. జనసేనలోకి 20 మంది కార్పోరేటర్లు
ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒంగోలులో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఒంగోలు కార్పొరేషన్‌లో 20 మంది కార్పొరేటర్లు, ఇద్దరు కో ఆప్షన్ మెంబర్లు వైసీపీ కండువాను మార్చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులుగా ముద్రపడిన వారంతా జనసేన చేరారు. బాలినేని ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు కార్పొరేటర్లు.ఒంగోలు డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవ్‌తో పాటు పార్టీ …
Read More »ప్రతిపక్షహోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం.. వైసీపీ డిమాండ్‌పై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
ప్రతిపక్ష హోదా విషయంలో తగ్గేదేలే.. అని వైసీపీ నేతలు అంటుంటే.. అసలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేదేలే.. అంటున్నారు కూటమి నేతలు.. ఏపీ బడ్జెట్ సమావేశాల వేళ వైసీపీ-కూటమి నేతల మధ్య విపక్ష హోదా మరోసారి అగ్గి రాజేసింది. ప్రతిపక్ష హోదా మా హక్కు అని ఫ్యాన్ పార్టీ డిమాండ్ చేస్తుంటే.. అడుక్కుంటే LOP హోదా ఇవ్వరని కౌంటర్ ఇస్తోంది సర్కార్.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలిరోజు గవర్నర్ నజీర్ ప్రసంగించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తూ.. స్వర్ణాంధ్ర విజన్ ఆవిష్కరణే లక్ష్యంగా …
Read More »20 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రెండో రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు కూన రవికుమార్. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే నిన్న మాజీ సీఎం జగన్ సహా వైసీపీ MLAలంతా సభకు.. ఆ వివరాలు ఇలా..ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు కూన రవికుమార్. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే నిన్న మాజీ సీఎం జగన్ సహా వైసీపీ MLAలంతా సభకు …
Read More »ఏపీ మిర్చి రైతులకు తీపికబురు.. కేంద్రం కీలక ప్రకటన
ఏపీ రాజకీయాల్లో ఘాటు పెంచిన మిర్చి ఎపిసోడ్‌లో శుభం కార్డు పడింది. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి ఇక తెరపడినట్టే కనిపిస్తోంది. రాష్ట్రంలో మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మద్దతు ధర ఇస్తామంది.ఏపీ రాజకీయాలను గత కొన్ని రోజుల పాటు మిర్చి పంట కుదిపేసింది. వైసీపీ అధినేత జగన్ ..గుంటూరు మిర్చి యార్డ్‌కు వెళ్లి అక్కడి సమస్యలపై మాట్లాడారు. ఇక అప్పటి నుంచి రాజకీయాల్లో మిర్చి ఘాటెక్కింది. మిర్చి రైతులను ఆదుకోవాలని ప్రతిపక్షం.. …
Read More »ఐటీ నుంచి ఏఐ రివల్యూషన్ దిశగా.. ఏపీ గవర్నర్ స్పీచ్ హైలైట్స్ ఇవే
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ కూడా హాజరయింది. జగన్‌తో సహా ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదాను డిమాండ్ చేశారు. అటు గవర్నర్ ప్రసంగం వైసీపీ నేతల నినాదాల మధ్యే కొనసాగింది. సంక్షేమం, అభివృద్ధి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కల సాకారం దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. ‘పెన్షన్లు రూ. 4 వేలకు పెంచాం. ఏడాదికి రూ. 3 …
Read More »ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఆన్సర్ ‘కీ’ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
నాటకీయ పరిణామాల మధ్య ఆదివారం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం రెండు పేపర్లకు జరిగిన ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీలను పరీక్ష జరిగిన రోజునే కమిషన్ విడుదల చేసింది. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీతోపాటు అభ్యర్ధుల రెస్పాన్స్‌షీట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది..రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తెలిపింది. ఆదివారం నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు మొత్తం 92,250 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. …
Read More »ఏపీ అసెంబ్లీ సమావేశాలు అంతా సిద్దం.. వైఎస్ జగన్ హాజరు.. మరోసారి ప్రతిపక్ష హోదా తెరపైకి.!
ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమరం ప్రారంభం కాబోతోంది. అయితే, సమావేశాలకు హాజరవుతున్నామని వైసీపీ ప్రకటించడంతో వాతావరణం ఆసక్తికరంగా మారింది. జగన్‌తో సహా ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదాను డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. సభ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులపాటు సమావేశాలు నిర్వహించాలి, …
Read More »కడప జైల్ మెడికల్ క్యాంపు వెనకాల… ఏం జరిగిందో తెలిస్తే..
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ్‌ను విచారణ అధికారిగా నియమించారు. విచారణలో భాగంగా, డాక్టర్ చైతన్యరెడ్డి, అప్పటి కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఐఎన్‌ఎస్ ప్రకాష్, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్యలపై కేసులు నమోదు చేశారు. విచారణలో, డాక్టర్ చైతన్యరెడ్డి జైలులో దస్తగిరి బ్యారక్‌లోకి ప్రవేశించి, ఆయనను బెదిరించారనే ఆరోపణలపై దృష్టి పెట్టారు.వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి, కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో బెదిరింపులకు గురైనట్లు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం …
Read More »