ఆంధ్రప్రదేశ్

ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పు సులభతరం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

మనదేశంలో ప్రస్తుతం ప్రభుత్వ పరంగా ఏ పని జరగాలన్నా.. ఆధార్ కార్డు కావాల్సిందే. అన్నింటికీ అదే ఆధారం. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల నుంచి గుడిలో దైవ దర్శనాల వరకూ అన్నింటికీ ఆధారం ఆధార్ కార్డే. మరీ చెప్పాలంటే భారతీయులకు ఆధార్ కార్డు అనేది ఓ నిత్యావసరంగా మారిపోయింది. రేషన్ దుకాణాల నుంచి మొదలుపెడితే.. సిమ్ కొనాలంటే సెల్ ఫోన్ దుకాణాల వరకూ ఆధార్ లేనిదే పని జరగని పరిస్థితి. ఇక వయస్సు ధ్రువీకరణ కోసం కూడా ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ …

Read More »

పేరు కోసం ప్రయత్నించడమే ఆ రెండుసార్లు ఓడిపోయా.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

తాను పేరు కోసం ప్రయత్నించి ఓడిపోయానని, అందరూ నన్ను ఆహా ఓహో అని పొగుడుతుంటే అన్నీ బాగా చేస్తున్నానేమోనని భ్రమపడి.. ప్రజలను వదిలి ముందుకెళ్లడం మొదలుపెట్టానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హిందూస్థాన్ టైమ్స్ పత్రిక వందేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన నాయకత్వ సదస్సులో ఏపీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉండగా 2004, 2019 ఎన్నికల్లో ఓడిపోవడానికి తాను పేరు కోసం ప్రయత్నించడమే కారణమని చెప్పారు. అందరూ నన్ను పొగుడుతుంటే అన్నీ బాగా చేస్తున్నానేమోనని భావించానని, దానివల్ల ప్రజలను వదిలి …

Read More »

ఏపీలో వారందరికీ శుభవార్త.. ఉచితంగా ట్రైనింగ్.. ప్రతినెలా రూ.1500..

డీఎస్సీ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి ఉచితంగా శిక్షణ అందిస్తోంది. ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వటంతో పాటుగా స్టైఫండ్ కూడా అందివ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న బీసీ స్టడీ సర్కిళ్లలో డీఎస్సీ కోసం ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. ఉచిత శిక్షణ శనివారం నుంచి ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 జిల్లా కేంద్రాల్లోని బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇస్తోంది. మరోవైపు బీసీ స్టడీ సర్కిళ్లలో డీఎస్సీ ఉచిత కోచింగ్ …

Read More »

AP New Airports: ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు.. నిధులు విడుదల

ఆంధ్రప్రదేశ్ వాసులకు శుభవార్త. ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. నూతన విమానాశ్రయాల ఏర్పాటు దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో 6 కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఫీజిబిలిటీ స్టడీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1.92 కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆరు విమానాశ్రయాల అభివృద్ధికి సంబంధించి ఫీజబులిటీ స్టడీ కోసం నిధులు విడుదల చేస్తామని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి …

Read More »

Chandrababu Brother: చంద్రబాబు కుటుంబంలో తీవ్ర విషాదం.. సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. చంద్రబాబు నాయుడు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూ్ర్తి నాయుడు (72) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు.. నవంబర్ 14వ తేదీ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు నారా రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. నారా రామ్మూర్తి నాయుడుకు భార్య ఇందిర, ఇద్దరు కుమారులు …

Read More »

ఏపీ హైకోర్టులో సింహాచలం ఆలయానికి ఊరట.. 14 ఏళ్ల తర్వాత ఏకంగా రూ.650 కోట్లు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సింహాచలం ఆలయానికి ఊరట దక్కింది. గత పదిహేనేళ్లుగా ఆక్రమణదారుల చేతుల్లో చిక్కుకొని న్యాయవివాదంలో ఉండిపోయిన సింహాచలం దేవస్థానానికి చెందిన భూములు హైకోర్టు తీర్పుతో తిరిగి దక్కాయి. ఈ భూముల విలువ ఏకంగా సుమారు రూ.650 కోట్లని చెబుతున్నారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు సింహాచలం ఆలయ అధికారులకు ఈ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను అందజేశారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గంగసాని అగ్రహారంలో సింహాచలం దేవస్థానం అనుబంధంగా కాశీవిశ్వేశ్వరస్వామి కోవెల ఉంది. ఈ ఆలయానికి సర్వే నంబర్లు 3/1, 3/4లలో 99.20 …

Read More »

మహాసేన రాజేష్‌పై కేసు నమోదు.. మహిళ ఫిర్యాదుతో, మార్ఫింగ్ ఫోటోలపై!

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలానికి చెందిన టీడీపీ అధికార ప్రతినిధి సరిపెళ్ల రాజేష్ (మహాసేన రాజేష్)పై కేసు నమోదైంది. ఆయన అనుచరులు రంజిత్‌మెహర్‌ (రాజోలు), యెల్లమిల్లి పండు (తూర్పుపాలెం), బోడపాటి చక్రి (తుని), వీరవల్లి ఏసుబాబు (భీమవరం), పృథ్వీరాజ్‌లపై డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో తనపై జనవరి, ఫిబ్రవరిల్లో అనుచిత పోస్టులు చేశారని శంకరగుప్తంకు చెందిన నేతల శాంతి ఈ నెల 12న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఈ కేసు నమోదు …

Read More »

ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. డిసెంబర్ 5న పక్కా, రెడీగా ఉండండి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి కీలకమైన చట్టం తీసుకురానుంది. ప్రతి ఏటా మే 31నాటికి ఉన్న ఖాళీలను పరిగణనలోకి తీసుకొని బదిలీల ప్రక్రియ ఉంటుంది. బదిలీల తర్వాత జూన్‌ 1న స్కూళ్లలో చేరేలా ఉత్తర్వులు ఇస్తారు. బదిలీలకు సంబంధించి ప్రధానోపాధ్యాయులకు కనీసం రెండేళ్లు, గరిష్ఠంగా ఐదేళ్లు, ఉపాధ్యాయులకు కనీసం రెండేళ్లు, గరిష్ఠంగా 8ఏళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకుంటారు. హెచ్‌ఆర్‌ఏ 16% ఉన్న వాటిని కేటగిరి-ఏ, 12% వాటిని కేటగిరి-బీ, 10% ఉంటే కేటగిరి-సి, 5వేల కంటే తక్కువ …

Read More »

తిరుమల శ్రీవారికి బెంగళూరు, హైదరాబాద్ భక్తుల భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తం, ఎంతంటే!

తిరుమల శ్రీవారికి ఇద్దరు భక్తులు భారీ విరాళాలను అందించారు. బెంగళూరుకు చెందిన బీఎంకే నగేష్ అనే భక్తుడు టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు దాత నగేష్ స్వయంగా డీడీని టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు. మరోవైపు తిరుమల శ్రీవారికి హైదరాబాద్‌కు చెందిన మరో భక్తుడు ఎలక్ట్రిక్ బైకుల్ని కానుకగా అందజేశారు. హైదరాబాద్ పెరల్ మినిరల్స్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సీ వెంకట నాగరాజ 15 …

Read More »

ఏపీకి కేంద్రం భారీ శుభవార్త.. రూ.85 వేలకోట్లు పెట్టుబడి.. ఈ నెల్లోనే ప్రధాని శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరో శుభవార్త వినిపించింది. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ రూ.85 వేలకోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల(నవంబర్)లోనే శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. నవంబర్ 29వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఇది పూర్తి అయితే భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఫెసిలిటీగా నిలుస్తుంది. …

Read More »