జాతీయం

భారత్ బలమేంటో తెలుసా.. ఒత్తిడి, అవరోధాలను జయించి విజయం సాధించే మార్గమిదే: శ్రీశ్రీ రవిశంకర్

భారత్ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్న ఈ శుభ తరుణంలో.. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ కీలక సందేశం ఇచ్చారు. యువతకు, ప్రతి పౌరుడికి స్ఫూర్తినిచ్చే సూచనలు చేశారు. దేశానికి ఇప్పుడు ‘ఆధ్యాత్మిక విప్లవం’ కావాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక విప్లవం అంటే ఏమిటో, ఒత్తిడిని, అవరోధాలను జయించి ఎలా ముందుకు కదలాలో వివరించారు. శ్రీశ్రీ రవిశంకర్ సందేశం పూర్తి పాఠం ఆయన మాటల్లో.. ‘మన దేశం సౌందర్యం దాని వైవిధ్యంలోనే ఉంది. భారత ఉపఖండం విభిన్న …

Read More »

గురుకుల విద్యార్థినికి అరుదైన అవకాశం.. ఎర్రకోటలో వేడుకలకు కేంద్రం ఆహ్వానం

78వ స్వాతంత్ర్య వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైంది. ఈ వేడుకలకు దేశం నలుమూల నుంచి ప్రత్యేక అతిథులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. వివిధ రంగాల్లో ప్రత్యేక సేవలు అందించటం ద్వారా గుర్తింపు పొందిన సామాన్యులను.. అతిథులుగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించటం ఆనవాయితీ. అయితే.. ఆ ప్రత్యేక అతిథుల జాబితాలో తెలంగాణకు చెందినవాళ్లు కూడా ఉండటం విశేషం. అతిథుల జాబితాలో రైతు ఉత్పత్తి సంస్థల ప్రతినిధులు.. అంగన్‌వాడీ కార్యకర్తలు.. ఆశా కార్యకర్తలు.. విద్యార్థులు.. ఉపాధ్యాయులు.. సామాజిక కార్యకర్తలు.. ఇలా చాలామందే ఉన్నారు. దేశ …

Read More »

ఎంతకు తెగించార్రా.. ఆయోధ్యలో రూ.50 లక్షలు విలువైన లైట్స్ చోరీ!

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రామజన్మభూమి అయోధ్యలో భారీ చోరీ చోటుచేసుకుంది. రామమందిర సమీపంలోని భక్తిపథ్, రామ్‌ పథ్‌లో ఏర్పాటుచేసిన లైట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ప్రొజెక్టర్ లైట్స్‌తో పాటు వేలాది వెదురు బొంగులు చోరీకి గురయినట్టు తెలిపిన పోలీసులు.. వీటి విలువ రూ.50 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. అత్యంత భద్రత ఉండే అయోధ్యలోనే ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. దాదాపు 4 వేల లైట్స్‌ని దొంగలు ఎత్తుకుపోయారని తెలిపారు. ఈ ఘటనపై రామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఆగస్టు 9వ తేదీన కేసు …

Read More »

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియమాకం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామాకాలపై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈ ఎమ్మెల్సీల నియమాకాల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టే విధించాలన్న పిటిషనర్ అభ్యర్ధనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే… గవర్నర్‌, ప్రభుత్వ హక్కులను హరించినట్లే అవుతుందని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్రల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎప్పటికప్పుడు నియామకాల చేపట్టడం ప్రభుత్వ విధి …

Read More »

ఐటీఆర్- 1, 2, 3లో.. ఎవరికి ‘రీఫండ్’ త్వరగా వస్తుంది? ఆలస్యమైతే ఏం చేయాలి?

Tax Refunds: గత ఆర్థిక సంవత్సరం 2023-24 (అసెస్మెంట్ ఇయర్ 2024-25)కి సంబంధించి 7 కోట్లకుపైగా ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. వారంతా ఇప్పుడు తమ ట్యాక్స్ రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది రిటర్నులను ఐటీ శాఖ ప్రాసెస్ చేసి రీఫండ్స్ వారి ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే, చాలా మందికి ఇంకా రీఫండ్ జమ కావడం లేదు. ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు ఐటీఆర్-1 ఫారం, ఐటీఆర్-2, ఐటీఆర్-3 ఫారం ఎంచుకుంటారు. మీరు ఐటీఆర్ 2, ఐటీఆర్ 3 ఎంచుకున్నట్లయితే ఇప్పటి …

Read More »

చెన్నై టు విశాఖపట్నం వయా సికింద్రాబాద్.. ఆ బ్యాగు అక్కడికి చేరింది, ఆ దొంగ మంచి చేసినట్లేనా!

చెన్నై టు సికింద్రాబాద్ ఏంటి.. బ్యాగు విశాఖకు చేరడం ఏంటి అనుకుంటున్నారా?.. అవును సినిమా రేంజ్‌లో ఓ స్టోరీ జరిగింది. ఓ ఉద్యోగికి సంబంధించి బ్యాగు కహానీ ఇది. చెన్నైలో మొదలై సికింద్రాబాద్ మీదుగా విశాఖపట్నానికి చేరింది. తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన కార్తికేయన్‌కు హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చింది. ఈనెల 8న యువకుడు ఉద్యోగంలో చేరేందుకు శబరి ఎక్స్‌ప్రెస్‌లో కాట్పాడి నుంచి సికింద్రాబాద్‌ బయలుదేరాడు. రైలులో కార్తికేయన్‌ నిద్రలోకి జారుకున్నారు.. ఆ తర్వాత కొంతసేపటికి లేచి చూస్తే అతడి బ్యాగు మాయమైంది. నిద్రలేచిన కార్తికేయన్‌.. …

Read More »

78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(droupadi murmu) నేడు(ఆగస్టు 14న) 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం రాత్రి 7 గంటల నుంచి ఆల్ ఇండియా రేడియోతోపాటు జాతీయ నెట్‌వర్క్‌ దూరదర్శన్‌లోని అన్ని ఛానెల్‌లలో హిందీలో ఆపై ఇంగ్లీష్ వెర్షన్‌లో ప్రసారం చేయబడుతుంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(droupadi murmu) నేడు(ఆగస్టు 14న) 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం రాత్రి 7 గంటల నుంచి ఆల్ ఇండియా రేడియోతోపాటు జాతీయ నెట్‌వర్క్‌ దూరదర్శన్‌లోని …

Read More »

సెబీ చీఫ్‌పై ఆరోపణలు.. స్పందించిన మారిషస్.. ఆఫ్‌షోర్ ఫండ్‌పై కీలక వ్యాఖ్యలు!

సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఛైర్ పర్సన్ మాధబీ పురి బచ్‌పై అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మారిషస్ దేశం స్పందించింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలను ఖండించింది. ఆ సంస్థ చేసిన ఆరోపణల్లోనే కీలకమైన ఆఫ్‌షోర్ ఫండ్ తమ దేశంలో లేదని మారిషస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిషన్ స్పష్టం చేసింది. సెల్ కంపెనీలు సృష్టించేందుకు తమ దేశం అనుమతివ్వదని తేల్చి చెప్పింది.  ఆగస్టు 10, 2024 రోజున హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ప్రచురించిన …

Read More »

బిగ్ ట్విస్ట్.. కవితకు నో బెయిల్.. ఆ నిందితునికి మాత్రం భారీ ఊరట..!

Delhi Liquor Scam Case: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజులో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఈ కేసులో సుమారు 17 నెలలుగా జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎట్టకేలకు ఇటీవలే బెయిల్ దొరకగా.. ఇప్పుడు ఈ కేసులో నిందితునిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. అభిషేక్ బోయినపల్లి మధ్యంతర బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం.. మరో రెండు వారాలు పొడిగిస్తూ తీర్పునిచ్చింది. అదనపు సొలిసిటర్ జనరల్ …

Read More »

వారందరికీ నోటీసులు పంపుతోన్న ఐటీ శాఖ.. రూ.6 లక్షలు దాటితే అంతే..!

Remittance: మీరు విదేశాలకు డబ్బులు పంపిస్తున్నారా? ట్యాక్స్ తప్పించుకునేందుకు అడ్డదారులు అనుసరిస్తే మీకు నోటీసులు రావచ్చు. తాజాగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 6 లక్షలు ఆపైన ఫారెన్ రెమిటెన్స్ (విదేశీ చెల్లింపులు) ట్రాన్సక్షన్లపై సమగ్ర పరిశీలన చేయనుంది. విదేశాలకు రూ. 6 లక్షలకు మించి డబ్బులు పంపిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టనుంది. ఫారెన్ రెమిటెన్స్‌లో ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు చాలా మంది అడ్డదారులు తొక్కుతున్నారని ఐటీ శాఖ దృష్టికి వచ్చిన క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత …

Read More »