టెక్స్ టైల్ సెక్టార్ కంపెనీ అక్షిత కాటన్ లిమిటెడ్ ( Axita Cotton Limited) తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. బోనస్ షేర్ల జారీ ప్రకటన చేసింది. ఈ బోనస్ షేర్లు జారీకి కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపినట్లు స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో వెల్లడించిది. అలాగే గతంలో నిర్ణయించిన రికార్డు తేదీ సెప్టెంబర్ 16ను సెప్టెంబర్ 20 కి మార్చినట్లు పేర్కొంది. అలాగే ఈ కంపెనీ షేరు గత మూడేళ్లో 561 శాతం మేర పెరిగి మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. ఈ స్టాక్ గురించి ఇప్పుడే తెలుసుకుందాం.
1:3 రేషియోలో బోనస్ షేర్లు అందించేందుకు ఆగస్టు 9, 2024నే నిర్ణయించింది. అంటే ప్రతి మూడు షేర్లకు ఒక షేరు ఉచితంగా లభించనుంది. రికార్డు తేదీ సెప్టెంబర్ 20, 2024 నాటికి ఎవరైతే తమ డీమ్యాట్ ఖాతాలో అక్షిత టెక్స్‌టైల్స్ షేర్లు కలిగి ఉంటారో వారికి బోనస్ షేర్లు పొందేందుకు అర్హత లభిస్తుంది. రికార్డు తేదీ తర్వాత షేర్లు కొనుగోలు చేస్తే బోనస్ షేర్లు అందవు. అక్షిత కాటన్ లిమిటెడ్ కంపెనీ పత్తి ఎగుమతిదారుగా మంచి గుర్తింపు పొందింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ కంపెనీని 2013లో ప్రారంభించారు. 2018లో స్టాక్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఐపీఓ ద్వారా రూ. 1,0.51 కోట్లు సమీకరించింది. అక్షిత కాటన్ బ్రాండ్‌కు బంగ్లాదేశ్,చైనా, వియత్నాం, ఇండోనేషియా, థాయిలాండ్‌లో మంచి ఆదరణ ఉంది.