జాతీయం

పలు రాష్ట్రాలకు గవర్నర్లు నియమాకం.. తెలంగాణకు ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం

పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి ఆమోదం తెలిపారు. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లతో పాటు మరో ముగ్గుర్ని వేరే రాష్ట్రాల నుంచి బదిలీ చేశారు. తెలంగాణకు సీనియర్ బీజేపీ నేత, త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం జిష్ణు దేవ్ వర్మ నూతన గవర్నర్‌గా నియమితులయ్యారు. మహారాష్ట్ర మాజీ స్పీకర్ హరిభౌ కిసన్‌రావ్‌ బాగ్డేను రాజస్థాన్ గవర్నర్‌గా, కేంద్ర మాజీ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్‌ను ఝార్ఖండ్‌కు.కర్ణాటకకు చెందిన మాజీ ఎంపీ సి.హెచ్‌.విజయశంకర్‌‌ను మేఘాలయ గవర్నర్‌గా నియమించారు. రాజస్థాన్ …

Read More »

ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..

వార ఫలాలు (జూలై 28 నుంచి ఆగస్టు 3, 2024 వరకు): మేష రాశి వారు ఈ వారం ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతాయి. వృషభ రాశి వారికి కుటుంబపరంగా కొన్ని సమస్యలు, చికాకులు ఉన్నప్పటికీ వాటిని తేలికగా అధిగమిస్తారు. మిథున రాశి వారికి ఆదాయానికి లోటు లేనప్పటికీ, వ్యయ స్థానంలో కుజ, గురువుల కారణంగా అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు …

Read More »

యంగ్ మినిస్టర్.. మీ నాన్న నాకు క్లోజ్ ఫ్రెండ్.. లోక్‌సభలో ఆసక్తికర దృశ్యం

కేంద్ర పౌరవిమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు రాజకీయాల్లోనే కాదు.. జాతీయ రాజకీయాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేస్తున్నారు. శ్రీకాకుళం ఎంపీగా హ్యాట్రిక్ కొట్టిన రామ్మోహన్ నాయడు.. మోదీ మంత్రివర్గంలో కేబినెట్ హోదాతో కూడా మంత్రి పదవి దక్కించుకున్నారు. పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్ నాయుడు.. మోదీ మంత్రివర్గంలో అతి పిన్నవయస్కుడైన కేబినెట్ మంత్రిగా గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే రామ్మోహన్ నాయుడు గురించి ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ …

Read More »

అమర్‌నాథ్ యాత్రపై ఉగ్రకుట్ర.. 

Amarnath Yatra: దేశవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అమర్‌నాథ్‌కు భక్తులు పోటెత్తుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లోని మంచుకొండల్లో కొలువైన ఈ క్షేత్రానికి చేరుకునేందుకు.. యాత్రికులు దేశం నలుమూల నుంచి ఎన్నో అవస్థలు పడి వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పవిత్ర అమర్‌నాథ్‌ యాత్రకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందింది. ఈ అమర్‌నాథ్ యాత్రలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ.. ఖలిస్థాన్ ఉగ్రవాద గ్రూపులు కుట్ర చేసినట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారం వచ్చింది. …

Read More »

మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధర.. వారంలో రూ.5000 డౌన్.. 

పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. బడ్జెట్ తర్వాతి రోజు నుంచే బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. ఈ వారం రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.5 వేలకుపైగా దిగిరావడం గమనార్హం. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆ తర్వాతి రోజు నుంచి సైతం …

Read More »

ఉత్తరాదిన దంచి కొడుతున్న వర్షాలు..

భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాది వణికిపోతోంది. ఢిల్లీ, హిమాచల్‌, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ముంబై మహా నగరాల్లో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఉత్తరాదిన భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్రతో పాటు ఢిల్లీలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.  ఢిల్లీ, ముంబై మహా నగరాల్లో ఎడతెరిపి లేని వానలతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముంబైను భారీ వర్షాలు ముంచెత్తడంతో రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. పుణెలో విద్యుత్‌షాక్‌తో నలుగురు మృతి చెందారు. ముంబైలోని లోతట్టు ప్రాంతాలు జలమయం …

Read More »

వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 27, 2024): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ రోజు స్థిరంగా సాగిపోతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వృషభ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. మిథున రాశి వారికి ఆదాయ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు చాలావరకు మారే అవకాశం ఉంది. …

Read More »

రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ ఇన్‌స్టాల్‌మెంట్ మొత్తం పెరిగిందా.. 

PM Kisan Scheme: దాదాపు అన్ని వర్గాల వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటిల్లో రైతులకు కూడా పీఎం కిసాన్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా.. అర్హులైన లబ్ధిదారులకు పంట పెట్టుబడికి మద్దతు అందించేందుకు ఆర్థిక సాయం అందిస్తుంది. దీని కింద ప్రతి సంవత్సరం భూమి ఉన్న అర్హులైన రైతులకు రూ. 6 వేల చొప్పున అందిస్తుంటుంది. దీనిని ప్రతి 4 నెలలకు ఓసారి 3 విడతల కింద రూ. 2 వేల …

Read More »

సల్మాన్ ఇంటిపై దాడికి ముందు.. షూటర్లకు గ్యాంగ్‌స్టర్ 9 నిమిషాలు మోటివేషన్ స్పీచ్!

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ ఇంటి వద్ద కాల్పుల ఘటనపై పోలీసులు విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సల్మాన్‌ హత్యకు జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కుట్ర పన్నినట్టు ముంబయి క్రైమ్ బ్రాంచ్ గుర్తించింది. ఈ ఘటనపై పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌‌షీట్‌లో కీలక అంశాలు బయబకు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్‌మోల్ బిష్ణోయ్.. కాల్పుల జరపడానికి ముందు షూటర్లకు మోటివేషన్ స్పీచ్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. నిందితులు విక్కీ గుప్తా, సాగర్ పాల్‌ ఇద్దరికీ అతడు 9 నిమిషాల పాటు …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రైల్వే లైన్..

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. మచిలీపట్నం నుంచి నర్సాపురానికి కొత్త రైల్వేలైన్‌ ఏర్పాటుకు కేంద్రంం ఆమోదం తెలిపింది. ఈ కొత్త రైలు మార్గం కోసం మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కేంద్రానికి ఇప్పటికే నివేదికలు సమర్పించగా.. తాజాగా ఆయన ప్రయత్నం ఫలించింది.. ఈ కొత్త లైన్‌కు కేంద్రం లైన్ క్లియర్ చేసింది. ఈ నూతన రైలు మార్గం మచిలీపట్నం నుంచి బంటుమిల్లి మీదుగా నిర్మాణం జరగబోతోంది. ముఖ్యంగా మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందంటున్నారు. 2024-25 కేంద్ర బడ్జెట్‌లో …

Read More »