Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో ముడా కుంభకోణం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ముడా భూముల కేటాయింపు వ్యవహారం ప్రస్తుతం.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చులా బిగుసుకుంటుండటంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో సీఎంపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడంతో.. సిద్ధరామయ్యను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం సిద్ధరామయ్య.. కర్ణాటక కేబినెట్‌ను అత్యవసరంగా భేటీకి పిలవడం ప్రస్తుతం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలోనే ముడా కుంభకోణం వ్యవహారంలో సీఎంపై విచారణకు అనుమతించడంతో …
Read More »Kolkata Trainee Doctor: బెంగాల్ ట్రైనీ డాక్టర్ హత్య కేసులో పోలీసుల ట్విస్ట్.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముందంటే?
Kolkata Trainee Doctor: పశ్చిమ బెంగాల్‌లో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం ఘటన మొత్తం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టంకు సంబంధించిన రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయని నెటిజన్లు కోడై కూస్తున్నారు. ఆ ట్రైనీ డాక్టర్‌పై గ్యాంగ్ రేప్ జరిగిందని.. ఆమె ఎముకలు విరిగిపోయాయని.. ఇక మరీ ముఖ్యంగా ఆమె శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉందని రకరకాల ఊహాగానాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయాలు వైరల్ కావడంతో …
Read More »పెళ్లి చేసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన జంటకు ట్విస్ట్.. పోలీసుల అదుపులో,
ఓ జంట పెళ్లి చేసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఇంతలో పోలీసులు సడన్ ఎంట్రీ ఇచ్చారు.. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందని ఆరా తీస్తే.. అప్పుడు అసలు సంగతి తెలిసింది. విజయవాడకు చెందిన సాంబశివరావు అలియాస్ శివ, అలేఖ్య ప్రేమించుకుంటున్నారు.. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. విజయవాడలోని భవానీపురం పోలీసు స్టేషన్‌లో అలేఖ్య కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కొత్త జంట తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్న విషయాన్ని గుర్తించిన భవానీపురం పోలీసులు తిరుచానూరు …
Read More »RBI: 3 బ్యాంకులకు సడెన్ షాకిచ్చిన ఆర్బీఐ.. కఠిన నిర్ణయం.. ఆ నిబంధనలు పాటించకపోవడంతో..!
Bank of Maharashtra: దేశంలోని అన్ని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనేది పెద్దన్న లాంటింది. ఇదే అన్ని నియంత్రణాధికారాలు కలిగి ఉంటుంది. ఆర్బీఐ ఆదేశాల్ని ఇవి తప్పక పాటించాల్సిందే. కస్టమర్ల పట్ల ఏ మాత్రం బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. తమకు తెలియకుండా ఏదైనా కొత్త నిబంధనలు తీసుకొచ్చినా ఆర్బీఐ ఊరుకోదు. కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. దీనిని ఫైన్ రూపంలో లేదా మరీ సమస్య తీవ్రంగా ఉంటే ఏకంగా బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసేందుకూ …
Read More »విండ్‌ఫాల్ టాక్స్ భారీగా తగ్గించిన కేంద్రం.. ఏకంగా 50 శాతం.. లేటెస్ట్ పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..
Latest Petrol Diesel Prices: దేశీయంగా ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం.. ఎప్పటి నుంచో విండ్‌ఫాల్ టాక్స్ విధిస్తున్న సంగతి తెలిసిందే. దీంట్లో క్రూడాయిల్, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ వంటివి ఉంటాయి. క్రూడాయిల్‌పైనే అత్యధికంగా కేంద్రం పన్ను విధిస్తుంటుంది. అంతర్జాతీయంగా రేట్లకు అనుగుణంగా ప్రతి నెలలో రెండు సార్లు దీనిని సవరిస్తుంటుంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఆగస్టు నెలలో ఒకటో తేదీన ఇప్పటికే ముడి చమురుపై విండ్‌ఫాల్ టాక్స్ కేంద్రం భారీగా తగ్గించగా.. …
Read More »రాహుల్ గాంధీ పౌరసత్వంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్.. కేంద్రం స్పందించాలని విజ్ఞప్తి
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి.. ఎప్పుడూ తన సొంత పార్టీపైనే విమర్శలు, మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయాలపై విమర్శలు చేస్తుండగా.. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషయంలో అటు కాంగ్రెస్ పార్టీని, ఇటు బీజేపీని రెండింటినీ ఇరకాటంలో పెట్టే పనిలో పడ్డారు. రాహుల్ గాంధీ సిటిజన్‌షిప్ గురించి చెప్పాలని.. గత కొన్నేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని సంప్రదించారు. అయితే కేంద్రం నుంచి రాహుల్ గాంధీ పౌరసత్వం గురించి ఎలాంటి స్పందన రాకపోవడంతో విసిగిపోయిన …
Read More »AP donation to Wayanad: కేరళకు అండగా ఏపీ.. వయనాడ్ బాధితులకు భారీ విరాళం
కేరళలోని వయనాడ్‌లో ఇటీవల సంభవించిన విపత్తు.. వందల కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో సుమారుగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయాలపాలయ్యారు. మరెంతో మంది కనిపించకుండా పోయారు. ప్రకృతి ప్రకోపంలో అనాథలుగా, అభాగ్యులుగా మిగిలిన వారెందరో. అయితే ఈ విపత్తు వేళ కేరళ ప్రభుత్వానికి ఏపీ అండగా నిలిచింది. వయనాడ్ బాధితుల కోసం ఏపీ ప్రభుత్వం రూ.10 కోట్లు విరాళంగా ప్రకటించింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని కేరళ ప్రభుత్వానికి విరాళంగా అందించింది. అయితే …
Read More »India Post GDS Merit List 2024 Live : తపాలశాఖలో 44,228 ఉద్యోగ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం..
India Post GDS Merit List 2024 Live : కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియా పోస్ట్ 2024 గత నెలలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగానే ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1,355 పోస్టులు.. తెలంగాణలో 981 Gramin Dak Sevak పోస్టుల వరకు ఉన్నాయి. అయితే.. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆగస్టు 5వ తేదీన గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ …
Read More »పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు.. మూడు దశల్లో పోలింగ్
రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రధాని ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి.. జమ్మూ కశ్మీర్, హరియాణా అసెంబ్లీల ఎన్నికల తేదీలను ప్రకటించారు. జమ్మూ కశ్మీర్‌లో 87 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. మూడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. తొలి విడత పోలింగ్ సెప్టెంబరు 18న రెండో విడత సెప్టెంబరు 25న, మూడో విడత అక్టోబరు 1న నిర్వహించనున్నారు. అక్టోబరు 4న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ …
Read More »TCS: ఏఐతో ఐటీ ఉద్యోగాలు పెరుగుతాయా? తగ్గుతాయా? భవిష్యత్తు సంగతేంటి? టీసీఎస్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు
TCS President V Rajanna: గత కొంత కాలంగా దేశంలోని దిగ్గజ ఐటీ సంస్థలు నియామకాలు తగ్గించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా ఐటీకి డిమాండ్ తగ్గిన నేపథ్యంలోనే కొత్తగా క్యాంపస్ రిక్రూట్మెంట్స్ చేపట్టకపోగా.. ఉన్న ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించుకున్నాయన్న సంగతి తెలిసిందే. భారత దిగ్గజ ఐటీ సంస్థలు.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా ఇలా అన్ని సంస్థల్లోనూ గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య తగ్గింది. ఆర్థిక మాంద్యం ప్రభావం కూడా దీనికి ఒక కారణం. మరోవైపు …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal