India Post GDS Merit List 2024 Live : కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియా పోస్ట్ 2024 గత నెలలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగానే ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1,355 పోస్టులు.. తెలంగాణలో 981 Gramin Dak Sevak పోస్టుల వరకు ఉన్నాయి. అయితే.. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆగస్టు 5వ తేదీన గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసింది. ఆగస్టు 6, 7, 8 తేదీల్లో దరఖాస్తు సవరణలకు తపాలా శాఖ అవకాశం కల్పించింది. ఈ ఎడిట్ ఆప్షన్ కూడా ఆగస్టు 8వ తేదీతో ముగిసింది. ఇక.. ఏక్షణమైనా India Post Gramin Dak Sevak Result విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు తపాలాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://indiapostgdsonline.gov.in/ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.
అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ పోస్టులకు సంబంధించి రిజల్ట్స్ ఈ వారంలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించరు. కేవలం 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. ఈ మెరిట్ లిస్ట్ ప్రకారం.. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తపాలా శాఖ సమాచారం అందిస్తుంది. దరఖాస్తులో అభ్యర్థి తెలియజేసిన మొబైల్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్, మెయిల్, పోస్టు ద్వారా సమాచారం వస్తుంది. అలాగే అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపిక జాబితాను పొందుపరుస్తారు. అభ్యర్థులు చెక్ చేసుకోవచ్చు.
మొదటి సెలక్షన్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు వివిధ కారణాల వల్ల విధుల్లో చేరకపోతే రెండో లిస్టును వెల్లడిస్తారు. రెండో లిస్టులో ఖాళీలు ఏర్పడితే మూడో లిస్టు, దీనిలోనూ చేరకపోతే నాలుగో లిస్టు విడుదల చేస్తారు. గత ఏడాది నాలుగు సెలక్షన్ లిస్టులు వచ్చిన సంగతి తెలిసిందే. 10వ తరగతి మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ప్రకటనలో అభ్యర్థి ఎంపిక చేసుకున్న బ్రాంచీ, హోదా, ప్రాధాన్యం ప్రకారం బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్ కేటాయిస్తారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ జనరేటెడ్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారనే విషయం తెలిసిందే.
ఇండియా పోస్టు్ జీడీఎస్ ఉద్యోగాల కోసం.. 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్ భారత ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల విద్యా మండలి నిర్వహించే గణితం, ఆంగ్లంలో ఉత్తీర్ణత మార్కులతో పాసై ఉండాలి. ఇక.. అభ్యర్థుల కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్ఠంగా 40 ఏళ్లకు మించకూడదు. అయితే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో కొంత సడలింపు ఉంటుంది. అయితే.. అభ్యర్థులకు కంప్యూటర్ నాలెడ్జ్‌తోపాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం) పోస్టులకు నెలకు రూ.12 వేల నుంచి రూ.29,380 వరకు జీతంగా చెల్లిస్తారు. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ పోస్టులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.24,470 వరకు జీతంగా చెల్లిస్తారు.