టెక్స్ టైల్ సెక్టార్ కంపెనీ అక్షిత కాటన్ లిమిటెడ్ ( Axita Cotton Limited) తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. బోనస్ షేర్ల జారీ ప్రకటన చేసింది. ఈ బోనస్ షేర్లు జారీకి కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపినట్లు స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో వెల్లడించిది. అలాగే గతంలో నిర్ణయించిన రికార్డు తేదీ సెప్టెంబర్ 16ను సెప్టెంబర్ 20 కి మార్చినట్లు పేర్కొంది. అలాగే ఈ కంపెనీ షేరు గత మూడేళ్లో 561 శాతం మేర పెరిగి మల్టీబ్యాగర్ రిటర్న్స్ …
Read More »అంబానీ, అదానీ కానేకాదు.. దేశంలో బెస్ట్ కంపెనీగా ఆ టెక్ సంస్థ..!
ఈ సంవత్సరానికి సంబంధించి ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీల జాబితాను విడుదల చేసింది టైమ్స్ మ్యాగజైన్. టైమ్ బెస్ట్ కంపెనీస్ 2024 పేరుతో లిస్ట్ విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1000 కంపెనీలను చేర్చింది. టైమ్ బెస్ట్ కంపెనీల లిస్టులో ఈసారి భారత్ నుంచి మొత్తంగా 22 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. అయితే, దేశీయ కంపెనీలలో బెస్ట్ కంపెనీగా ఏ అదానీ సంస్థనో, ముకేశ్ అంబానీ సంస్థనో ఉంటుందని అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. దిగ్గజ సంస్థలన్నింటినీ వెనక్కి నెట్టి ఓ …
Read More »ఎట్టకేలకు దిగొచ్చిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్.. వారందరికీ ఉద్యోగాలు.. ఇప్పటికే ఆఫర్ లెటర్స్!
ఐటీ ఉద్యోగుల్లో కొంత కాలంగా గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. చాలా వరకు.. లేఆఫ్స్ ప్రభావం తమపై ఉంటుందని కంగారుగా ఉన్నారు. కారణం.. ఏడాది వ్యవధిలో దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య వరుసగా తగ్గుతుండటమే. అతిపెద్ద భారత ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా ఇలా అన్ని కంపెనీల్లోనూ గత ఆర్థిక సంవత్సరంలో భారీగా ఉద్యోగులు తగ్గిపోయారు. ఇదే సమయంలోనే అసలు నియామకాల ఊసే లేదు. దీంతో ఫ్రెషర్లు తీవ్ర ఆందోళన చెందారు. ఇప్పటి సంగతి పక్కనబెడితే.. దిగ్గజ …
Read More »అంబానీనా మజాకా.. గూగుల్, యాపిల్‌కు గట్టి షాక్ ఇచ్చిన జియో.. దెబ్బకు దిగిరానున్న ధరలు!
Cloud Storage Pricing: ఇటీవల జరిగిన రిలయన్స్ ఏజీఎం (యాన్యువల్ జనరల్ మీట్) లో రిలయన్స్ ఇండస్ట్రీస్ బాస్ ముకేశ్ అంబానీ కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు. దీపావళి నుంచి 100 GB వరకు క్లౌడ్ స్టోరేజీని ఫ్రీగా అందించనున్నట్లు.. ఇది వెల్‌కం ఆఫర్ కింద వర్తిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఈ విభాగంలో ఇప్పటికే కీలకంగా ఉన్నటువంటి గూగుల్, యాపిల్ సంస్థలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయిందని పేర్కొన్నారు విశ్లేషకులు. జియో ఎంట్రీతో.. ఇక క్లౌడ్ స్టోరేజీ …
Read More »గంటకు రూ. 4 వేలు.. రోజుకు 28 వేల జీతం.. బంపరాఫర్.. ఏం పని చేయాలి.. అర్హతలేంటి?
Elon Musk Optimus: ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్. ఈయన సంపద బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఏకంగా 245 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈయనకు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. రెండో స్థానంలో ఉన్న అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ సంపద 201 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎప్పుడూ చిత్రవిచిత్ర ప్రకటనలు చేసే ఎలాన్ మస్క్.. ఇప్పుడు కూడా అదే చేశారు. ఇక ఇప్పుడు మస్క్ నేతృత్వంలోని దిగ్గజ ఎలక్ట్రిక్ …
Read More »ఇకపై సరికొత్త టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్లు.. సిగ్నల్ లేకపోయినా కాల్స్, ఇంటర్నెట్..?
నేటి ఆధునిక సాంకేతిక యుగంలో.. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా మారుతున్న కాలానుగుణంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలుకుతోంది. ఈ క్రమంలోనే వివో, జియోమి, హువాయ్ వంటి మొబైల్ తయారీ సంస్థలు త్వరలో ఎలాంటి నెట్‌వర్క్ లేకుండా పనిచేసే మొబైల్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం. స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడు అడవిలో ఉన్నా లేదా పర్వతాలపై ఉన్నా నెట్‌వర్క్ అవసరం లేదు. ఎలాంటి నెట్‌వర్క్ లేకుండానే కాలింగ్, ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ కంపెనీలు తన నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ గ్యాడ్జెట్ శాటిలైట్ ఆధారిత …
Read More »వారందరికీ నోటీసులు పంపుతోన్న ఐటీ శాఖ.. రూ.6 లక్షలు దాటితే అంతే..!
Remittance: మీరు విదేశాలకు డబ్బులు పంపిస్తున్నారా? ట్యాక్స్ తప్పించుకునేందుకు అడ్డదారులు అనుసరిస్తే మీకు నోటీసులు రావచ్చు. తాజాగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 6 లక్షలు ఆపైన ఫారెన్ రెమిటెన్స్ (విదేశీ చెల్లింపులు) ట్రాన్సక్షన్లపై సమగ్ర పరిశీలన చేయనుంది. విదేశాలకు రూ. 6 లక్షలకు మించి డబ్బులు పంపిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టనుంది. ఫారెన్ రెమిటెన్స్‌లో ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు చాలా మంది అడ్డదారులు తొక్కుతున్నారని ఐటీ శాఖ దృష్టికి వచ్చిన క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత …
Read More »గూగుల్ పే, ఫోన్ పే వాడేవారికి అలర్ట్.. ఆ బ్యాంక్ UPI సేవలు బంద్.. షెడ్యూల్ టైమ్ ఇదే!
Maintenance Schedule: మన దేశంలో డిజిటల్ పేమెంట్లు భారీగా జరుగుతున్నాయి. అందులో ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ విరివిగా ఉపయోగిస్తున్నారు. గ్రామీణా ప్రాంతాల్లోనూ యూపీఐ పేమెంట్స్ భరీగా పెరిగాయని చెప్పవచ్చు. ఇతర దేశాలకు సైతం యూపీఐ సేవలు విస్తరించాయంటే ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, బ్యాంక్ కస్టమర్లు తమ బ్యాంక్ ప్రకటనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. లేదంటే యూపీఐ సేవలు అందుబాటులో లేక ఇబ్బందులు పడాల్సి …
Read More »అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్.. మొబైల్స్‌పై 40 శాతం డిస్కౌంట్.. ఈ స్మార్ట్‌ఫోన్‌లు డిస్కౌంట్‌లో పొందొచ్చు!
స్మార్ట్‌ఫోన్, టీవీలపై డిస్కౌంట్ ఎదురుచూస్తున్న వినియోగదారులకు గుడ్‌న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) మరో సేల్‌కు సిద్ధమైంది. ఇటీవల ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేకంగా ప్రైమ్ డే సేల్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ సంస్థ.. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Freedom Festival Sale) నిర్వహించనుంది. ఆగస్టు 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు 6వ తేదీ అర్ధరాత్రి నుంచి, …
Read More »క్రెడిట్ స్కోరు తక్కువుందా.. లోన్ అస్సలు రావట్లేదా? ఈ అపోహలు వీడితేనే తక్కువ వడ్డీకి రుణాలు!
లోన్లపై వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్న వారికి మాత్రం వడ్డీలో రాయితీ ఇస్తామని బ్యాంకులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచి స్కోరు సాధించే క్రమంలోనే క్రెడిట్ స్కోరుపై చాలా మందిలో ఎన్నో అపోహలు ఉంటాయి. వీటిని వీడాల్సిన అవసరం ఉంది. చాలా మంది కొత్తగా ఉద్యోగంలో చేరిన వెంటనే.. వారి వారి అవసరాల నిమిత్తం వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల్ని తీసుకుంటున్నారు. కార్డు తీసుకోగానే మురిసిపోవద్దు. దానిని సరిగ్గా నిర్వహించగలగాలి. సమయానికి బిల్లు చెల్లించగలగాలి. …
Read More »