తెలుగు రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బీభత్సం సృష్టించింది. ఈ వాయుగుండం శనివారం అర్ధరాత్రి దాటాక శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో 10 కిలోమీటర్ల వేగంతో తీరం దాటిన సంగతి తెలిసిందే. ఈ వాయుగుండం భూభాగంలోకి వచ్చాక వేగం 20 కిలోమీటర్లకు పెరిగింది. ప్రసుత్తం దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఈ వాయుగుండం రాబోయే 24 గంటల్లో ఇది దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ (మహారాష్ట్ర) వైపు కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే రుతుపవన ద్రోణి వాయుగుండం కేంద్రం …
Read More »సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ ఫోన్.. వరదలపై ఆరా, ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులను, జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో భారీ వర్షం, వరదతో వాటిల్లిన నష్టం ప్రాథమిక వివరాలను సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని, తక్షణ సహాయక చర్యలు చేపట్టామని, ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి తెలియజేశారు. కేంద్ర …
Read More »తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి కీలక సూచనలు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న మెగాస్టార్ చిరంజీవితెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కరుస్తున్నాయని.. వరదల ప్రభావం ఎక్కువగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సోషల్ మీడియా వేదికగా సూచించారు. ‘ తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే.. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు …
Read More »ప్రజలకు రెడ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి. కొన్ని ప్రాంతాల్లో పోటెత్తుతున్న వరదలతో.. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో.. జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలదిగ్భందమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి. కొన్ని ప్రాంతాల్లో పోటెత్తుతున్న వరదలతో.. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో.. జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలదిగ్భందమయ్యాయి. ఎలాంటి ప్రయాణాలైనా …
Read More »ఆగకుండా కురుస్తోన్న వర్షం.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వానలు, వాతావరణశాఖ హెచ్చరికలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా వైపుగా కదులుతున్న వాయుగుండం తీవ్రంగా బలపడింది. కళింగపట్నానికి దక్షిణంగా 30కి.మీ, విశాఖకు ఈశాన్యంగా 90 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండ్రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, …
Read More »ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటికి ‘హైడ్రా’ నోటీసులు..?
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించి ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో నిర్మించిన కట్టడాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఎవ్వరినీ లెక్క చేయకుండా బుల్డోజర్లు పంపిస్తున్నారు. దీంతో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇక ఇప్పటికే కొందరు అక్రమ నిర్మాణదారులకు హైడ్రా అధికారులు నోటీసులు పంపారు. మాదాపూర్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఇళ్లు నిర్మించుకున్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సైతం హైడ్రా అధికారులు నోటీసులు పంపారు. ఇక …
Read More »నారా లోకేష్ ‘రెడ్ బుక్’కు N-కన్వెన్షన్ కూల్చివేతకు లింక్.. గాదె ఇన్నయ్య సంచలన కామెంట్స్
ప్రస్తుతం హైడ్రా (HYDRA) అనేది.. టాక్ ఆఫ్ ది సిటీగానే కాకుండా.. స్టేట్ మొత్తం హాట్ టాపిక్‌గా మారిపోయింది. కేవలం తెలంగాణ వరకే కాకుండా.. పక్క రాష్ట్రాల్లోనూ హైడ్రా గురించి చర్చ నడుస్తోందంటే.. బుల్డోజర్ల ప్రభావం గట్టిగానే పడిందని అర్థమవుతోంది. అందుకు కారణం.. చెరువులు, కుంటలతో పాటు ప్రభుత్వ భూములు కాపాడుకోవాలన్న లక్ష్యంతో ఏర్పడిన హైడ్రా.. సామాన్యులా, సెలెబ్రిటీలా, రాజకీయ ప్రముఖులా అనేది చూడకుండా.. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా.. అక్రమకట్టడాలపై బుల్డోజర్లు ప్రయోగిస్తుండటమే. ముఖ్యంగా.. టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ …
Read More »హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐఎండీ అధికారులు హైదరాబాద్‌కు భారీ వర్షం హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు వాతావారణ కేంద్రం అధికారులు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం …
Read More »గచ్చిబౌలిలో ప్రేమోన్మాది ఘాతుకం.. బ్యూటీషియన్ దారుణ హత్య
హైదరాబాద్‌లో ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రేమను అంగీకరించలేదని ఓ యువతిపై కత్తితో దాడిచేసి.. ప్రాణాలు తీశాడు. బుధవారం రాత్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు యువతులు గాయపడ్డారు. అనంతరం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన నిందితుడు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం… కర్ణాటకలోని బీదర్‌కు చెందిన నిందితుడు రాకేశ్, మాదాపూర్‌లోని ఓ ప్రయివేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు. పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన దీపన తమాంగ్ (25) అనే యువతి …
Read More »హైడ్రా మరో సంచలనం.. సీఎం రేవంత్ సోదరుడి ఇంటికి నోటీసులు!
రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువుల కబ్జాలను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. బుధవారం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసులను అంటించారు. మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న ఇల్లు, కార్యాలయం దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు ఆ నోటీసుల్లో తెలిపారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన ఆ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలని స్పష్టం చేసిన రెవెన్యూ అధికారులు.. అందుకు 30 రోజుల గడువు ఇచ్చారు. రంగారెడ్డి …
Read More »