తెలంగాణ

విద్యార్థులను భుజాన ఎక్కించుకుని వరద ప్రవాహాన్ని దాటించిన మాస్టారు

ఉపాధ్యాయుడంటే కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉన్న విషయాలను బోధించటమే కాదు.. విద్యార్థులకు మంచి చెడుల వ్యత్యాసాన్ని నేర్పించి.. మంచి మార్గాన్ని చూపించటం కూడా. అవసరమైతే.. చేయి పట్టుకుని ఆ మార్గం వెంట నడిపించి గమ్యం చేరేలా చేయటం కూడా గురువు బాధ్యతే. అచ్చంగా అదే పని చేశాడు ఓ ఉపాధ్యాయుడు. విద్యార్థులను తమతమ జీవితాల్లో గమ్యాలను చేర్పించటం ప్రస్తుత కాలంతో కొంచెం కష్టమైన విషయమే కానీ.. అడ్డుగా నిలిచిన వరద ప్రవాహాన్ని సురక్షితంగా దాటించి గమ్యస్థానాలకు చేర్చి.. మా మంచి మాస్టారు అనిపించుకున్నాడు. కుమురం భీం …

Read More »

ఎల్ఆర్ఎస్‌ కొత్త విధివిధానాలు.. రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం..!

తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన “లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం”(LRS) అమలుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలపై తీవ్ర భారం పడనుందంటూ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో విమర్శించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త విధివిధానాలు (LRS Guidelines) తీసుకురావాలని యోచిస్తోంది. ఈ మేరకు.. ఎల్‌ఆర్‌ఎస్‌ అమలుపై సచివాయలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఎల్ఆర్‌ఎస్ విధివిధానాల‌ కసరత్తుపై సమీక్షించారు. ఎల్‌ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు …

Read More »

ట్రైన్ ప్రయాణికులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల మధ్య పలు రైళ్లు రద్దు

తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు ట్రైన్ ప్రయాణాలు సాగించేవారికి సౌత్ సెంట్రల్ రైల్వే అలర్ట్ ఇచ్చింది. పలు ట్రైన్లు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా సికింద్రాబాద్‌-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లతో పాటు మరికొన్ని ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సెంట్రల్‌ రైల్వే జోన్‌ పరిధిలోని దౌండ్‌ మార్గంతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వేలోని విజయవాడ డివిజన్‌లోనూ మూడో ట్రైన్ లైను పనుల కారణంగా ప్రయాణికులకు ట్రైన్ సేవల్లోనూ అంతరాయం …

Read More »

రాశిఫలాలు 20 జూలై 2024

horoscope today 20 July 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై పూర్వాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో చతుర్దశి తిథి రోజున ద్విగ్రాహి యోగం, రవి యోగం, శుక్రాదిత్య యోగం వంటి శుభ యోగాలతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల …

Read More »

లాసెట్, పీజీ ఎల్సెట్ ఫలితాలు విడుదల..

తెలంగాణ లాసెట్/ పీజీ ఎల్‌సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ ప్రొఫెస‌ర్ లింబాద్రి ఫలితాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల కోసం 50,684 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మూడేళ్ల లా కోర్సు కోసం 36,079 మంది, ఐదేళ్ల లా కోర్సు కోసం 10,197 మంది, ఎల్‌ఎల్‌ఎం పరీక్ష కోసం 4,408 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 50,684 మంది అభ్యర్థులకు గాను.. 40,268 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో 72.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. టీజీ లాసెట్ …

Read More »

మృతదేహాన్ని రోడ్డుపైనే వదిలేసి బంధువులు..?

ఓ వ్యక్తి చనిపోవడంతో అతడి అంతిమయాత్రను నిర్వహించారు కుటుంబీకులు. అయితే.. ఇంటి నుంచి స్మశానం వరకు డప్పుచప్పుళ్లతో బాణసంచాలు కాల్చుతూ సదరు వ్యక్తి భౌతికకాయాన్ని తీసుకువెళ్తున్నారు బంధువులు. అయితే.. అంతిమయాత్ర ఊరేగింపు కొనసాగుతుండగా.. బాంబులు పేల్చడంతో.. అక్కడ సమీపంలో ఉన్న తేనెతెట్టుకు తగిలింది. ఇంకేముంది.. ఆ తేనెతెట్టుకున్న తేనటీగలు ఒక్కసారిగి అంతిమయాత్ర ఊరేగింపులో ఉన్న జనాలపై దాడి చేయడం ప్రారంభించారు. దీంతో.. అంతిమయాత్రలోని మృతదేహాన్ని రోడ్డుపైనే వదిలేసి బంధువులు తలోవైపు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెంలో రుద్రారపు వీరస్వామి …

Read More »