తెలంగాణ

తిరుపతి లడ్డూ వివాదంపై బండి సంజయ్ ఘాటు స్పందన.. చంద్రబాబుకు స్పెషల్ రిక్వెస్ట్

దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ముఖ్యంగా శ్రీవారి ప్రసాదమైన లడ్డూకు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే.. ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు లడ్డూపై నిన్న(సెప్టెంబర్ 18న) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని హిందువుల్లో ఆందోళన రేకెత్తించటంతో పాటు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తిరుపతి లడ్డూ ప్రసాద తయారీలో జంతువుల కొవ్వుతో తీసిన నెయ్యిని కలిపి.. తిరుమల శ్రీవారి ప్రతిష్టను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగజార్చిందంటూ చంద్రబాబు ఘాటు ఆరోపణలు చేయటం ఇప్పుడు …

Read More »

బాబు చిట్టీ.. అక్కడ మార్కులు పడ్డాయిగా.. ఇక ఇక్కడ దృష్టి పెట్టు.. కేటీఆర్ సెటైరికల్ ట్వీట్

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రైతు రుణమాఫీ, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, ఇటీవల రాజీవ్ గాంధీ విగ్రహం ఇలా పలు అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శల పర్వం నడుస్తోంది. కాగా.. ఇప్పుడు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఒకే నెలలో ఏకంగా 48 మంది శిశువులు, 14 మంది బాలింతలు ప్రాణాలు వదిలినట్టు ఉన్న రిపోర్టులపై వాడీ వేడిగా చర్చ నడుస్తోంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్.. తప్పుడు లెక్కలు చెప్తోందని.. అసలు మరణాల సంఖ్యను దాచిపెడుతోందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. …

Read More »

అక్కడి ప్రాజెక్టులపై ‘హైడ్రా’ గురి.. పక్కా ఆధారాలతో కూల్చివేతలకు సిద్ధం..!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) ఉక్కుపాదం మోపుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నగరంలోని వందల కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తిరిగి సర్కారుకు అప్పగించారు. ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. కూల్చివేతలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటంతో.. పక్కా ఆధారాలతో కూల్చేవేతలు చేపట్టాలని హైడ్రా భావిస్తోంది. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలకు చెందిన ‘లేక్‌ వ్యూ’ ప్రాజెక్టులపై ప్రస్తుతం హైడ్రా ఫోకస్ …

Read More »

డీఎస్పీగా మహిళా బాక్సర్ నిఖత్ జరీన్.. వెల్‌కమ్ చెప్పిన తెలంగాణ డీజీపీ

భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బుధవారం తెలంగాణ డీజీపీ జితేందర్‌ను కలిసిన జరీన్.. తన జాయినింగ్ రిపోర్టును సమర్పించారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ డిపార్ట్‌మెంట్‌లోకి ఆమెకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, ఒలింపిక్ అథ్లెట్ నిఖత్ జరీన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ పోలీస్)గా కొత్త పాత్రను స్వీకరించినందున శుభాకాంక్షలు తెలిపుతూ.. ఆమెను …

Read More »

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది, మూడు నెలల్లో పూర్తి

దేశంలోనే రెండో అతిపెద్ద లింక్ ఫ్లైఓవర్ యాదాద్రిలో ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో మెకలై స్టీల్‌తో ఈ లింక్ ఫ్లైఓవర్ నిర్మించనున్నట్లు చెప్పారు. ఇది ఇండియాలోనే ఇది రెండో అతి పొడవైనదని.. మూడు నెలల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. బుధవారం (సెప్టెంబరు 18) తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YTDA), రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం …

Read More »

బీఆర్ఎస్‌కు హైకోర్టులో చుక్కెదురు.. పార్టీ ఆఫీస్ కూల్చేయాలని ఆదేశం

బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో షాక్ తగిలింది. నల్గొండ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. పార్టీ నాయకులే కార్యాలయానికి కూల్చివేయాలని.. లేదంటే మున్సిపల్ శాఖ అధికారులు కూల్చేశారని హెచ్చరించింది. పార్టీ ఆఫీసును రెగ్యులర్ చేసేలా మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆఫీస్ నిర్మాణం చేయకముందు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి కదా..? అని ప్రశ్నించింది. పార్టీ ఆఫీసు నిర్మించిన తర్వాత ఎలా అనుమతి ఇస్తారని పిటిషనర్‌ను …

Read More »

గంగ ఒడికి గణనాథుడు

హైదరాబాద్‌లో మహా నిమజ్జనం ప్రశాంతం ఈసారి పూర్తిగా నీళ్లలో ఖైరతాబాద్‌ గణేశుడు 25 అడుగుల లోతు.. 35 అడుగుల వెడల్పుతో వారం రోజులుగా పూడిక తీయడంతోనే రూ.30.01 లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డూ పలుచోట్ల రూ.10 లక్షలు దాటిన వేలం నిమజ్జనం తీరుపై పొన్నం ఏరియల్‌ వ్యూ ఎన్‌టీఆర్‌ మార్గ్‌కు సీఎం.. ఏర్పాట్ల పరిశీలన పారిశుధ్య కార్మికులు, క్రేన్‌ ఆపరేటర్లతో మాట నిమజ్జనంపై ప్రభుత్వ వ్యవస్థల పనితీరు భేష్‌.. రేవంత్‌ పర్యవేక్షణ అభినందనీయం: రాజాసింగ్‌ ‘గణేశ్‌ మహరాజ్‌ కీ జై’.. ‘గణపతి బొప్పా మోరియా.. …

Read More »

హమ్మయ్యా.. తగ్గిన బంగారం ధర.. వెండి రూ.1000 డౌన్.. 

బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త. నాలుగు రోజుల పాటు వరుసగా పెరుగుతూ బెంబేలెత్తించిన పసిడి ధరలు ఇవాళ దిగివచ్చాయి. క్రితం రోజుతో పోలిస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు రికార్డ్ గరిష్ఠాల నుంచి తగ్గుముఖం పడుతున్న క్రమంలో దేశీయంగా ఆ ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల ముహూర్తాలు లేకపోవడంతోనూ కొనుగోళ్లు కాస్త స్తబ్దుగా కొనసాగుతున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, పండగల సీజన్ మొదలైన క్రమంలో దేశీయంగా బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. గత ఆగస్టు …

Read More »

త్వరలోనే అన్ని గ్రామాలకు ఇంటర్నెట్.. 20 MB స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా.. మంత్రి తీపికబురు

తెలంగాణ వాసులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ వినిపించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే తెలంగాణలోని అన్ని గ్రామాలకు ఫైబర్‌ నెట్‌వర్క్‌ అందుబాటులోకి తీసుకొచ్చి ఇంటర్నెట్‌ కనెక్షన్ల సదుపాయం కల్పించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు కీలక ప్రకటన చేశారు. మంగళవారం (సెప్టెంబర్ 17న) రోజున కరీంనగర్‌లో ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న తర్వాత.. స్థానిక ఆర్‌ అండ్‌ బీ గెస్టు హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కీలక ప్రకటన చేశారు. తెలంగాణలోని అన్ని గ్రామాలకు …

Read More »

అందరి చూపు సెప్టెంబర్ 17వైపే.. ఓవైపు నిమజ్జనం, మరోవైపు విమోచనం.. సర్వత్రా ఉత్కంఠ..!

ప్రస్తుతం తెలంగాణ ప్రజలందరి దృష్టి సెప్టెంబర్ 17 పైనే ఉంది. ఆరోజు హైదరాబాద్‌లో వాతావరణ పరిస్థితులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓవైపు.. సెప్టెంబర్ 17వ తేదీనే హైదరాబాద్‌లో మహానిమజ్జన కార్యక్రమం జరగనుంది. ఖైరతాబాద్ మహా గణపతితో పాటు నగర వ్యాప్తంగా ఉన్న బడా గణేషులు మంగళవారం రోజునే హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం కానున్నాయి. కాగా.. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం కూడా ఉండటంతో.. రాజకీయ కార్యక్రమాలు కూడా జోరుగా జరగనున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఈరోజున వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. …

Read More »