తిరుమల లడ్డూ వివాదంపై బిగ్ అప్డేట్.. రంగంలోకి సీబీఐ సిట్, టీమ్‌లో నలుగురు సభ్యుల వివరాలివే

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై బిగ్ అప్డేట్ వచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సీబీఐ నేతృత్వంలోని సిట్ విచారణ ప్రారంభించింది. ఈ సిట్‌లో‌ సభ్యులుగా సీబీఐ నుంచి ఎస్వీ వీరేష్ ప్రభు (హైదరాబాద్‌లో ఏజెన్సీ జాయింట్ డైరెక్టర్), మురళీ రంభ (విశాఖపట్నంలోని సీబీఐ ఎస్పీ)లను నియమించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి, గోపీనాథ్ జెట్టి (డీఐజీ, విశాఖపట్నం రేంజ్)లను సిట్ సభ్యులుగా నియమించింది. అయితే ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఏ.ఐ నుంచి సభ్యుడిని ప్రకటించాల్సి ఉంది. సీబీఐ డైరక్టర్‌ పర్యవేక్షణలో సిట్ బృందం విచారణ చేయనుంది.

సిట్ నెయ్యి యొక్క కల్తీ రేటెడ్ నమూనాలపై ప్రయోగశాల నివేదికలను పరిశీలిస్తోంది. FSSAI, సెంటర్ ఆఫ్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్‌స్టాక్ అండ్ ఫుడ్ (CALF) నుండి జూలై నాటి ల్యాబ్ నివేదికలను SIT పరిశీలించినట్లు తెలుస్తోంది. గ్రౌండ్ లెవల్ విచారణ కోసం ఈ బృందం త్వరలో తిరుమలకు వచ్చే అవకాశం ఉంది. సిట్‌లో భాగమైన సీబీఐ అధికారులు ఎస్ వీరేష్ ప్రభు (హైదరాబాద్‌లో ఏజెన్సీ జెటి డైరెక్టర్), మురళీ రంభ (విశాఖపట్నంలోని సిబిఐ ఎస్పీ). త్వరలో ఈ బృందం తిరుమలకు రానున్నారు. సుప్రీం కోర్టు అక్టోబర్ 4న ఇద్దరు సీబీఐ అధికారులు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సీనియర్‌ పోలీసు అధికారులు, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఒక అధికారితో కూడిన ఐదుగురు సభ్యుల సిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరిపిన జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ సిట్ టీమ్‌లో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒక సీనియర్‌ అధికారి సభ్యులుగా ఉండాలని సుప్రీం కోర్టు ధర్మాసనం సూచించింది. స్వతంత్ర సిట్‌ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షిస్తారని.. తిరుమల శ్రీవారి కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది సుప్రీం కోర్టు.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం రేగింది. దేశవ్యాప్తంగా లడ్డూ ప్రసాదంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో సిట్ ఏర్పాటు కాగా.. ఆ తర్వాత నుంచి లడ్డూ అంశంపై పెద్దగా ఎక్కడా చర్చ జరగలేదు.

About amaravatinews

Check Also

ఈ సారి భారతరత్న దక్కేది ఎవరికి? రేసులో ముందున్న ఆ ఇద్దరు..!

రిపబ్లిక్ డే వేళ భారతరత్న ఈ సారి ఎవరికి ఇవ్వబోతున్నారన్న చర్చ మొదలయ్యింది. గత ఏడాది భారతరత్న చరిత్రలోనే అత్యధికంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *