Green Card: అమెరికాలోని భారతీయులకు షాకివ్వనున్న ట్రంప్.. 10 లక్షల మందికి గ్రీన్ కార్డులు లేనట్లే

Green Card: మొదటి నుంచి అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకు వెళ్తున్న డొనాల్డ్ ట్రంప్.. ఈసారి కూడా అదే మంత్రం పఠిస్తున్నారు. అమెరికాలోని ఉద్యోగ ఉపాధి అవకాశాలు.. అమెరికన్లకే చెందాలి అనేది ట్రంప్ వాదన. ఈ క్రమంలోనే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ట్రంప్.. ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన గ్రీన్ కార్డు హోల్డర్లపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. గ్రీన్ కార్డు నిబంధనలు మార్చేందుకు ట్రంప్ యోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న 10 లక్షల మంది భారతీయులపై ఆ ప్రభావం పడనున్నట్లు అక్కడి వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇప్పటివరకు అమెరికా నిబంధనల ప్రకారం.. చట్టబద్ధంగా ఆ దేశానికి వెళ్లి అక్కడ స్థిరపడిన వలసదారులు గ్రీన్ కార్డు పొందినట్లైతే.. వారికి పుట్టే పిల్లలకు కూడా పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అయితే ఇప్పుడు ఈ విధానానికే డొనాల్డ్ ట్రంప్ స్వస్తి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. అమెరికాలో కొత్తగా తీసుకురానున్న గ్రీన్ కార్డ్ రూల్స్ ముసాయిదా ప్రతిపాదన ప్రకారం.. అమెరికాలోని చట్టబద్ధమైన వలసదారులకు పుట్టబోయే పిల్లలు.. పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం పొందాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా అమెరికా పౌరుడు లేదా చట్టబద్ధంగా శాశ్వత నివాసి అయి ఉండాల్సిందేనని తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదన చట్టపరంగా పెను సవాళ్లను ఎదుర్కొవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికాలో పుట్టిన పిల్లలందరికీ ఇస్తున్న పౌరసత్వ హామీకి వ్యతిరేకంగా ఉందని చెబుతున్నారు.

అయితే గ్రీన్ కార్డ్ రూల్స్‌లో తీసుకురానున్న ఈ మార్పు కారణంగా 10 లక్షల మంది భారతీయులపై ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్‌లో చిక్కుకున్నందున.. ఈ ప్రణాళిక ప్రవాస భారతీయులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గత కొన్నేళ్లుగా అమెరికాలో టెక్ ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహిస్తున్న భారతీయ కుటుంబాలు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే న్యాయ నిపుణులు మాత్రం ఈ ప్రతిపాదన కోర్టులో చెల్లుబాటు కాదని అంటున్నారు. హెచ్-1బి వీసాల్లో ఉన్న చట్టబద్ధమైన వలసదారుల పిల్లలు ఇప్పటికీ పుట్టుకతో అమెరికా పౌరసత్వానికి అర్హులని ఇమ్మిగ్రేషన్ అటార్నీ రాజీవ్ ఎస్ ఖన్నా వెల్లడించారు.

About amaravatinews

Check Also

75వ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రధాని మోదీకి, దేశవిదేశాల నుంచి శుభాకాంక్షల వెల్లువ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. దేశవిదేశాలకు చెందిన ప్రతి ఒక్కరూ ప్రధాని మోదీకి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *