తక్కువ ధరకే గదులు అద్దెకు లభిస్తుండటంతో చాలా మంది ఓయో రూమ్స్ వినియోగిస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేవారు ఓయో రూముల్లో స్టే చేస్తూ తమ పనులు ముగించుకుంటున్నారు. ఇక యువత కూడా ఓయో రూములను ఎక్కవగా వినియోగిస్తుున్నారు. అయితే ఈ ఓయో రూమ్స్ తీసుకునే జంటలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొందరు కేటుగాళ్లు ఓయో రూముల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి జంటలు ఏకాంతంగా గడిపే వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. ఆపై డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు.
హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో ఇటువంటి ఘటనే వెలుగు చూసింది. శంషాబాద్‌లో సిటా గ్రాండ్ ఓయో హోటల్ గదిలో సీక్రెట్ సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు నిర్వహకుడు. గదిలోని ఎలక్ట్రిక్ బల్బ్‌లలో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశఆడు. రూమ్ అద్దెకు తీసుకున్న జంటల కార్యకలపాలతో పాటు ఏకాంతంగా గడిపిన వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. అనంతరం జంటలకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్నాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు.
ఇటీవల ఓ జంట సిటా గ్రాండ్ ఓయో రూంకు వెళ్లగా.. అక్కడ ఏకాంతంగా గడిపిన వీడియోలను హోటల్ నిర్వహకుడు ఏపీలోని ఒంగోలుకు చెందిన గణేష్ సీక్రెట్ కెమెరాలో రికార్డ్ చేశారు. అనంతరం వారికి కాల్ చేసి డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. దీంతో బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు ఓయో హోటల్‌పై పోలీసులు రైడ్స్ చేశారు. గదులను క్షుణ్ణంగా తనిఖీ చేసి సీక్రెట్ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. హోటల్ నిర్వాకుడు గణేష్‌ను అదుపులోకి తీసుకొని అతడిపై కేసులు నమోదు చేశారు.