డీఎస్పీ హోదాలో క్రికెటర్ మహమ్మద్ సిరాజ్.. లుక్ అదుర్స్

టీమిండియా ఆటగాడు, హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్.. డీఎస్పీగా (డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌) బాధ్యతలు స్వీకరించారు. ఖాకీ డ్రెస్సు ధరించి, చేతిలో లాఠీ పట్టిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహ్మద్‌ సిరాజ్‌.. శుక్రవారం (అక్టోబర్ 12) తెలంగాణ డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ను కలిసి రిపోర్ట్‌ చేశారు. ఆయన చేతుల మీదుగా జాయినింగ్ లెటర్‌ను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు మహేష్ భగవత్, రమేశ్‌తో పాటు ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు. టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టులో సభ్యుడైన మహ్మద్ సిరాజ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గ్రూప్-1 ఉద్యోగంతో పాటు, 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించిన సంగతి తెలిసిందే. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సిరాజ్‌కు గ్రూప్‌-1 అధికారిగా ఉద్యోగం ఇచ్చారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 78లో సిరాజ్‌కు రెవెన్యూ అధికారులు 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించారు.

నిరుపేద కుటుంబానికి చెందిన మహ్మద్ సిరాజ్‌ ఎంతో కష్టపడి పైకెదిగారని, భారత క్రికెట్‌ జట్టులో స్థానం సంపాదించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కొనియాడారు. హైదరాబాద్ నగరానికి ఖ్యాతి తెచ్చిపెట్టారని ప్రశంసించారు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే సిరాజ్‌కు గ్రూప్‌-1 అధికారిగా ఉద్యోగం కల్పించామని చెప్పారు.

About amaravatinews

Check Also

ఫిష్ వెంకట్‌కు టాలీవుడ్ హీరో ఆర్థిక సాయం.. ఎన్ని లక్షలు పంపాడంటే?

టాలీవుడ్ ప్రముఖ తెలుగు నటుడు, కామెడీ విలన్‌ ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. కిడ్నీ సంబంధిత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *