మిస్టర్ బచ్చన్ సినిమాకు సోషల్ మీడియాలో వస్తోన్న రెస్పాన్స్ గురించి అందరికీ తెలిసిందే. హరీష్ శంకర్ తీసిన వాటిల్లో అత్యంత చెత్త సినిమా ఇదే అవుతుందంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. బయట కనిపిస్తే కొట్టేస్తామంటూ పబ్లిక్ టాక్‌లో రవితేజ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రవితేజ ఎనర్జీ వరకు సినిమా ఓకే అని సరిపెట్టుకునే ఫ్యాన్స్ సైతం మిస్టర్ బచ్చన్ విషయంలో పెదవి విరుస్తున్నారు. మిస్టర్ బచ్చన్ ఇలా ఎలా తీశావ్ అంటూ హరీష్ శంకర్‌ను ట్రోల్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో మిస్టర్ బచ్చన్ సంగతి ఇలా ఉంటే.. సినిమా టీం మాత్రం సక్సెస్ సెలెబ్రేషన్స్ అంటూ ప్రెస్ మీట్ పెట్టింది. నిర్మాత, దర్శకుడు, హీరోయిన్ ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడారు. ఇక నెగెటివ్ రివ్యూలు, రేటింగ్‌ల మీద హరీష్ శంకర్ స్పందించాడు. తన సినిమా అందరికీ నచ్చాలనే అత్యాశ లేదన్నట్టుగా చెప్పుకొచ్చాడు. మిక్స్డ్ రివ్యూలు,రేటింగ్‌లు తనకు కొత్తేమీ కాదని, షోలు పెరుగుతున్న కొద్దీ పాజిటివ్ టాక్ వస్తోందని, మరిన్ని షోలు యాడ్ అవుతున్నాయని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సినిమాను భాగ్య శ్రీ కోసమే తీసినట్టుగా ఉందని, సినిమాలో పాటలు కాకుండా.. పాటల కోసమే సినిమాను తీసినట్టుగా ఉందని అంతా ట్రోలింగ్ చేయసాగారు. అంతే కాకుండా ఓ పాటలో వేయించిన స్టెప్పులు కూడా దారుణంగా ఉన్నారని, చూడటానికి కూడా ఎబ్బెట్టుగా ఉన్నాయని ట్రోలింగ్ చేస్తున్నారు. దీనిపై హరీష్ శంకర్ తన వివరణ ఇచ్చుకున్నాడు.
ఆ డ్యాన్స్ మూమెంట్స్ తనకు కూడా అంత ఇష్టం కాలేదట.. కానీ శేఖర్ మాస్టర్ మొదటి రోజే అలా స్టెప్పులు కంపోజ్ చేయడం.. అది తనకు నచ్చలేదని చెబితే.. ఎక్కడ లో అవుతారో అనుకున్నానని హరీష్ శంకర్ వివరణ ఇచ్చుకున్నాడు. సినిమా రిలీజ్‌కు ముందే ఇదే పాట మీద విమర్శలు వస్తే.. హరీష్ శంకర్ ఎదురు దాడి చేశాడు. రిలీజ్‌కు ముందు హరీష్ శంకర్ మాట్లాడిన మాటలు, విధానం, మొహంలో కనిపించిన హుషారు మాత్రం ఈ సక్సెస్ మీట్‌లో కనిపించలేదనే చెప్పొచ్చు.