హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సడెన్ షాక్.. వడ్డీ రేట్లు పెంపు.. ఇక ఎక్కువ కట్టాల్సిందే!

HDFC Bank Hikes MCLR Rate: ప్రైవేట్ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంకు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షాకింగ్ ప్రకటన చేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్లో వెల్లడించింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఈ పెంచిన లోన్ రేట్లు ఆగస్ట్ 8 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. ఎంపిక చేసిన కొన్ని టెన్యూర్లపై ఎంసీఎల్ఆర్ పెరిగినట్లు తెలిపింది. సవరించిన తర్వాత బ్యాంకులో ఎంసీఎల్ఆర్ రేట్ల శ్రేణి 9.10 శాతం నుంచి 9.45 శాతంగా ఉంది. ఓవర్‌నైట్ టెన్యూర్‌పై ఎంసీఎల్ఆర్ రేటు 5 బేసిస్ పాయింట్లు పెంచి 9.05 శాతం నుంచి 9.10 శాతానికి చేర్చింది.

ఇక ఈ బ్యాంకులో ఒక నెల ఎంసీఎల్ఆర్ 9.10 శాతం నుంచి 9.15 శాతానికి చేర్చింది. 3 నెలల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ అయితే 9.20 శాతం నుంచి 9.25 శాతానికి పెంచింది. 6 నెలల ఎంసీఎల్ఆర్ 9.35 శాతం నుంచి 9.40 శాతానికి పెంచింది బ్యాంకు. ఇక ఏడాది వ్యవధి ఉన్న ఎంసీఎల్ఆర్ పై గతంలో 9.40 శాతంగా ఉండగా.. 5 బేసిస్ పాయింట్లు పెంచడంతో ఇప్పుడు ఇది 9.45 శాతానికి చేరింది. రెండేళ్లు, మూడేళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ పెంచిన తర్వాత 9.45 శాతానికి చేరింది.

కన్జూమర్ లోన్లకు ఎక్కువగా ఏడాది టెన్యూర్ ఎంసీఎల్ఆర్ లింక్ అయి ఉంటుంది. అంటే ఏడాది టెన్యూర్ ఎంసీఎల్ఆర్ పెరిగితే.. లోన్ వడ్డీ రేట్లు పెరుగుతాయని అర్థం చేసుకోవాలి. ఈ ఎంసీఎల్ఆర్ పెరగడంతో .. ఇప్పుడు లోన్లపై చెల్లించాల్సిన ఈఎంఐ కూడా పెరుగుతుందని చెప్పొచ్చు.

ఎంసీఎల్ఆర్ అనేది తెలుగులో రుణ ఆధారిత వడ్డీ రేటు. ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ లోన్లపై వసూలు చేసే కనీస వడ్డీ రేటుగా పరిగణిస్తారు. అంటే అంతకంటే తక్కువ వడ్డీ రేటుకు లోన్ ఇచ్చేందుకు వీల్లేదన్నమాట. అన్ని బ్యాంకులకు ఒకే విధానం ఉండాలనే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. ఈ విధానం తీసుకొచ్చింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన సంగతి తెలిసిందే. ఎంపిక చేసిన రెండు టెన్యూర్ FD లపై 20 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లు పెంచేసింది. దీంతో ఇప్పుడు ఇక్కడ 35 నెలల డిపాజిట్‌పై 7.15 శాతంగా ఉండగా.. ఇప్పుడు 7.35 శాతానికి చేరింది. 55 నెలల డిపాజిట్‌పై 7.20 శాతం నుంచి 7.40 శాతానికి చేరింది. సీనియర్ సిటిజెన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ అందుతుంది.

About amaravatinews

Check Also

ఆకర్షణీయమైన ప్యాకేజీలకు ఆకర్షితులయ్యారో.. గోవిందా! విహార యాత్రల పేరుతో నయా దందా

టూర్స్ ట్రావెల్స్ ప్యాకేజీల పేరుతో ఈమధ్య కాలంలో దేశ వ్యాప్తంగా భారీ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇప్పటికే పలు చోట్ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *