గూగుల్ పే, పేటీఎం యూజర్లకు అలర్ట్.. రేపు ఆ బ్యాంక్ యూపీఐ సేవలు బంద్.. కారణమిదే!

UPI Downtime: ప్రస్తుతం మన దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు భారీగా పెరిగాయి. నిత్యం కోట్లాది ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. కిరాణ దుకాణం నుంచి పెద్ద పెద్ద అవసరాలకు సైతం యూపీఐ చేసే వెసులుబాటు ఉండడంతో గూగుల్ పే, ఫోన్, పే, పేటీఎం వంటి వాటి వినియోగం పెరిగింది. అయితే, బ్యాంక్ ఖాతాదారులు తమ బ్యాంక్ తీసుకునే నిర్ణయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. తాజాగా దేశీయ దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. సిస్టమ్ మెయింటనెన్స్ కారణంగా యూపీఐ సేవలు ఆగస్టు 10, 2024 రోజున అందుబాటులో ఉండవని తెలిపింది. ఆగస్టు 10వ తేదీన దాదాపు మూడు గంటల పాటు యూపీఐ పేమెంట్లు చేయలేరని బ్యాంక్ తెలిపింది.

ఈ మేరకు యూపీఐ డౌన్‌టైమ్ పై తమ కస్టమర్లకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తోంది. మరి ఏ సమయం నుంచి ఏ సమయం వరకు యూపీఐ డౌన్ టైమ్ ఉంటుంది. ఎలాంటి సేవలు నిలిచిపోనున్నాయి? ఏ సేవలు అందుబాటులో ఉంటాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కస్టమర్లకు పంపించిన ఇ-మెయిల్ ప్రకారం ఆగస్టు 10, 2024 రోజున తెల్లవారు జామున 2.30 గంటల నుంచి ఉదయం 5.30 గంటల వరకు డౌన్‌టైమ్ నిర్ణయించింది. అంటే ఈ మూడు గంటల పాటు యూపీఐ సేవలు అందుబాటులో ఉండవు.

పైన పేర్కొన్న డౌన్‌టైమ్ సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కరెంట్, సేవింగ్స్ అకౌంట్ ఉన్న వారికి ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు అందుబాటులో ఉంటాయి. అయితే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్, గూగుల్ పే, వాట్సాప్ పే, పేటీఎం, శ్రీరామ్ ఫైనాన్స్, మొబిక్విక్ లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు లికైన అకౌంట్లకు ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు అందుబాటులో ఉండవని బ్యాంకు తెలిపింది. మరోవైపు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులకు యూపీఐ లిమిట్ ఉంది. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి 24 గంటల్లో అంటే ఒక రోజులో గరిష్ఠంగా రూ. 1 లక్ష పంపించవచ్చు. లేకా 20 ట్రాన్సాక్షన్లు చేయవచ్చు.

About amaravatinews

Check Also

రైతులకు శుభవార్త.. ఈనెల 24న పీఎం కిసాన్‌ డబ్బులు.. వీరికి మాత్రం రావు!

రైతులకు మోడీ సర్కార్‌ శుభవార్త అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఈనెల 24న పీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *